రోహిత్ శెట్టి, రణ్‌వీర్ సింగ్
అందరికీ బర్త్‌డేకి అడ్వాన్స్ విషెస్ లభిస్తాయి. కానీ బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్‌కి అడ్వాన్స్ బర్త్‌డే గిఫ్ట్స్ లభిస్తున్నాయి. రణ్‌వీర్ బర్త్ డే ఈనెల 6న. వారం ముందే ఓ మంచి వాచ్ గిఫ్ట్‌గా బçహూకరించారట దర్శకుడు రోహిత్ శెట్టి. తెలుగు హిట్ మూవీ ‘టెంపర్’ హిందీ రీమేక్ ‘సింబా’లో రణ్‌వీర్ సింగ్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ షూటింగ్‌లో రణ్‌వీర్‌కు రోహిత్ శెట్టి వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారట. ‘‘బాస్ (రోహిత్ శెట్టి) ఓ వారం ముందే బర్త్‌డే ప్రజెంట్ ఇచ్చేశారు. ఇప్పటివరకు నేను చూసినవాటిలో ఇదే సూపర్ వాచ్. థ్యాంక్యూ సార్’’ అంటూ ఈ విషయాన్ని ట్వీటర్‌లో తెలిపారు రణ్‌వీర్ సింగ్. ‘సింబా’ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 28న రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment