
ముంబై : రోహిత్‌శెట్టి దర్శకత్వంలో బాలీవుడ్ కిలాడీ అక్షయ్‌కుమార్, కత్రినాకైఫ్ హీరోహీరోయిన్లుగా వస్తున్న చిత్రం సూర్యవంశి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే, సినిమా చిత్రీకరణ సమయంలో.. కత్రినా సూర్యవంశి సెట్స్‌ను శుభ్రం చేసేందుకు నడుం బిగించారు. ఈ స్టార్ హీరోయిన్ ఫ్లోర్ శుభ్రం చేస్తుండగా గమనించిన అక్షయ్.. సరదాగా వీడియో తీశాడు. ‘కత్రినా జీ ఏం చేస్తున్నారు’ అని అక్షయ్ అడగ్గా.. ఫ్లోర్ శుభ్రం చేస్తున్నానని ఆమె నవ్వుతూ బదులిస్తుంది. కొంచెం తప్పుకోండి అక్కడ శుభ్రం చేస్తానని చెప్పి.. చీపురుతో కొడుతుంది. ఇక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన అక్షయ్.. ‘స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి అంబాసిడర్ దొరికారు’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment