Rohith Shetty
-
నాన్న పెద్ద నటుడు.. నా తొలి సంపాదన రూ. 35 మాత్రమే: స్టార్ దర్శకుడు
Rohit Shetty Real Life Story In Telugu: Unknown Facts About Him: రోహిత్ శెట్టి.. బాలీవుడ్ కమర్షియల్ హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచారు. తాజాగా థియేటర్లలో విడుదలైన రోహిత్ శెట్టి సినిమా.. సూర్యవంశీ... వసూళ్లలో దూసుకుపోతుంది. లాక్డౌన్ అనంతరం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ సూపర్‌హిట్‌గా దూసుకుపోతుంది. ప్రస్తుతం సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడిగా కోట్లలో పారితోషికం తీసుకుంటున్న రోహిత్‌శెట్టి తొలి సంపాదన ఎంతో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు. బాలీవుడ్లో పని చేస్తున్న తొలి రోజుల్లో అతడి సంపాదన కేవలం 35 రూపాయలు మాత్రమేనట. సామాన్యులకయితే అనుకోవచ్చు.. కానీ అప్పటికే రోహిత్ శెట్టి తండ్రి పెద్ద నటుడు, స్టంట్‌మ్యాన్, కొరియోగ్రాఫర్ కూడా. అలాంటి రోహిత్‌శెట్టి కేవలం 35 రూపాయల వేతనం పొందడం ఆశ్చర్యం అనిపిస్తుంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రోహిత్ శెట్టి తన బాలీవుడ్ ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఆ వివరాలు.. (చదవండి: ఆల్రెడీ పెళ్లైన దర్శకుడిని ప్రేమించిన హీరోయిన్!) రోహిత్ శెట్టి తండ్రి ఎంబీ శెట్టి ప్రముఖ నటుడు, కొరియాగ్రాఫర్, స్టంట్‌మ్యాన్ కూడా. అప్పటికే ఆయనకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. ఇక తన 16వ ఏట నుంచి పని చేయడం ప్రారంభించానన్నాడు రోహిత్‌శెట్టి. కర్లీ టేల్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ మాట్లాడుతూ.. ‘‘ 16 ఏట నుంచే పని చేయడం ప్రారంభించాను. చీఫ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసేవాడిని. అప్పటికే మా నాన్న గారు బాలీవుడ్లో ప్రముఖ నటుడు. అయినప్పటికి కూడా నా ప్రయాణం అంత సజావుగా సాగలేదు’’ అని తెలిపాడు. ‘‘బాలీవుడ్లో నా తొలి సంపాదన 35 రూపాయలు. ప్రతిరోజు రెండు గంటలపాటు నడిచి.. సినిమా సెట్‌కు చేరుకునేవాడిని. ఒక్కోసారి చేతిలో చాలా తక్కువ మొత్తం ఉండేది. ఆ డబ్బు ఖర్చు పెట్టి.. భోజనం చేస్తే.. ఇంటికి వెళ్లడానికి చార్జీలకు డబ్బులుండేవి కాదు. చార్జీలకు దాచుకుంటే.. తినడానికి ఉండేది కాదు. ఇక ముంబైలో ఉన్న రోడ్లన్ని నాకు కొట్టిన పిండి. షార్ట్‌కట్స్ అని నాకు తెలుసు. ప్రస్తుతం కారులో వెళ్తున్నప్పుడు షార్ట్‌కట్ గురించి చెప్తే నా డ్రైవర్ నావైపు ఈయన గతంలో దొంగతనాలు చేసేవాడా ఏంటి అన్నట్లు అనుమానంగా చూస్తాడు’’ అని తెలిపాడు. మా నాన్నగారి స్టార్డం నాకు ఏవిధంగాను ఉపయోగపడలేదు. నా సొంతంగా ఎదిగి.. ఈ స్థాయికి చేరుకున్నాను అని తెలిపాడు. (చదవండి: 100 కోట్ల మార్క్‌ను దాటిన సూర్యవంశీ.. ఓటీటీలో వచ్చేది ఎప్పుడంటే..?) ప్రస్తుతం రోహిత్ శెట్టి రణవీర్ సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో రోహిత్ శెట్టి సర్కస్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే రోహిత్ శెట్టి తనకు మాత్రమే ప్రత్యేకమైన పోలీసు చిత్రంలో మహిళ ప్రధాన పాత్రలో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి: ఫీమేల్ పోలీస్ ఆఫిసర్ లీడ్‌లో రోహిత్ శెట్టి చిత్రం.. -
అక్షయ్‌ని చీపురుతో కొట్టిన కత్రినా..!
-
అక్షయ్‌ని చీపురుతో కొట్టిన కత్రినా..!
ముంబై : రోహిత్‌శెట్టి దర్శకత్వంలో బాలీవుడ్ కిలాడీ అక్షయ్‌కుమార్, కత్రినాకైఫ్ హీరోహీరోయిన్లుగా వస్తున్న చిత్రం సూర్యవంశి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే, సినిమా చిత్రీకరణ సమయంలో.. కత్రినా సూర్యవంశి సెట్స్‌ను శుభ్రం చేసేందుకు నడుం బిగించారు. ఈ స్టార్ హీరోయిన్ ఫ్లోర్ శుభ్రం చేస్తుండగా గమనించిన అక్షయ్.. సరదాగా వీడియో తీశాడు. ‘కత్రినా జీ ఏం చేస్తున్నారు’ అని అక్షయ్ అడగ్గా.. ఫ్లోర్ శుభ్రం చేస్తున్నానని ఆమె నవ్వుతూ బదులిస్తుంది. కొంచెం తప్పుకోండి అక్కడ శుభ్రం చేస్తానని చెప్పి.. చీపురుతో కొడుతుంది. ఇక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన అక్షయ్.. ‘స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి అంబాసిడర్ దొరికారు’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. -
గోల గోల కామిక్స్
పరిగెత్తే చిత్రాలకి నిలబడే చిత్రాలకి తేడా అదే.నిలబడే చిత్రాలు నిలిచిపోతాయి.మనసపై ముద్రించుకుపోతాయి.పిల్లలకు మంచి సందేశాన్నిస్తాయి. ఉత్సాహాన్ని నింపుతాయి.అవును. నిలబడే చిత్రాలు పిల్లల మనసులను పరిగెత్తిస్తాయి. రజనీకాంత్‌కు చిన్నపిల్లలు ఫ్యాన్స్‌గా ఉండొచ్చు. సల్మాన్ ఖాన్‌కు చిన్నపిల్లలు ఫ్యాన్స్‌గా ఉండొచ్చు. కాని ఒక డైరెక్టర్‌కు పిల్లలు ఫ్యాన్స్‌గా ఉండటం కిడ్స్ పేజీలో రావాల్సిన న్యూసే. డైరెక్టర్ రోహిత్ షెట్టి తీసిన కామెడీ సిరీస్ ‘గోల్మాల్ ఫన్ అన్లిమిటెడ్’, ‘గోల్మాల్ రిటర్న్స్’, ‘గోల్ మాల్ 3’, ‘గోల్మాల్ అగైన్’ భారీ హిట్స్‌గా నిలిచాయి. ఆ తర్వాత టీవీలో పదే పదే ప్రసారం అవుతూ పిల్లలు ఎంజాయ్ చేసే సినిమాలుగా మారాయి. ఈ సిరీసే కాదు రోహిత్ షెట్టి తీసిన ‘సింగమ్’, ‘సింగమ్ రిటర్న్స్’ సినిమాలు కూడా కాప్ మూవీస్‌గా పిల్లలకు బాగా నచ్చాయి. దాంతో ఈ సినిమాలను పిల్లలకు మరింత దగ్గర చేయడానికి వీటి ఆధారంగా కామిక్స్‌గా తయారవుతున్నాయి. గత సంవత్సరం ‘లిటిల్ సింగమ్’ పేరుతో ఒక కామిక్ సిరీస్ ‘డిస్కవరీ కిడ్స్’లో మొదలయ్యి బాల సింగమ్ చేసే సాహసాలతో పిల్లలను ఆకట్టుకుంది. ఇప్పుడు ‘గోల్మాల్’ సిరిస్‌లోని పాత్రలతో ‘గోల్మాల్ జూనియర్’ కామిక్ సిరీస్ నిక్‌లోడియన్ గ్రూప్‌కు చెందిన ‘సోనిక్ చానెల్’లో ఈ నెల 13 నుంచి ప్రసారం కానుంది. ఈ సందర్భంగా పిల్లల గురించి, రాబోయే సినిమాల గురించి రోహిత్ శెట్టి ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ∙మీ సినిమాలలో స్టంట్స్ ఫేమస్. ఇవి పిల్లలను దృష్టిలో పెట్టుకునే ప్లాన్ చేస్తారా? రోహిత్: ఫైట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? మనం కూడా మన చిన్నప్పటి విషయాలను గుర్తు చేసుకుంటే అట్ట కత్తులతో బొమ్మ తుపాకులతో ఫైట్ చేసే ఆటలే ఆడుకుని ఉంటాం. అదీ గాక మా నాన్న ఎం.బి.శెట్టి పెద్ద స్టంట్ డైరెక్టర్. అందువల్ల కూడా నాకు స్టంట్స్ అంటే ఇష్టం ఏర్పడి ఉంటుంది. ∙మీ ఫైట్స్ సైన్స్ సూత్రాలు పాటించవు. గాల్లో కార్లు ఎలా ఎగురుతాయి? ఆకాశంలో ఎగరాల్సిన విమాన కంపెనీలు మూత పడుతున్నాయి (చిన్న నవ్వు). కనీసం కార్లైనా ఎగరనివ్వండి. ఏమో... ఇంకో పది పన్నెండేళ్లకు నిజంగానే ఎగిరే కార్లు రావని గ్యారంటీ ఏమిటీ. అప్పుడు అందరూ నన్నే తలుచుకుంటారు. ∙మీ బాల్యం గురించి చెప్పండి? మా నాన్నగారికి మా అమ్మ రత్నా శెట్టి రెండో భార్య. నా ఎనిమిదేళ్ల వయసులోనే మా నాన్న చనిపోయారు. అప్పటికి ఆయన వయసు యాభై కూడా ఉండదు. ఆయన జీవించి ఉండగా చాలా ఫేమస్. సౌత్ సినిమాలలో చాలా వాటిల్లో నటించారు (ఎన్.టి.ఆర్ ‘డ్రైవర్ రాముడు’లో బొర్రాగుహల ఫైట్ సీన్లో ఎం.బి.శెట్టి నటించారు). అయితే ఆయన చనిపోవడంతో అమ్మ సింగిల్ మదర్‌గా నన్ను పెంచింది. ఆమె చాలా ధైర్యమున్న స్త్రీ. నా ప్రతి జీవిత సందర్భంలో ఆమెను చూసే ధైర్యం తెచ్చుకున్నాను. ఆమె ఈ రోజుకీ నాతోనే ఉంటోంది. బయట ఎన్ని చికాకులు ఎదురై ఇంటికి వెళ్లినా అమ్మను చూడగానే అమ్మయ్య... అమ్మ ఉంది కదా అనే ధైర్యం వచ్చేస్తుంటుంది. చేసే పని ఏదైనా దానిని నిజాయితీతో చేయాలి అని ఆమె నూరిపోసిన విలువను గట్టిగా పాటిస్తాను. ఆమె కూడా నాన్నతోనే స్టంట్ ఉమన్‌గా పని చేసింది. కనుక నా మీద సినిమా ప్రభావం అనివార్యంగా పడింది. నేను ముందు నుంచి సినిమా రంగంలో పని చేయాలని అనుకున్నాను. నా పదిహేడవ ఏటే అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాను. ముప్పయ్యవ ఏట డైరెక్టర్ అయ్యాను. ∙మీ గోల్మాల్ సిరీస్‌లోని పాత్రలు ఇప్పుడు కామిక్ క్యారెక్టర్స్ మారేంత ఫేమస్ అయ్యాయి... అవును. ఇది నాకు చాలా సంతోషాన్నిస్తోంది. గోల్మాల్ తీస్తున్నప్పుడు ఇది మొదట పిల్లలకు నచ్చాలి అనుకున్నాను. పిల్లలకు నచ్చితే వారే తల్లిదండ్రులను థియేటర్‌కు తీసుకుని వస్తారు. పిల్లలు చూస్తారు కనుక నా సినిమాల్లో అశ్లీలత కనిపించకుండా జాగ్రత్త పడతాను. గోల్మాల్ సిరిస్‌లో అజయ్ దేవగణ్ వేసిన గోపాల్ పాత్ర, తుషార్ కపూర్ వేసిన లక్కీ పాత్ర, అర్షద్ వర్సీ వేసిన మాధవ్ పాత్ర, షర్మన్ జోషి వేసిన లక్ష్మణ్ పాత్ర ఇవి పిల్లలకు నచ్చాయి. నికొలొడియన్ సంస్థ నా సంస్థతో కలిసి ఈ క్యారెక్టర్స్‌తో కామిక్స్ చేద్దామని అన్నప్పుడు సంతోషంగా అంగీకరించాను. సినిమాల్లో కేవలం మూడు గంటల పాటే వీరి అల్లరి ఉంటుంది. టీవీలో ఇక మీదట రోజూ ఉంటుంది. సోనిక్ చానల్లో మధ్యాహ్నం 1.30కు ఈ గోల్మాల్ జూనియర్ చూడవచ్చు. ∙గోల్‌మాల్‌లో తుషార్ వేసే మూగ పాత్ర చాలామంది పిల్లలకు ఇష్టమని గమనించారా? తుషార్‌కు ఆ పాత్ర చాలా పేరు తెచ్చింది. అతడు మూగభాష మాట్లాడుతుంటే పర్ఫెక్ట్ టైమింగ్‌తో దాని అర్థాన్ని షర్మన్ జోషి చెబుతుంటాడు. తుషార్ మూగవాడైనందుకు దిగులుగా చింతగా ఉండడు. ఎనర్జిటిక్‌గా ఉంటాడు. లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటాడు. మనకు ఏవైనా లోపాలు ఉన్నా లైఫ్‌ను సరదాగా తీసుకుని ముందుకు సాగాలని పిల్లలు అనుకుంటే మంచిదే కదా. ∙మీ చిన్నప్పుడు మీకిష్టమైన కామిక్ క్యారెక్టర్ ఏది? టిన్టిన్. అది చేసే అడ్వంచర్స్ చాలా ఇష్టపడేవాణ్ణి. కంటెంట్ వల్ల మాత్రమే కాదు ఆ కామిక్స్ క్వాలిటీ చాలా బాగుండేది. అందువల్ల కూడా ఇష్టపడేవాణ్ణి. ∙మీరు ‘సింగమ్ సిరిస్’ నుంచి ‘లిటిల్ సింగమ్’ కామిక్ క్యారెక్టర్ పుట్టించారు. ఆడపిల్లలు కూడా శక్తిమంతులే కదా. అబ్బాయిలేనా? అక్కడికే రాబోతున్నాను. నా సింగం సినిమాల్లో సూపర్ కాప్‌గా అజయ్ దేవగణ్ కనిపిస్తారు. కాని నిజ జీవితంలో సూపర్ లేడీ కాప్స్ కూడా ఉంటారు. స్త్రీలు ఎందులోనూ తక్కువ కాదు. అందుకే లేడీ సూపర్ కాప్‌తో ఒక సినిమా చేయనున్నాను. అది కూడా కామిక్ క్యారెక్టర్‌గా మారితే ఆడపిల్లలను ఇన్‌స్పయిర్ చేయొచ్చు. ∙ఎవరా సూపర్ లేడీ కాప్. కరీనానా? కత్రీనానా? ఇలాంటి ప్రశ్నలు వేసి రేపు నన్ను హెడ్‌లైన్స్‌లో ఇరికించకండీ. నేను కొంచెం స్మార్ట్. అప్పడే బయట పెట్టను (నవ్వుతూ). ∙నేటి పిల్లలు ఎలా ఉన్నారు? నా కొడుక్కు ఇప్పుడు 13 సంవత్సరాలు. నా సినిమాలన్నీ బాగా ఎంజాయ్ చేస్తాడు. పిల్లలు హోమ్ వర్కు, హాబీ క్లాసు, గోల్డ్ మెడలు, టాప్ ర్యాంక్ వీటి చుట్టూ తిరుగుతున్నారు. వాటికి ఎంత విలువ ఇవ్వాలి పిల్లలు ఎంత రిలాక్స్ అవ్వాలి అనేది మనం ఆలోచించాలి. సమ్మర్ హాలిడేస్‌లో కూడా వారిని ఆడుకోనివ్వకుండా చదివించడం సరైనది కాదు. అందుకే అవన్నీ మర్చిపోండి... హాయిగా రోజులో కాసేపైనా మీకు నచ్చిన