
Is Katrina Kaif Pregnant Rumours On Her Airport Look Video Viral: సోషల్ మీడియాలో నెటిజన్ల ఫోకస్ సాధారణంగానే ఎక్కువ ఉంటుంది. ఇక సినీ తారలపై అయితే వారి ఫోకస్ ఒక్కోసారి సైంటిస్ట్‌లను తలపించేలా ఉంటుంది. హెయిర్ స్టైల్ నుంచి కాలుకు వేసుకున్న ఫుట్‌వేర్ వరకు నిశితంగా పరిశీలించి ట్రోలింగ్ చేయడమో, బాగుంటే ప్రశంసించడమో చేస్తుంటారు నెటిజన్స్. ఇలా సెలబ్రిటీల మిస్టేక్‌లను కనిపెట్టిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. అయితే తాజాగా వీరి ఫోకస్ బాలీవుడ్ హీరోయిన్ కత్రీనా కైఫ్‌పై పడింది. ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం సాగుతోంది.
ఇటీవలే హీరో విక్కీ కౌశల్‌ను వివాహం చేసుకున్న కత్రీనా కైఫ్ పలు వెకేషన్స్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. తమ జీవితంలో జరిగే ప్రతీ చిన్న ఆనందాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకుంటోంది ఈ జంట. తాజాగా కత్రీనా కైఫ్ ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చింది. ఆమె ఎయిర్‌పోర్టులో కనిపించిన వీడియోను ప్రముఖ ఫొటోగ్రాఫర్ వైరల్ భయానీ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కత్రీనా ప్రెగ్నెంట్ అయిందని కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.
చదవండి: కత్రీనా పెళ్లిపై సల్మాన్ ఖాన్ రియాక్షన్.. కమిటెడ్ అని హింట్ !
నెటిజన్లలో ఒకరు 'ఓరీ దేవుడా.. ఆమె ప్రెగ్నెంట్‌లా ఉంది' మరొకరు 'త్వరలో ఆమె తల్లి కాబోతుంది. కత్రీనా పాపను చూడాలని ఎంతో ఆతృతగా ఉంది', 'కత్రీనా నిజంగా ప్రెగ్నెంటా ? లేకుంటే తను ధరించిన డ్రెస్ వల్ల అలా అనిపిస్తుందా. ఏదైతేనే తను చాలా అందంగా ఉంది' అని ఆ వీడియోకు రిప్లై ఇస్తున్నారు. మరీ ఈ కామెంట్స్‌పై కత్రీనా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
చదవండి: కత్రీనా పెళ్లి ఫుటేజ్ కోసం రూ. 100 కోట్లు ఆఫర్.. ఎందుకో తెలుసా ?
Comments
Please login to add a commentAdd a comment