సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: ఇటీవల కాలంలో బౌన్సర్ల ఏర్పాటు సాధారణంగా మారింది. అయితే, తాడేపల్లిగూడెం పట్టణంలో నిర్వాహకులు ఓ అడుగు ముందుకేశారు. పందెం బరుల వద్ద లేడీ బౌన్సర్ల(Lady Bouncers)ను ఏర్పాటు చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గూడెంలో కోడిపందాలు(Cockfighting) జోరుగా సాగుతుండగా, రద్దీని కంట్రోల్ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
కాగా, సంక్రాంతి సంబరాల ముసుగులో కూటమి నేతలు బరితెగించారు. భీమవరంలో పందెం బరి వద్ద మూడు రోజుల నుంచి క్యాసినో నిర్వహిస్తున్నారు. సినిమా సెట్టింగ్‌ల మాదిరిగా షెడ్లు వేసి జూద క్రీడలను నిర్వహిస్తున్నారు. పందెం రాయుళ్లును ఆకర్షించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి మహిళా నిర్వాహకులను కూడా కూటమి నేతలు రప్పించారు. పోలీసులు మాత్రం అటువైపు తొంగిచూడటం లేదు. యథేచ్ఛగా కాసులు వేట సాగిస్తూ సామాన్యులు జేబులు గుల్ల చేస్తున్నారు.
మరో వైపు, కోడి పందెం బరిలో ఏకంగా కోటీ 25 లక్షల పందెం కాయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో బరిలోకి దిగిన గుడివాడ ప్రభాకర్ రావు నెమలి పుంజు విజేతగా నిలిచింది. ఈ పందెనికి బెట్టింగ్ రాయుళ్లు భారీగా పందేలు వేసుకున్నారు. తాడేపల్లిగూడెంలోని పైబోయిన వెంకట్రామయ్య కోడి పందెల బరిలో కోటి 25 లక్షల రూపాయలు పందెం కాయడం చర్చనీయాంశంగా మారింది.
కుక్కుట శాస్త్ర ప్రకారం కోటి రూపాయల పందేనికి ముహూర్తం ఫిక్స్ చేశారు నిర్వాహకులు. గుడివాడ ప్రభాకర్ రావు నెమలి పుంజు, రత్తయ్య రసంగి పుంజు ఈ బరిలోకి దిగాయి. కోటి 25 లక్షలతో రెండు పుంజులను పందెంలోకి దింపారు నిర్వాహకులు. ఇక, కోటి రూపాయల పందెం వీక్షించడానికి ప్రజలు, పందెం రాయుళ్లు భారీగా తరలివచ్చారు. ఈ పందేనికి భారీగా బెట్టింగులు కాసిన పందెం రాయుళ్లు. బరిలో హోరాహోరీగా సాగిన బరిలో గుడివాడ ప్రభాకర్ (నెమలి పుంజు)విజేతగా నిలిచింది. దీంతో, గెలిచిన వారు సంబరాలు చేసుకున్నారు.
ఇదీ చదవండి: అన్నదాత ఇంట కానరాని సంక్రాంతి
Comments
Please login to add a commentAdd a comment