కామిక్స్ చూడండి అని చెప్పాలనిపిస్తుంది. ∙మీ జీవితం నుంచి వారికి ఏం చెప్తారు? కష్టపడమని చెప్తాను. కష్టపడకుండా ఏదీ రాదు. పనిని లేదా చదువును ఎంజాయ్ చేయమని కూడా చెప్తాను. ఉదయాన్నే లేచి షూటింగ్‌కు వెళ్లడం నాకు ఇష్టం. ఖాళీగా ఉండటం ఇష్టం ఉండదు. షూటింగ్ కోసం ఒక్కోసారి ఉదయం ఆరు గంటలకు బయలుదేరి వెళతాను. పనులు ముగిసే సరికి రాత్రి పన్నెండు కూడా కావచ్చు. కాని మళ్లీ తెల్లారి ఆరుగంటలకు అంతే ఉత్సాహంగా బయలుదేరుతాను. 2003లో నేను డైరెక్టర్‌ను అయితే నేటివరకు దాదాపు ఏ సంవత్సరంలోనూ నా సినిమా రిలీజ్ కాకుండా లేదు. పని చేయడం బాగుంటుంది. పని చేయాలి. ∙మీ తాజా చిత్రం ‘సూర్యవంశీ’లో అక్షయ్ కుమార్ హీరో. అతనిపాత్ర సూపర్ కాప్. ‘అవెంజర్స్’ లాంటి పాత్రల ప్రభావం మీ మీద ఉందా? లేదు. అవెంజర్స్‌తో పోలిక చాలా పెద్ద మాట. అది జోక్ అవుతుంది. నా సూపర్ హీరోలు లోకల్ హీరోలు. వాళ్లు కూడా చెడు మీద పోరాడతారు. వాళ్లు లోకల్‌గా ఇన్ఫ్లూయెన్స్ చేస్తే చాలు. ప్రపంచాన్ని చేయక్కర్లేదు. నా ‘సూర్యవంశీ’లో అక్షయ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌కు హెడ్‌గా కనిపిస్తారు. వివరాలు మాత్రం 2020 మేలో వెండితెర మీద చూడండి. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
వాచ్ వచ్చె
అందరికీ బర్త్‌డేకి అడ్వాన్స్ విషెస్ లభిస్తాయి. కానీ బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్‌కి అడ్వాన్స్ బర్త్‌డే గిఫ్ట్స్ లభిస్తున్నాయి. రణ్వీర్ బర్త్ డే ఈనెల 6న. వారం ముందే ఓ మంచి వాచ్ గిఫ్ట్‌గా బçహూకరించారట దర్శకుడు రోహిత్ శెట్టి. తెలుగు హిట్ మూవీ ‘టెంపర్’ హిందీ రీమేక్ ‘సింబా’లో రణ్వీర్ సింగ్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ షూటింగ్లో రణ్‌వీర్‌కు రోహిత్ శెట్టి వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారట. ‘‘బాస్ (రోహిత్ శెట్టి) ఓ వారం ముందే బర్త్‌డే ప్రజెంట్ ఇచ్చేశారు. ఇప్పటివరకు నేను చూసినవాటిలో ఇదే సూపర్ వాచ్. థ్యాంక్యూ సార్’’ అంటూ ఈ విషయాన్ని ట్వీటర్లో తెలిపారు రణ్వీర్ సింగ్. ‘సింబా’ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 28న రిలీజ్ కానుంది. -
సింబా స్టార్ట్
