ఆంధ్రప్రదేశ్లో అక్టోబరు 2 నుంచి మహిళా సాధికారయాత్ర చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు చెప్పారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో అక్టోబరు 2 నుంచి మహిళా సాధికారయాత్ర చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు చెప్పారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో గ్రామీణాభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
డ్వాక్రా గ్రూపులకు అన్న సంజీవని, ఫుడ్ క్యాంటీన్లను అప్పగించాలని చంద్రబాబు నిర్ణయించారు. ప్రతి ఇంట్లో ఒక మహిళకు కంప్యూటర్ పరిజ్ఞానం కల్పించాలని నిర్ణయించారు. 2019నాటికి డ్వాక్రా గ్రూపులు 100 శాతం అక్షరాస్యత సాధించాలని చంద్రబాబు సూచించారు.