
నిధులు ఇవ్వకుంటే భిక్షాటనే గతి!
• సర్పంచుల ఐక్యవేదిక ఆవేదన
• కేరళ తరహాలో బడ్జెట్లో గ్రామాలకు 40 శాతం నిధులు కేటాయించాలి
• ‘జాయింట్ చెక్‌పవర్’ రద్దు ఆదేశాలు అమలు కావడం లేదు
• గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌కు వినతిపత్రం
సాక్షి, హైదరాబాద్ : రానున్న బడ్జెట్లో గ్రామీ ణాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కేరళ రాష్ట్రం మాదిరిగా 40శాతం నిధులు కేటాయిం చాలని సర్పంచుల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు గత మూడేళ్లుగా ఒక్క రూపాయి కూడా అభివృద్ధి నిధులు అందలేదని, వచ్చే బడ్జెట్లోనైనా నిధులు కేటాయించని పక్షంలో గ్రామాల బాగు కోసం సర్పంచులంతా భిక్షాటన చేయ డం మినహా వేరే గత్యంతరం లేదని సర్పం చుల ఐక్యవేదిక అధ్యక్షుడు అంధోల్ కృష్ణ పేర్కొన్నారు.
గ్రామ పంచాయతీలు ఎదు ర్కొంటున్న సమస్యలు, గ్రామీణాభివృద్ధికి బడ్జెట్‌లో తగినన్ని నిధుల కేటాయింపు.. తదితర అంశాలపై పలువురు ఐక్యవేదిక ప్రతి నిధులు శనివారం పంచాయతీరాజ్, గ్రామీ ణాభివృద్ధి శాఖ కమిషనర్‌ను కలసి వినతి పత్రం సమర్పించారు. అలాగే జాయింట్ చెక్‌పవర్‌ను రద్దు చేస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను క్షేత్రస్థాయిలో అధికారులు ఖాతరు చేయడం లేదని కమిషనర్‌కు వారు ఫిర్యాదు చేశారు. తాము పేర్కొన్న సమస్యల ను ప్రభుత్వం దృష్టికి తీసు కెళ్లాలని, ప్రభుత్వ ఉత్తర్వులు అమల య్యేలా ఆదేశాలివ్వాలని కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు.
ఐక్యవేదిక డిమాండ్లివే..
⇔ స్థానిక సంస్థలకు రాజ్యాంగ సవరణ ద్వారా కల్పించిన 29 అధికారాలను వెంటనే బదలాయించాలని ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం వాటిని బదలాయిం చడంలేదు. అధికా రాలను బదలాయిస్తూ ఉత్తర్వులివ్వాలి.
⇔ సీఎం కేసీఆర్ ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు కేరళ మాదిరిగా రాష్ట్రంలో గ్రామీణా భివృద్ధికి బడ్జెట్లో 40శాతం నిధులను కేటా యించాలి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా ఎన్నికలలో సర్పంచులకు కూడా ఓటుహక్కు కల్పించాలి.
⇔ రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయ తీలకు సొంత భవనాలను నిర్మిం చాలి. గ్రామస్థాయిలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్ట్‌ల పర్యవేక్షణ బాధ్యతల ను సర్పంచులకు అప్పగించాలి.
⇔ సర్పంచులకు ప్రతినెలా ఇచ్చే గౌరవ వేతనాన్ని రూ.20వేలకు పెంచాలి. సర్పంచులందరికీ ప్రమాదబీమా సదుపా యాన్ని కల్పించాలి. పదవీ విరమణ చేసిన సర్పంచులకు రూ.5వేల చొప్పున పెన్షన్ అందించాలి. పదవిలో ఉండి మరణించిన సర్పంచులకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి.
⇔ వందశాతం ఓడీఎఫ్ గ్రామాలుగా మార్చేందుకు మరుగుదొడ్ల నిర్మాణానికి వందశాతం సబ్సిడీ నిధులను గ్రామ పంచాయతీలకు మంజూరు చేయాలి. గ్రామాల్లో నామినేషన్‌పై కేటాయించే పనులను రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలి.
⇔ ఏకగ్రీవంగా సర్పంచులను ఎన్నుకున్న పంచాయతీలకు ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాన్ని (మైనర్ పంచాయతీకి రూ.10లక్షలు, మేజర్ పంచాయతీకి రూ.15లక్షలు) వెంటనే అందించాలి. స్థానికంగా సీనరేజి, రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి వచ్చే స్టాంప్‌డ్యూటీ ఆదాయాన్ని వెంటనే పంచాయతీలకు బదలాయించాలి.