మర్పల్లి (రంగారెడ్డి జిల్లా) : ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు తమ సమస్యను పట్టించుకోవటం లేదంటూ తండావాసులు ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు. పరిష్కారానికి హామీ దక్కించుకున్నారు. రంగారెడ్డి జిల్లా మర్పల్లి మండల కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.
మండలంలోని నర్సాపూర్ పంచాయతీలోని తండావాసులు గ్రామంలోని బోర్లు పనిచేయక నీటికి ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక నాయకులకు చెప్పినా ఫలితం కానరాక దాదాపు 50 మంది వరకు తరలివెళ్లి శుక్రవారం మధ్యాహ్నం మండల పరిషత్ కార్యాలయాన్ని ముట్టడించారు. అధికారులను బయటకు వెళ్లనీయలేదు. శనివారం గ్రామానికి వచ్చి, బోర్లు పనిచేసేలా చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు వెనుదిరిగారు.