గ్రామీణాభివృద్ధితోనే దేశ ప్రగతి | National development with rural development | Sakshi
Sakshi News home page

గ్రామీణాభివృద్ధితోనే దేశ ప్రగతి

Published Sat, Jul 8 2017 2:33 AM | Last Updated on Tue, Sep 5 2017 3:28 PM

గ్రామీణాభివృద్ధితోనే దేశ ప్రగతి

గ్రామీణాభివృద్ధితోనే దేశ ప్రగతి

‘గ్రామీణాభివృద్ధి’ సదస్సులో కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు
 
సాక్షి, హైదరాబాద్‌: పల్లె ప్రజల జీవన ప్రమాణాలను, ఉపాధి అవకాశాలను పెంపొందించడంలో గ్రామీణ ఆవిష్కరణలు  దోహదపడతాయని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. గ్రామీణ జీవితాలను ప్రభావితం చేసే స్థానిక ఆవిష్కరణలపై హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని జాతీయ గ్రామీణాభి వృద్ధి, పంచాయతీరాజ్‌ సంస్థలో రెండు రోజుల సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా గ్రామీణ ఆవిష్కరణల ఎగ్జిబిషన్‌ను వెంకయ్యనాయుడు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామాల నుంచి ప్రజలు ఉపాధి కోసం పట్టణాలకు వలస రాకుండా చూడాలంటే గ్రామాల్లోనే అన్ని వసతులూ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రజల జీవితాల్లో గొప్ప మార్పు తేగలిగిన బయోగ్యాస్, ఏ సీజన్‌లోనైనా వ్యర్థాలను కుళ్లింపజేసే బయోడైజెస్టర్‌ బాక్టీరియా వంటి అద్భుత ఆవిష్కరణలు ఎన్నో ఉన్నప్పటికీ గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి రాకపోవడం విచారకరమని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. గ్రామీణ ప్రజల అభ్యున్నతికి దోహదపడే ఆవిష్కరణలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతోనే ఈ సదస్సు ఏర్పాటు చేశామని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ డా. డబ్ల్యూఆర్‌.రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలోఇండియన్‌ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ చైర్మన్‌ డాక్టర్‌ బి.ఎన్‌. సురేశ్, పల్లెసృజన అధక్షుడు బ్రిగేడియర్‌ పోగుల గణేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ గ్రామీణ ఆవిష్కర్తలు చింతల వెంకటరెడ్డి, చింతకింది మల్లేశంను మంత్రి ఘనంగా సత్కరించారు. ఇన్నోవేషన్ల ప్రదర్శన, సదస్సు శనివారం కూడా కొనసాగుతుంది.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement