షారూఖ్, దీపికా భయపెడతారట..?
ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్ప్రెస్, హ్యాపి న్యూఇయర్ సినిమాలతో ఆకట్టుకున్న బాలీవుడ్ హాట్ కపుల్ షారూఖ్ ఖాన్, దీపికా పదుకొనేలు మరో హిట్ కోసం రెడీ అవుతున్నారు. అయితే తొలి మూడు సినిమాలు రొమాంటిక్ ఎంటర్టైనర్స్ కాగా. నాలుగో సినిమాను మాత్రం హర్రర్ కామెడీగా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. కొద్ది రోజులు వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్న బాద్షా, సౌత్ నార్త్ ఇండస్ట్రీలలో సక్సెస్ ఫార్ములాగా మారిన హార్రర్ కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
షారూఖ్ దీపికాల కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా ఓం శాంతి ఓం క్లైమాక్స్లో దీపికా దెయ్యంగా కనిపిస్తోంది. అదే ఇన్సిపిరేషన్తో ఇప్పుడు సినిమా అంతా దీపికాను దెయ్యంగా చూపించేందుకు రెడీ అవుతున్నారు. చెన్నైఎక్స్ప్రెస్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన రొహిత్ శెట్టి మరోసారి ఈ సినిమాతో హిట్ కాంబినేషన్ ను రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.