- గ్రామీణాభివృద్ధికి జతగా సెర్ప్ సిబ్బంది
- ఉపాధిహామీ కమిటీల ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ పేదలకు వందరోజుల ఉపాధి కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామాల్లో వ్యవసాయ పనులు ముగియ డంతో ఖాళీగా ఉన్న కూలీలందరినీ ఉపాధి హామీ వైపు మళ్లించేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కూలీలకు ఉపాధిహామీ పథకం పట్ల అవగాహన కల్పించడం, వారికి అవసరమైన జాబ్ కార్డులను ఇప్పించడం, కూలీల డిమాండ్ మేరకు ఉపాధి పనులను సిద్ధం చేయడం.. తదితర కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు ఉపాధిహామీ సిబ్బందితో పాటు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సిబ్బంది సేవలను కూడా వినియోగించు కోవాలని నిర్ణయించింది. అంతేకాకుండా ఉపాధిహామీ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 18,405 గ్రామ సమాఖ్యల సహాయకులను, 3,209 మంది కమ్యూనిటీ కోఆర్డినేటర్లను, 45.65 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలను భాగస్వాములను చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గ్రామ స్థాయిలో సమష్టిగా..
ఉపాధిహామీ పనులు కల్పించే నిమిత్తం జాబ్ కార్డులు ఇప్పించేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బందితో సెర్ప్ సిబ్బంది కలసి పని చేయాలని ప్రభుత్వం సూచించింది. పనుల డిమాం డ్‌ను సృష్టించే విధంగా కూలీలను, ఎస్‌ఎస్‌ఎస్, ఎస్‌హెచ్‌జీ గ్రూపులను ప్రోత్స హించాలని ఆదేశిం చింది. గ్రామంలో రోజు వారీ ఉపాధిహామీ పనులను పర్యవేక్షిం చేందుకు గ్రామస్థాయిలో ఐదుగురు సభ్యుల తో కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభు త్వం సూచించింది. లేబర్ బడ్జెట్ రూప కల్పనలో గ్రామ సమాఖ్యలు కీలక పాత్ర పోషించాలని ఆదేశించింది. గ్రామాలలో లేబర్ బడ్జెట్ పురోగతిని మండల సమాఖ్యలు సమీక్షించాలని, మండల స్థాయిలో పనిచేసే ఏపీఎంలు, కమ్యూనిటీ కోఆర్డి నేటర్లు ఆయా పనులను పర్యవేక్షించాలని సర్కారు సూచించింది.
వంద రోజుల ఉపాధి కల్పనే లక్ష్యం
Published Mon, Apr 17 2017 3:17 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM
Advertisement