తెలుగులో బాలీవుడ్ సీక్వల్ | Golmaal Again will be dubbed in Telugu | Sakshi
Sakshi News home page

తెలుగులో బాలీవుడ్ సీక్వల్

Published Sat, Sep 30 2017 12:36 PM | Last Updated on Sat, Sep 30 2017 12:36 PM

golmaal again

గోల్‌మాల్ సిరీస్‌లో ఇప్పటికే మూడు సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు రోహిత్ శెట్టి, త్వరలో నాలుగో సినిమాతో రాబోతున్నాడు. గోల్‌మాల్ ఎగైన్ పేరుతో తెరకెక్కిన ఈసినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో అజయ్ దేవగణ్, అర్షద్ వార్సీ, పరిణితి చోప్రా, తుషార్ కపూర్, ప్రకాశ్ రాజ్, టబులు లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.

ఈ సినిమాతోనే టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే తెలుగు వారికి కూడా సుపరిచితమైన గోల్ మాల్ సిరీస్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీపావళి సందర్భంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాను ఒకేసారి హిందీ పాటు తెలుగులో కూడా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement