ఒకరికి ఒకరు! | get together | Sakshi
Sakshi News home page

ఒకరికి ఒకరు!

Published Fri, Mar 6 2015 11:48 PM | Last Updated on Sat, Sep 2 2017 10:24 PM

ఒకరికి ఒకరు!

ఒకరికి ఒకరు!

 హిందీ జంట దీపికా పడుకొనే, రణవీర్‌సింగ్‌ల మధ్య రోజురోజుకూ వ్యవహారం ముదురుతున్నట్టుంది. ఒకరిని వదిలి ఒకరు ఉండలేనంతగా కలసి తెగ తిరిగేస్తున్నారు. ఎక్కడ చూసినా వారే. రీసెంట్‌గా ఢిల్లీలో రణవీర్ స్నేహితుడు కరణ్ కపాడియా మ్యారేజ్ నిత్యా మెహ్రాతో జరిగింది. దీనికి ప్రేయసి దీపికతో సహా అటెండయ్యాడట. ‘తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ’ అంటూ పెళ్లివారంతా ఇద్దరినీ చుట్టుముట్టేశారట! ఇక రణవీర్ చెల్లి రితిక అయితే దీపికను అతుక్కుపోయింది.
 
 ఆ ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో క్రీజీగా మారాయి. రణవీర్ మాత్రం చెయ్యికి, మెడకు కలిపి కట్టు కట్టుకుని కాస్త డిఫరెంట్‌గా దర్శనమిచ్చాడు. ఏంటని ఆరా తీస్తే... జైపూర్‌లో షూటింగ్ సందర్భంగా హార్స్ రైడింగ్ చేస్తూ పట్టు తప్పి కింద పడ్డాడట మనోడు. భుజం విరిగి ఇప్పుడిలా అవస్థలు పడుతున్నాడు. పెళ్లి తరువాత కూడా ఈ ప్రేమ పావురాలు ఒక్కటిగా ఎగిరిపోయాయట!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement