ప్రాక్టీస్‌ స్టార్ట్‌ | Ranveer Singh begins prepping for Kapil Dev biopic 83 | Sakshi
Sakshi News home page

ప్రాక్టీస్‌ స్టార్ట్‌

Published Sun, Jan 13 2019 2:59 AM | Last Updated on Sun, Jan 13 2019 2:59 AM

Ranveer Singh begins prepping for Kapil Dev biopic 83  - Sakshi

ముంబైలోని జేవీపిడీ గ్రౌండ్స్‌కి వెళ్లారు రణ్‌వీర్‌ సింగ్‌ అండ్‌ కబీర్‌ఖాన్‌. సరదాగా ఏదైనా గేమ్‌ ఆడటానికి కాదు. రణ్‌వీర్‌ హీరోగా కబీర్‌ దర్శకత్వంలో రూపొందనున్న ‘1983’ సినిమా కోసమే. 1983లో ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ ప్రపంచకప్‌ సాధించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ టీమ్‌ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో రూపొందనున్న ఈ   సినిమాలో కపిల్‌దేవ్‌ పాత్రను రణ్‌వీర్‌ పోషించనున్న సంగతి తెలిసిందే.

ఇందు కోసమే గ్రౌండ్‌కి వెళ్లి క్రికెట్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నారట రణ్‌వీర్‌ సింగ్‌. దీన్నిబట్టి ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్తుందని ఊహించవచ్చు. మరోవైపు జోయా అక్తర్‌ దర్శకత్వంలో రణ్‌వీర్‌ నటించిన ‘గల్లీబాయ్‌’ ట్రైలర్‌ రీసెంట్‌గా విడుదలైంది. ఈ చిత్రం వచ్చే నెల 14న విడుదల కానుంది. ఇంకా ‘తక్త్‌’ సినిమాలో నటిస్తారు రణ్‌వీర్‌. ఇక గతేడాది బాలీవుడ్‌ అందాలభామ దీపికా పదుకోన్‌తో కలిసి రణ్‌వీర్‌ ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement