కపిల్‌దేవ్‌ ఎవరు? | Star cricketer Kapil Dev is preparing for a film based on life | Sakshi
Sakshi News home page

కపిల్‌దేవ్‌ ఎవరు?

Published Fri, Jul 14 2017 11:57 PM | Last Updated on Tue, Sep 5 2017 4:02 PM

కపిల్‌దేవ్‌ ఎవరు?

కపిల్‌దేవ్‌ ఎవరు?

కపిల్‌ దేవ్‌ ఎవరు? ఇప్పుడు బాలీవుడ్‌లో జరుగుతోన్న చర్చ ఇది. ఏంటీ?  స్టార్‌ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ గురించి తెలియదా? అనుకుంటున్నారా? అస లు విషయం ఏంటంటే కపిల్‌ దేవ్‌ జీవితం ఆధారంగా ఓ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి.  కబీర్‌ ఖాన్‌ దర్శకత్వంలో అనురాగ్‌ కశ్యప్‌ ఈ బయోపిక్‌ను నిర్మించనున్నారు. ఇందులో కపిల్‌ పూర్తి జీవిత విశేషాలతో పాటు 1983లో కపిల్‌ ఇండియా క్రికెట్‌ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నప్పుడు ప్రపంచ కప్‌ సాధించడంలో కీలకపాత్ర వహించిన ఘట్టాన్ని తెరపై ఆవిష్కరించనున్నారు.

ఇంతవరకూ బాగానే ఉన్నా కపిల్‌ పాత్రలో ఎవరు కనిపిస్తారన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న. నిన్న మొన్నటి వరకూ అర్జున్‌కపూర్, సల్మాన్‌ఖాన్, రణ్‌వీర్‌ సింగ్‌తో పాటు మరికొందరి పేర్లు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు సీనియర్‌ హీరో సల్మాన్‌ని వద్దనుకుంటున్నారట. అర్జున్‌ కపూర్, రణ్‌వీర్‌ సింగ్‌  రేసులో ఉన్నారట. మరి ఈ ఇద్దరిలో కపిల్‌దేవ్‌ ఎవరు? అనేది వేచి చూడాల్సిందే. ఏదేమైనా ఈ మధ్య బాలీవుడ్‌లో బయోపిక్‌లు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా క్రికెట్‌ ప్లేయర్స్‌లో ఇప్పటికే ధోని, సచిన్‌ టెండూల్కర్ల జీవితాల ఆధారంగా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు కపిల్‌ దేవ్‌. భవిష్యత్తులో ఎంతమంది క్రికెట్‌ ప్లేయర్ల జీవితాలు తెరపైకి వస్తాయో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement