సాక్షి, పశ్చిమగోదావరి: ఏపీలో కూటమి పాలనలో కోడి పందెం బెట్టింగ్ చర్చనీయాంశంగా మారింది. కోడి పందెం బరిలో ఏకంగా కోటీ 25 లక్షల పందెం కాయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో బరిలోకి దిగిన గుడివాడ ప్రభాకర్ రావు నెమలి పుంజు విజేతగా నిలిచింది. ఈ పందెనికి బెట్టింగ్ రాయుళ్లు భారీగా పందేలు వేసుకున్నారు.
తాడేపల్లిగూడెం పట్టణంలోని పైబోయిన వెంకట్రామయ్య కోడి పందెల బరిలో కోటి 25 లక్షల రూపాయలు పందెం కాయడం చర్చనీయాంశంగా మారింది. కుక్కుట శాస్త్ర ప్రకారం కోటి రూపాయల పందేనికి ముహూర్తం ఫిక్స్ చేశారు నిర్వాహకులు. గుడివాడ ప్రభాకర్ రావు నెమలి పుంజు, రత్తయ్య రసంగి పుంజు ఈ బరిలోకి దిగాయి. కోటి 25 లక్షలతో రెండు పుంజులను పందెంలోకి దింపారు నిర్వాహకులు. ఇక, కోటి రూపాయల పందెం వీక్షించడానికి ప్రజలు, పందెం రాయుళ్లు భారీగా తరలివచ్చారు. ఈ పందేనికి భారీగా బెట్టింగులు కాసిన పందెం రాయుళ్లు. బరిలో హోరాహోరీగా సాగిన బరిలో గుడివాడ ప్రభాకర్ (నెమలి పుంజు)విజేతగా నిలిచింది. దీంతో, గెలిచిన వారు సంబరాలు చేసుకున్నారు.
విజయవాడ.. ఇదిలా ఉండగా.. సాంప్రదాయ సంబరాల ముసుగులో యధేచ్ఛగా జూద క్రీడలను కూటమి నేతలు ప్రోత్సహిస్తున్నారు. కోడి పందెం బరులను ఆదాయ వనరులుగా మార్చేసుకున్నారు కూటమి నేతలు. కూటమి ఎమ్మెల్యేలకు కోడి పందెం బరుల్లో వాటాలు ఉన్నాయి. అక్కడ ఎమ్మెల్యే అనుచరులే హవా కొనసాగిస్తున్నారు. ఎన్నడూ లేనంతగా ఇష్టానుసారంగా బరులు ఏర్పాటు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. కోడి పందెం బరుల్లో జూద క్రీడలకు స్పెషల్ ఏర్పాట్లు చేశారు. జూద క్రీడలకు తోడు మద్యం ఏరులై పారుతోంది. మద్యం కోసం ప్రత్యేకంగా మినీ బార్లు, బెల్టు షాపులు ఏర్పాటు చేసుకున్నారు.
తొలి రెండు రోజుల్లోనే చేతులు మారిన వందల కోట్ల రూపాయలు. జూదం, మద్యం ద్వారా భారీగా సంపాదించాలని పక్కా ప్రణాళిక వేసుకున్న కూటమి నేతలు. అందుకు తగినట్టుగానే భారీగా డబ్బులు వసూలు. అయితే, పండుగ ముందు పోలీసులు.. కోడి పందేలు, పేకాట, గుండాటలు ఆడితే తాటతీస్తామని హెచ్చరించారు. తీరా పండుగ వచ్చాక మాత్రం.. పోలీసులు కనిపించకపోవడం గమనార్హం. ఈ క్రమంలో కూటమి నేతలు, పోలీసులు కుమ్మక్కయ్యారని విమర్శలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment