టెంపర్ హిందీ రీమేక్కు హీరో ఫిక్స్
ఎన్టీఆర్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన సూపర్ హిట్ సినిమా 'టెంపర్'. ఎన్టీఆర్‌లోని కొత్త కోణాన్ని చూపించడమే కాకుండా ఆయన కెరీర్ కు ఈ సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. చాలా కాలంగా ఈ సినిమా హిందీ రీమేక్ విషయంలో చర్చలు జరుగుతున్న హీరో మాత్రం ఫైనల్ కాలేదు. తాజాగా టెంపర్ హిందీ రీమేక్ కు హీరోను ఫిక్స్ చేశారు.
ముందు నుంచి అనుకుంటున్నట్టుగానే బాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ టెంపర్ రీమేక్ లో నటిస్తున్నాడు. మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు రోహిత్ శెట్టి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్, సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పద్మావతి' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత టెంపర్ రీమేక్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.