మర్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్న బిహార్ యువకులు
మర్పల్లి : మర్పల్లి సంతకు వచ్చిన తొమ్మిది మంది బిహార్ యువకులను స్థానికులు మంగళవారం పోలీసులకు పట్టించారు. మర్పల్లి సమీపంలోని వినోద్ ఫాంహౌస్‌లో పని చేసేందుకు వీరు హైదరాబాద్ నుంచి ఇక్కడకు వచ్చారు. మధ్యాహ్నం ఒంటిగంటకు మర్పల్లి బస్టేషన్‌లో దిగారు. ఫాంహౌస్‌కు వెళ్లేకన్నా ముందు తమకు అవసరమైన వస్తువులు కొనుగోలు చేసేందుకు మర్పల్లి సంతలో తిరిగారు.
వీరిపై అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు యువకులను స్టేషన్‌కు తరలించారు. దొంగల ముఠాలు సంచరిస్తున్నాయనే వదంతుల నేపథ్యంలో వీరిని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున పోలీస్టేషన్‌కు తరలివచ్చారు. జనాల సమక్షంలోనే వీరిని తనిఖీ చేసిన పోలీసులు ఆధార్ కార్డులు పరిశీలించి బీహార్‌వాసులుగా గుర్తించారు.
ఫాంహౌస్‌లో పని చేసేందుకు వచ్చామని చెప్పడంతో యజమా ని వినోద్‌కు, అందులో పనిచేసే సూపర్‌వైజర్ రవికి ఫోన్ చేసి పిలిపించారు. పీఎస్‌కు చేరుకున్న వినోద్, రవి ఫాంహౌస్‌లో పనుల నిమిత్తం తామే వారిని పిలిపించామని చెప్పారు. వీరి సొంతపూచీకత్తుపై యువకులను పంపించేశారు.
Comments
Please login to add a commentAdd a comment