Watch: Hrithik Roshan Touches Fans Feet On Stage At Event, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Hrithik Roshan: అభిమాని పాదాలకు నమస్కరించిన స్టార్‌ హీరో

Published Sun, Aug 28 2022 3:10 PM | Last Updated on Sun, Aug 28 2022 3:49 PM

Watch: Hrithik Roshan Touches Fans Feet - Sakshi

హీరోలు అంటే పడిచస్తుంటారు కొంతమంది జనాలు. వారు కనిపించినా, ఒక్క సెల్ఫీ దిగినా చాలని సంబరపడిపోతుంటారు. కొన్నిసార్లైతే స్టేజీపై హీరో కనిపించగానే వెంటనే సెక్యురిటీ సిబ్బందిని దాటి మరీ స్టేజీ ఎక్కి వారి మీద పడిపోతుంటారు. హీరోల పాదాలు తాకి జన్మ ధన్యమైపోయినట్లే ఫీలవుతారు. ఇలాంటి సంఘటనలు ఇదివరకు మనం చాలానే చూశాం. కానీ ఈసారి మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. ఓ స్టార్‌ హీరో అందరూ చూస్తుండగానే తన అభిమాని పాదాలకు నమస్కరించాడు.

శనివారం నాడు జరిగిన ఓ ఫిట్‌నెస్‌ ఈవెంట్‌లో హృతిక్‌ రోషన్‌ మైక్‌ పట్టుకుని మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో ఓ అభిమాని స్టేజీపైకి వచ్చి హీరో కాళ్లు మొక్కాడు. దానికి ప్రతిచర్యగా హృతిక్‌ కూడా అభిమాని పాదాలకు నమస్కరించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు నువ్వు ఎంత గొప్పవాడివి హృతిక్‌ అంటూ అతడి మీద పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. కాగా హృతిక్‌ ప్రస్తుతం విక్రమ్‌ వేద సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 30న రిలీజ్‌ కానుంది.

చదవండి: మోహన్‌లాల్‌ కొడుకుగా టాలీవుడ్‌ హీరో!
 'మైక్‌ టైసన్‌ నన్ను బూతులు తిట్టాడు, బయటికి చెప్పలేను'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement