బాజీరావ్ ఎలా ఉంటాడు? | Bajirao Mastani First Look: Ranveer Singh, Deepika Padukone, Priyanka Chopra | Sakshi
Sakshi News home page

బాజీరావ్ ఎలా ఉంటాడు?

Published Wed, Jul 15 2015 11:43 PM | Last Updated on Sun, Sep 3 2017 5:33 AM

బాజీరావ్ ఎలా ఉంటాడు?

బాజీరావ్ ఎలా ఉంటాడు?

బాజీరావ్ ఎలా ఉంటాడు? ఆయన మొదటి భార్య కాశీభాయ్ ఎలా ఉంటుంది? రెండో భార్య మస్తానీ ఎలా ఉంటుంది?

 బాజీరావ్ ఎలా ఉంటాడు? ఆయన మొదటి భార్య కాశీభాయ్ ఎలా ఉంటుంది? రెండో భార్య మస్తానీ ఎలా ఉంటుంది? కొన్ని రోజులుగా హిందీ రంగంలో సాగిన ఈ ప్రశ్నలకు బుధవారం సమాధానం లభించింది. మరాఠా పెషావర్ బాజీరావ్, ఆయన భార్యలిద్దరి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చారిత్రక చిత్రం - ‘బాజీరావ్ మస్తానీ’. స్వీయ దర్శకత్వంలో సంజయ్ లీలా భన్సాలీ రూపొందిస్తున్న ఈ చిత్రంలో బాజీరావ్‌గా రణ్‌వీర్ సింగ్ నటిస్తుంటే, మొదటి భార్య పాత్రను ప్రియాంకా చోప్రా, రెండో భార్య పాత్రను దీపికా పదుకొనే పోషిస్తున్నారు. ఈ చిత్రంలో వీరి గెటప్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న ఆసక్తి చాలామందికి ఉంది.
 
 బుధవారం విడుదల చేసిన రణ్‌వీర్, ప్రియాంక, దీపికల లుక్ చూసి, ‘ముగ్గురూ ముచ్చటగా ఉన్నారు’ అని అందరూ కితాబిచ్చారు. ఈ సినిమా కోసం రణ్‌వీర్ జుత్తు త్యాగం చేసిన వైనం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రియాంక, దీపికలు కొన్ని యుద్ధ విద్యలు నేర్చుకున్నారట. మొత్తం మీద చరిత్ర నేపథ్యంలో తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా చరిత్ర సృష్టిస్తుందనే అంచనాలు ఉన్నాయి. దాదాపు రూ. 120 కోట్ల నిర్మాణ వ్యయంతో రూపొందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌లో రిలీజ్ కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement