sonia kapoor
-
ఎందుకంత ఫీల్ అవుతున్నావ్? భార్య పక్కన అలా నిల్చున్నావేంటి?
బాలీవుడ్ సింగర్, నటుడు హిమేశ్ రష్మియా భార్య సోనియా కపూర్‌తో ఫొటోలు దిగడానికి నానా తంటాలు పడ్డారు. అదేంటి? భార్యతో ఫొటో దిగడానికి ఇబ్బందేంటి అంటారా? అక్కడికే వస్తున్నాం. భార్యతో కలిసి ఎయిర్‌పోర్టుకు వచ్చిన హిమేశ్‌ను చూసిన మీడియా ఆ జంటను కెమెరాల్లో బంధించింది. క్లిక్ క్లిక్‌మంటూ ఫొటోలు తీసింది. దీంతో సదరు జంట కూడా కెమెరామన్‌లకు బాగానే సహకరిస్తూ స్టిల్స్ ఇచ్చింది. అయితే భార్య కంటే పొట్టిగా ఉన్న హిమేశ్ ఇద్దరూ సమానంగా కనిపించడానికి కాలి వేళ్లపైన నిలబడుతూ ఫొటోలు దిగాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 'ఓ మై గాడ్, అతడు కాళ్లు పైకి లేపుతున్నాడు చూడండి..', 'ఎందుకంత ఫీల్ అవుతున్నావ్? భార్య పక్కన అలా నిల్చున్నావేంటి?', 'భర్త కంటే భార్య పొడుగ్గా ఉంటే ఈ తిప్పలు తప్పవు మరి!', 'జో జోనస్ కంటే సోఫీ, టామ్ హాలండ్ కంటే జెండయా పొడువుగా ఉంటారు. అందులో తప్పేముంది?', 'హిమేశ్ అభద్రతాభావానికి లోనవుతున్నాడంటూ కామెంట్లు చేయడం నిజంగా బాధాకరం. ఆడవాళ్ల కంటే వారిని పెళ్లాడే మగవాళ్లే ఎక్కువ హైట్‌తో ఉండాలని కోరుకుంటున్న ఈ సమాజం సిగ్గుపడాలి' అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. When your wife/Partner is Taller than you. 😂🤣👍🏽https://t.co/1Qr4Yd3Gzx pic.twitter.com/n4KFYmI709 — Raman (@Dhuandhaar) March 11, 2022 చదవండి: రోబో బ్యూటీతో బ్రేకప్ తర్వాత నాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది -
సోనియాను పెళ్లాడిన హిమేష్
బాలీవుడ్ తారాల సీక్రెట్ పెళ్లిళ్ల జాబితా పెరుగుతోంది. ఎలాంటి హడావిడి లేకుండా పెళ్లిపీటలెక్కేస్తున్నారు బాలీవుడ్ స్టార్స్. ఇటీవల నేహాధూపియా ఎలాంటి ప్రకటన లేకుండా పెళ్లి చేసేసుకుంది. పెళ్లి రోజున తన భర్తను సోషల్ మీడియా ద్వారా అభిమానులకు పరిచయం చేసింది. తాజాగా మరో బాలీవుడ్ నటుడు ఈ లిస్ట్ లో చేరిపోయాడు. బాలీవుడ్ నటుడు, సంగీత దర్శకుడు హిమేష్ రేష్మియా టీవీ నటి సోనియా కపూర్‌ను వివాహం చేసుకున్నారు. హిమేష్‌కు ఇది రెండో వివాహం. గతంలో కోమల్‌ను పెళ్లి చేసుకున్న హిమేష్ ఇటీవల ఆమె నుంచి విడాకులు తీసుకున్నారు. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల మధ్య హిమేష్, సోనియాల వివాహం జరిగింది. -
హిమేష్ రేష్మియా మళ్లీ పెళ్లి
