గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా సేవలు | andhra bank open in mahaboobnagar rajendranagar branch | Sakshi
Sakshi News home page

గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా సేవలు

Published Sat, Sep 10 2016 1:23 AM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM

గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా సేవలు

గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా సేవలు

ఏపీవైలో దేశంలోనే మొదటిస్థానం
ఆంధ్రాబ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అజిత్‌కుమార్ 

 మహబూబ్‌నగర్, సాక్షి: గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా దేశంలో ఆంధ్రాబ్యాంక్ తనవంతు పాత్ర పోషిస్తున్నట్లు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అజిత్‌కుమార్ రత్ చెప్పారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌లోని రాజేంద్రనగర్ బ్రాంచిలో ‘ఈ-లాబీ’ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ బ్యాంకు శాఖల్లో ఖాతాదారుల కోసం మరిన్ని టెక్నాలజీ ఆధారిత సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. ఈ-లాబీ కేంద్రంలో ఏటీఎం, క్యాష్ రీసైక్లర్ మిషన్, పాస్‌బుక్ ప్రింటింగ్‌ను ఏర్పాటు చేశామన్నారు. క్యాష్ రీసైక్లర్ మిషన్ ద్వారా ఖాతాదారులు ఎప్పుడైనా డిపాజిట్ చేయొచ్చునన్నారు.

ఆంధ్రాబ్యాంక్ రూ.3.12 లక్షల కోట్ల వ్యాపారం చేసినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. అటల్ పింఛన్ యోజన నమోదులో దేశంలోనే మొదటిస్థానంలో నిలిచినట్లు చెప్పారాయన. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను సమర్థంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. త్వరలో మహబూబ్‌నగర్‌లో 5, నల్లగొండలో 4 నూతన బ్రాంచీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో జోనల్ మేనేజర్ లీలాధర్, ఏజీఎం ఎన్‌ఎస్‌ఎన్ రెడ్డి, చీఫ్ మేనేజర్లు పరంధాములు, శామ్యుల్,మాణిక్యరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement