
మంచినీరు సరఫరా చేయాలని కోరుతూ బైఠాయించిన స్థానికులు
ఆనందపేట (గుంటూరు): ఐదు రోజు లుగా మంచినీరు సరఫరా కాకపోవటంతో పట్టణంలో ఆనందపేట, సం గడిగుంట, చంద్రబాబు నాయుడు కాలనీ, చిన్నబజారు, ఐపీపీ కాలనీప్రజలు ఆగ్రహానికి గురయ్యారు. గుక్కె డు నీళ్ల కోసం పడరాని పాట్లు పడాల్సి వస్తోందంటూ ఉదయం 6.30 గంటల నుంచి 10 గంటలకు వరకూ రోడ్డుపై బైఠాయించి ఆందో ళన చేపట్టారు.ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. దీంతో ట్రాఫిక్ స్తంభిం చింది. నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, డీఎస్పీ కండే శ్రీనివాసులు, ఇతర అధికారులు వచ్చి ఆందోళనకారులకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. కమిషనర్ వచ్చి సమాధానం ఇచ్చే వరకు ఆందోళన కొనసాగుతుందని భీష్మించుకుని కూర్చున్నారు.ప్రాణాలైనా అర్పిస్తాం మంచినీరు సా«ధిస్తాం...కమిషనర్ వెంటనే రావాలి... మంత్రి నారాయణ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. కమిషనర్ 10 గంటలకు వచ్చి హమీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ నసీర్ అహ్మద్ ఆందోళనకు మద్దతు తెలు పుతూ రోడ్డుపై బైఠాయించారు.
ట్యాంకర్ల ద్వారా సరఫరా
ఆందోళన ఉద్రిక్తం కావడంతో నగరపాలక సంస్థ అధికారులు హుటాహుటిన వాటర్ ట్యాంకర్లు తెప్పించారు. అయితే, స్థానికులు ట్యాంకర్లు వద్దని, మంచినీటి సరఫరా వెంటనే చేయాలని నినాదాలు చేశారు.
సరఫరా పునరుద్ధరిస్తాం
నీటి సరఫరా పునరుద్ధరిస్తాం. మంగళవారం ముస్లింలు జరుపుకోనే పవిత్ర షబేబరాద్ పర్వదినానికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం. – శ్రీకేష్ లత్కర్, కమిషనర్
ప్రత్యామ్నాయ చర్యలు ఎక్కడ ?
మంచినీటి సరఫరా నిలిపి వేసినప్పుడు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టక పోవటం దారుణం. కలుషిత నీటి వల్ల 20 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మంచినీరు దొరక్క మరింత మంది చనిపోయే పరిస్థితి ఏర్పడింది. –ప్రమోద్, ఆనందపేట
Comments
Please login to add a commentAdd a comment