సాక్షి, వరంగల్ రూరల్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గ్రామీణాభివృద్ధికి ఊతమిచ్చేలా ఉంది. రైతులు, పేదలు, చిరువ్యాపారులకు ప్రయోజనం చేకూర్చేలా ఈ సారి కేంద్రం గ్రామీణ ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంట్‌లో గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్ జెట్లీ వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యమిచ్చారు. 2018–2019 ఆర్థిక సంవత్సరానికి రూ.11 లక్షల కోట్లు వ్యవసాయానికి కేటాయించారు. దీంతో జిల్లా రైతాంగానికి కూడా లబ్ధి చేకూరే అవకాశముంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 14,36,215 ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా 6,27,415 మంది రైతులు ఉన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయాలన్న ఆశయంతో ఉన్నామని, ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో జిల్లాలోని రైతులకు ఎంతో లబ్ధి చేకూరనుంది.
మద్దతు ధరతో రైతులకు లాభం
కేంద్ర ప్రభుత్వం రైతులకు మద్దతుధర కల్పించడానికి బడ్జెట్‌లో నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం. వ్యవసాయ రంగంలో రూ.11 లక్షల కోట్ల రుణాలు ఇప్పించడానికి బడ్జెట్‌లో కేటాయిం చడం సంతోషకరం. ప్రధాని నిర్ణయంతో రైతులకు ఇక మంచిరోజులు వచ్చే అవకాశం ఉంది.
– కత్తాల వెంకటేశ్వర్‌రావు, ధర్మరావుపేట, రైతు
తెల్లకార్డు దారులకు ఆరోగ్య బీమా
తెల్లకార్డుదారుడి కుటుంబానికి రూ.5లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించనున్నారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12,93,612 ఆహార భద్రత కార్డులుండటంతో ఆ కుటుంబాల వారికి వర్తించనుంది.
గిరిజన యూనివర్సిటీకి రూ.10 కోట్లు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగులో ఏర్పాటు చేయనున్న గిరిజన యూనివర్సిటీకి రూ.10 కోట్లను ఈ బడ్జెట్‌లో కేటాయించారు. ఇటీవలే ఈ గిరిజన యూనివర్సిటీ మంజూరైంది.
Comments
Please login to add a commentAdd a comment