Rohit Shetty Real Life Story In Telugu: Unknown Facts About Him: రోహిత్ శెట్టి.. బాలీవుడ్ కమర్షియల్ హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచారు. తాజాగా థియేటర్లలో విడుదలైన రోహిత్ శెట్టి సినిమా.. సూర్యవంశీ... వసూళ్లలో దూసుకుపోతుంది. లాక్‌డౌన్ అనంతరం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ సూపర్‌హిట్‌గా దూసుకుపోతుంది. ప్రస్తుతం సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడిగా కోట్లలో పారితోషికం తీసుకుంటున్న రోహిత్‌శెట్టి తొలి సంపాదన ఎంతో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు.
బాలీవుడ్‌లో పని చేస్తున్న తొలి రోజుల్లో అతడి సంపాదన కేవలం 35 రూపాయలు మాత్రమేనట. సామాన్యులకయితే అనుకోవచ్చు.. కానీ అప్పటికే రోహిత్ శెట్టి తండ్రి పెద్ద నటుడు, స్టంట్‌మ్యాన్, కొరియోగ్రాఫర్ కూడా. అలాంటి రోహిత్‌శెట్టి కేవలం 35 రూపాయల వేతనం పొందడం ఆశ్చర్యం అనిపిస్తుంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రోహిత్ శెట్టి తన బాలీవుడ్ ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఆ వివరాలు..
(చదవండి: ఆల్రెడీ పెళ్లైన దర్శకుడిని ప్రేమించిన హీరోయిన్!)
రోహిత్ శెట్టి తండ్రి ఎంబీ శెట్టి ప్రముఖ నటుడు, కొరియాగ్రాఫర్, స్టంట్‌మ్యాన్ కూడా. అప్పటికే ఆయనకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. ఇక తన 16వ ఏట నుంచి పని చేయడం ప్రారంభించానన్నాడు రోహిత్‌శెట్టి. కర్లీ టేల్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ మాట్లాడుతూ.. ‘‘ 16 ఏట నుంచే పని చేయడం ప్రారంభించాను. చీఫ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసేవాడిని. అప్పటికే మా నాన్న గారు బాలీవుడ్‌లో ప్రముఖ నటుడు. అయినప్పటికి కూడా నా ప్రయాణం అంత సజావుగా సాగలేదు’’ అని తెలిపాడు.
‘‘బాలీవుడ్‌లో నా తొలి సంపాదన 35 రూపాయలు. ప్రతిరోజు రెండు గంటలపాటు నడిచి.. సినిమా సెట్‌కు చేరుకునేవాడిని. ఒక్కోసారి చేతిలో చాలా తక్కువ మొత్తం ఉండేది. ఆ డబ్బు ఖర్చు పెట్టి.. భోజనం చేస్తే.. ఇంటికి వెళ్లడానికి చార్జీలకు డబ్బులుండేవి కాదు. చార్జీలకు దాచుకుంటే.. తినడానికి ఉండేది కాదు. ఇక ముంబైలో ఉన్న రోడ్లన్ని నాకు కొట్టిన పిండి. షార్ట్‌కట్స్ అని నాకు తెలుసు. ప్రస్తుతం కారులో వెళ్తున్నప్పుడు షార్ట్‌కట్ గురించి చెప్తే నా డ్రైవర్ నావైపు ఈయన గతంలో దొంగతనాలు చేసేవాడా ఏంటి అన్నట్లు అనుమానంగా చూస్తాడు’’ అని తెలిపాడు. మా నాన్నగారి స్టార్‌డం నాకు ఏవిధంగాను ఉపయోగపడలేదు. నా సొంతంగా ఎదిగి.. ఈ స్థాయికి చేరుకున్నాను అని తెలిపాడు.
(చదవండి: 100 కోట్ల మార్క్‌ను దాటిన సూర్యవంశీ.. ఓటీటీలో వచ్చేది ఎప్పుడంటే..?)
ప్రస్తుతం రోహిత్ శెట్టి రణవీర్ సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో రోహిత్ శెట్టి సర్కస్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే రోహిత్ శెట్టి తనకు మాత్రమే ప్రత్యేకమైన పోలీసు చిత్రంలో మహిళ ప్రధాన పాత్రలో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
చదవండి: ఫీమేల్ పోలీస్ ఆఫిసర్ లీడ్‌లో రోహిత్ శెట్టి చిత్రం..
Comments
Please login to add a commentAdd a comment