ముంబై : బాలీవుడ్లో పెళ్లిల సీజన్ నడుస్తోంది. మొన్న సోనం కపూర్, నిన్న నేహా ధూపియాల పెళ్లిళ్లు జరిగిపోగా.. తాజాగా ఈ జాబితాలో బాలీవుడ్ నటుడు, సంగీత దర్శకుడు హిమేష్ రేష్మియా వచ్చి చేరారు. అయితే, హిమేష్‌కు ఇది రెండో వివాహం. 21 ఏళ్ల ప్రాయంలోనే కోమల్‌తో హిమేష్‌కు వివాహం జరిగింది. 22 ఏళ్ల వైవాహిక జీవితాన్ని తెరదించుతూ.. గత ఏడాది జూన్‌లో కోమల్ నుంచి విడాకులు తీసుకున్నారు. వీరికి కుమారుడు స్వయమ్ ఉన్నాడు. ప్రస్తుతం అతని బాధ్యతను ఇరువురూ పంచుకుంటున్నారు. అయితే హిమేష్ దంపతులు విడాకులు తీసుకోవడానికి అతనికి టీవీ నటి సోనియా కపూర్‌తో ఉన్న సంబంధమే కారణమని వార్తలు వచ్చాయి. అయితే తాము విడిపోవడానికి సోనియా కపూర్ కారణం కాదని, హిమేష్, కోమల్‌లు వివరణ ఇచ్చారు. విడాకులకు ముందు నుంచే సోనియా కపూర్‌తో ప్రేమ బంధాన్ని కొనసాగిస్తున్న హిమేష్, ఆమెని పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించుకున్నాడని అతని సన్నిహితులు వెల్లడించారు. శుక్రవారం రాత్రి హిమేష్ ఇంట్లోనే సన్నిహితుల నడుమ పెళ్లి వేడుక జరగనుందని వారు తెలిపారు. -
అఫీషియల్‌గా విడిపోయిన సెలబ్రిటీ జంట
ముంబై: కొంతకాలంగా టీవీ నటి సోనియా కపూర్‌తో రిలేషన్లో ఉన్న ప్రముఖ సంగీత దర్శకుడు హిమేష్ రేషమ్మియా అధికారికంగా భార్య నుంచి విడిపోయారు. ముంబై హైకోర్టు విడాకులు మంజూరు చేయడంతో హిమేష్- కోమల్ దంపతుల 22ఏళ్ల వైవాహిక బంధం ముగిసింది. గత డిసెంబర్లో ఈ జంట చేసుకున్న అభ్యర్థనను పరిశీలించిన కోర్టు.. మంగళవారం విడాకులు మంజూరుచేసింది. విచారణ చివరిరోజున స్వయంగా కోర్టుకు హాజరైన హిమేష్, కోమల్‌లు.. తాము పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్లు న్యాయమూర్తికి వివరించారు. విడాకుల అనంతరం కోర్టు ఆవరణలో హిమేష్ రేషమ్మియా మీడియాతో మాట్లాడారు. వైవాహిక బంధంలో పరస్పర గౌరవానికి ప్రాధాన్యం ఉంటుందని, దానిని కొనసాగించేందుకే తామిద్దరం విడిపోయామని హిమేష్ చెప్పారు. ‘కోమల్‌తో నాది 22 ఏళ్ల ప్రయాణం. విడాకులు తీసుకోవాలనే మా నిర్ణయాన్ని ఇరు కుటుంబాలూ అంగీకరించాయి. అధికారికంగా విడిపోయినా కోమల్‌కు, ఆమె కుటుంబానికి నేనెప్పుడూ మంచి మిత్రుడిగానే ఉంటా’అని హిమేష్ పేర్కొన్నారు. సోనియా కారణం కాదు తాము విడిపోవడానికి సోనియా కపూర్ కారణం కాదని హిమేష్ మాజీ భార్య కోమల్ తెలిపారు. విడాకుల అనంతరం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ‘సోనియా వల్లో ఇంకొకరివల్లో నేను నా భర్త(హిమేష్) విడిపోలేదు. ఇక ముందు కూడా ఒకరినొకరు గౌరవించుకోవాలనుకునే విడిపోయాం. హిమేష్ ఎప్పటికీ మా కుటుంబ సభ్యుడే’ అని కోమల్ లేఖలో తెలిపారు. విడాకుల అనంతరం హిమేష్‌తో కలిసి ఉన్నప్పటి ఇంట్లోనే కోమల్ ఉండనున్నారు. కొడుకు(స్వయమ్) బాధ్యతను ఇరువురూ పంచుకుంటారు.