ముంబై టెంపర్‌ను హైదరాబాద్‌లో మొదలుపెట్టారు హీరో రణ్వీర్ సింగ్. ఇందుకోసం ఆల్మోస్ట్ టు మంత్స్ ఇక్కడే పాగా వేస్తారు. ‘గోల్మాల్ అండ్ సింగమ్ ఫ్రాంచైజీ, చెన్నై ఎక్స్‌ప్రెస్’ వంటి హిట్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు రోహిత్‌శెట్టి నేతృత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘సింబా’. ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై రోహిత్ శెట్టి, కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. తెలుగులో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘టెంపర్’ చిత్రానికి హిందీ రీమేక్ ఇది. సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ బుధవారం హైదరాబాద్‌లో మొదలైంది. రెండు నెలల పాటు కంటిన్యూస్‌గా ఇక్కడే షూటింగ్ ప్లాన్ చేశారట. ఇందులో అజయ్ దేవగన్ గెస్ట్ రోల్ చేస్తారని బీటౌన్ ఖబర్. ‘సింబా’ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 28న రిలీజ్ చేయనున్నట్లు ఆల్రెడీ చిత్రబృందం అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. -
అతను చీటర్.. చీటర్.. చీటర్!
మూడు సార్లు ఇంత బలంగా చీటర్.. చీటర్... చీటర్ అని పరిణీతి చోప్రా చెబుతున్నారంటే.. అతనెవరో పెద్ద మోసమే చేసి ఉంటాడు. ఇంతకీ అతనెవరు? అంటే.. ఇంకెవరో కాదు. ఈ మధ్యే విడుదలైన ‘గోల్మాల్ ఎగైన్’ దర్శకుడు రోహిత్‌శెట్టి. అజయ్ దేవ్గన్, పరిణీతీ చోప్రా, టబు, అర్షద్ వార్షి ముఖ్య తారలుగా రూపొందిన ఈ చిత్రం బీ టౌన్ బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లను రాబట్టి, 200 కోట్ల క్లబ్‌లోకి చేరిన సంగతి తెలిసిందే. ఈ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తూ, షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని విశేషాలను పరిణీతి గుర్తు చేసుకున్నారు. అందులో రోహిత్ శెట్టితో ఆమె క్రికెట్ ఆడిన ఇన్సిడెంట్ ఒకటి. ఆ సమయంలో వీడియో కూడా తీశారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న పరిణీతి లాంగ్ఆన్ షాట్ కొట్టారు. నాన్–స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న రోహిత్ శెట్టి ముందు రన్‌కు ట్రై చేసి, సడన్‌గా వెనక్కి వెళ్లారు. అక్కడితో ఆగకుండా మళ్లీ ట్రై చేయడంతో పరిణీతి చోప్రా రనౌట్ అయ్యారు. ఈ సీన్‌కు చిత్రబృందం అంతా నవ్వేశారు. దీంతో ‘మోసం.. మోసం.. అంతా మోసం’ అంటూ రోహిత్ శెట్టిపై సరదాగా అలిగారు పరిణీతి. ‘‘ రోహిత్ శెట్టి సార్ నన్ను చీట్ చేశారు. రనౌట్ అయ్యాను. ఆయన చీటర్.. చీటర్.. చీటర్’’ అని పరిణీతి పేర్కొన్నారు. -
దుమ్మురేపుతున్న 'గోల్మాల్'.. రికార్డు కలెక్షన్స్!
రోహిత్ షెట్టీ, అజయ్ దేవగణ్ కాంబినేషన్లో వచ్చిన 'గోల్మాల్ అగైన్' బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. హర్రర్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు మిక్స్డ్ రివ్యూలు వచ్చినప్పటికీ.. వసూళ్లు మాత్రం జోరుగా ఉన్నాయి. ఈ సినిమా నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించింది. ఈ ఏడాది బాలీవుడ్‌కు పెద్దగా కలిసిరాలేదు. బాలీవుడ్ బడా స్టార్ల సినిమాలు బాక్సాఫీస్ వద్ద తడబడ్డాయి. ఈ క్రమంలో 'గోల్మాల్ అగైన్' ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, అజయ్-రోహిత్ కాంబో మరోసారి తమపై పెట్టుకున్న అంచనాలను నిలబెట్టుకుంది. 'గోల్మాల్' సిరీస్ మరో బంపర్ విజయాన్ని అందుకుంది. 'గోల్మాల్-3' తర్వాత నాలుగో పార్టు కూడా వరుసగా వందకోట్ల క్లబ్బులో చేరడం గమనార్హం. ఈ సినిమా తొలిరోజు శుక్రవారం రూ. 30.10 కోట్లు, శనివారం రూ. 28 కోట్లు, ఆదివారం రూ. 29.09 కోట్లు, సోమవారం రూ. 16.04 కోట్లు వసూలు చేసిందని, మొత్తంగా రూ. 103.64 కోట్లుసాధించిందని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్లో వెల్లడించారు. సోమవారం సైతం ఈ సినిమా రూ. 16 కోట్లకుపైగా వసూలు చేయడం ట్రేడ్ పండితులను విస్మయపరుస్తోంది. థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న ఈ సినిమా మరింతగా వసూళ్లు రాబట్టే అవకాశముందని భావిస్తున్నారు. ఈ దీపావళి పండుగకు ఆమిర్ ఖాన్ 'సీక్రెట్ సూపర్ స్టార్', అజయ్ దేవగణ్ 'గోల్మాల్ అగైన్' పోటీపడ్డాయి. ఆమిర్ సినిమాకు పెద్ద ఎత్తున పాజిటివ్ మౌత్‌టాక్ వచ్చినప్పటికీ.. భారీ ఎత్తున విడుదలైన 'గోల్మాల్ అగైన్' ఊహించినట్టుగానే పెద్ద మొత్తంలో వసూళ్లు రాబడుతోంది. రోహిత్ షెట్టీ దర్శకత్వంలో గతంలో వచ్చిన 'గోల్మాల్' సిరీస్ సినిమాలు మంచి ప్రేక్షకాదరణ సాధించాయి. గత సినిమాలు సూపర్ హిట్ అయిన నేపథ్యంలో తాజాగా 'గోల్మాల్ అగైన్'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అజయ్ దేవ్‌గణ్, అర్షద్ వార్సీ, పరిణీత చోప్రా, తుషార్ కపూర్, టబు తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. -
గోల్మాల్ అగైన్: తొలిరోజు దుమ్మురేపింది!
రోహిత్ షెట్టీ, అజయ్ దేవగణ్ కాంబినేషన్లో వచ్చిన 'గోల్మాల్ అగైన్' బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. హర్రర్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు మిక్స్డ్ రివ్యూలు వచ్చినప్పటికీ.. వసూళ్లు మాత్రం జోరుగా ఉన్నాయని తెలుస్తోంది. తొలిరోజు ఈ సినిమా రూ. 33 కోట్ల భారీ వసూళ్లు రాబట్టింది. ఈ దీపావళి పండుగకు ఆమిర్ ఖాన్ 'సీక్రెట్ సూపర్ స్టార్', అజయ్ దేవగణ్ 'గోల్మాల్ అగైన్' పోటీపడ్డాయి. ఆమిర్ సినిమాకు పెద్ద ఎత్తున పాజిటివ్ మౌత్‌టాక్ వచ్చినప్పటికీ.. చిన్న సినిమాగా విడుదలైన 'సీక్రెట్ సూపర్‌స్టార్' తొలిరోజు రూ. 4.75 కోట్లు వసూలు చేసింది. రెండురోజు ఈ సినిమా వసూళ్లు గణనీయంగా పెరిగి రూ. 9 కోట్లు రాబట్టింది. మొత్తంగా తొలి రెండు రోజుల్లో సీక్రెట్ సూపర్‌స్టార్ రూ. 13 కోట్లు రాబట్టగా.. భారీ ఎత్తున విడుదలైన 'గోల్మాల్ అగైన్' ఊహించినట్టుగానే పెద్ద మొత్తంలో వసూళ్లు రాబడుతోంది. ఆమిర్ సినిమా రాకపోయి ఉంటే ఈ సినిమా తొలిరోజు రికార్డుస్థాయిలో రూ. 45 కోట్లు రాబట్టి ఉండేదని బాలీవుడ్ బాక్సాఫీస్ వర్గాలు చెప్తున్నాయి. రోహిత్ షెట్టీ దర్శకత్వంలో గతంలో వచ్చిన 'గోల్మాల్' సిరీస్ సినిమాలు మంచి ప్రేక్షకాదరణ సాధించాయి. గత సినిమాలు సూపర్ హిట్ అయిన నేపథ్యంలో తాజాగా 'గోల్మాల్ అగైన్'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలకు అనుగుణంగా ఈ సినిమా వసూళ్లు ఉన్నాయని బాలీవుడ్ ట్రేడ్ పండితులు చెప్తున్నారు. అజయ్ దేవ్‌గణ్, అర్షద్ వార్సీ, పరిణీత చోప్రా, తుషార్ కపూర్, టబు తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. -
తెలుగులో బాలీవుడ్ సీక్వల్
గోల్మాల్ సిరీస్‌లో ఇప్పటికే మూడు సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు రోహిత్ శెట్టి, త్వరలో నాలుగో సినిమాతో రాబోతున్నాడు. గోల్మాల్ ఎగైన్ పేరుతో తెరకెక్కిన ఈసినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో అజయ్ దేవగణ్, అర్షద్ వార్సీ, పరిణితి చోప్రా, తుషార్ కపూర్, ప్రకాశ్ రాజ్, టబులు లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ సినిమాతోనే టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే తెలుగు వారికి కూడా సుపరిచితమైన గోల్ మాల్ సిరీస్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీపావళి సందర్భంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాను ఒకేసారి హిందీ పాటు తెలుగులో కూడా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. -
టెంపర్ హిందీ రీమేక్‌కు హీరో ఫిక్స్
ఎన్టీఆర్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన సూపర్ హిట్ సినిమా 'టెంపర్'. ఎన్టీఆర్లోని కొత్త కోణాన్ని చూపించడమే కాకుండా ఆయన కెరీర్ కు ఈ సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. చాలా కాలంగా ఈ సినిమా హిందీ రీమేక్ విషయంలో చర్చలు జరుగుతున్న హీరో మాత్రం ఫైనల్ కాలేదు. తాజాగా టెంపర్ హిందీ రీమేక్ కు హీరోను ఫిక్స్ చేశారు. ముందు నుంచి అనుకుంటున్నట్టుగానే బాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ టెంపర్ రీమేక్ లో నటిస్తున్నాడు. మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు రోహిత్ శెట్టి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం రణ్వీర్ సింగ్, సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పద్మావతి' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత టెంపర్ రీమేక్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
షారూఖ్, దీపికా భయపెడతారట..?
ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్‌ప్రెస్, హ్యాపి న్యూఇయర్ సినిమాలతో ఆకట్టుకున్న బాలీవుడ్ హాట్ కపుల్ షారూఖ్ ఖాన్, దీపికా పదుకొనేలు మరో హిట్ కోసం రెడీ అవుతున్నారు. అయితే తొలి మూడు సినిమాలు రొమాంటిక్ ఎంటర్టైనర్స్ కాగా. నాలుగో సినిమాను మాత్రం హర్రర్ కామెడీగా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. కొద్ది రోజులు వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్న బాద్షా, సౌత్ నార్త్ ఇండస్ట్రీలలో సక్సెస్ ఫార్ములాగా మారిన హార్రర్ కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. షారూఖ్ దీపికాల కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా ఓం శాంతి ఓం క్లైమాక్స్‌లో దీపికా దెయ్యంగా కనిపిస్తోంది. అదే ఇన్సిపిరేషన్‌తో ఇప్పుడు సినిమా అంతా దీపికాను దెయ్యంగా చూపించేందుకు రెడీ అవుతున్నారు. చెన్నైఎక్స్ప్రెస్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన రొహిత్ శెట్టి మరోసారి ఈ సినిమాతో హిట్ కాంబినేషన్ ను రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.