
250 కోట్లతో శ్మశానవాటికల అభివృద్ధి
• గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయం.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు
• డీఆర్‌డీవోలతో సమీక్షలో గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో శ్మశాన వాటికలను సమగ్రంగా అభివృద్ధి పర చాలని గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఈ మేరకు వెసులుబాటు ఉండడంతో గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు అందాయి. తొలి దశలో 5 వేలకు పైగా జనాభా ఉన్న గ్రామాల్లో శ్మశాన వాటికలను అభివృద్ధి పరచాలని, సుమారు 2,500 గ్రామాల్లో ఒక్కో శ్మశాన వాటికకు రూ.10 లక్షలు చొప్పున ఉపాధి హామీ మెటీరియల్ కాంపొనెంట్ నిధులను వెచ్చించాలని నిర్ణ యించింది.
ఇందుకు రూ.250 కోట్లు ఖర్చవు తుందని గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే మార్చి 1 నుంచే శ్మశానవాటికల అభి వృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఉన్న తాధికారులు యోచిస్తున్నారు. ఒక్కో శ్మశాన వాటికలో మృతదేహాల దహనానికి రెండు ప్లాట్‌ఫారాలు, షెడ్డు, చుట్టూ కందకంతో పాటు రక్షణగా ఫెన్సిం గ్, ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్, సోలార్ లై టింగ్, గ్రీనరీ తదితర పనులను చేపట్టనున్నారు. అలాగే ఉపాధి హామీ పథకం కింద స్థలం చదును, అభివృద్ధి వంటి కార్యక్రమాలకు అదనంగా నిధులను వెచ్చించనున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల నుంచి ప్రతిపాదనలు పంపాలని గురువారం డీఆర్‌డీవోలతో జరిగిన సమీక్షలో గ్రామీణాభి వృద్ధి శాఖ కమిషనర్ నీతూకుమారి ప్రసాద్ ఆదేశించారు.
మిషన్ కాకతీయ చెరువుల్లోనూ పూడికతీత...
మిషన్ కాకతీయ మొదటి దశ కింద బాగు చేసిన చెరువుల్లో పూడికతీత పనులను కూడా ఉపాధి హామీ పథకం కింద చేపట్టాలని గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయిం చింది. ప్రభుత్వం ఫేజ్–4, 5 మిషన్ కాకతీయ కింద చేపట్టబోయే చెరువుల పునరుద్ధరణ కార్యక్ర మాన్ని కూడా ఉపాధి హామీ నిధులతో పూర్తి చేసేందుకు కసరత్తు జరుగుతోంది. సిమెంట్ రోడ్లకు సంబం ధించి అన్ని జిల్లాల నుంచి త్వరితగతిన ప్రతిపాదనలను పంపాలని అధికారులను నీతూ కుమారి ప్రసాద్ ఆదేశించారు.
మిషన్ భగీరథ ప్రాజెక్ట్ కింద గ్రామాలలో వేస్తున్న పైప్‌లైన్లకు ఇబ్బందులు తలెత్తకుండా సిమెంట్ రహదారుల నిర్మా ణాన్ని చేపట్టాలని సూచించారు. వచ్చే జూన్‌లో ప్రారంభించనున్న హరితహారం కార్యక్రమానికి సంబంధించి ప్రతి గ్రామం లోనూ నర్సరీ ఉండేలా చూడాలని, నెలఖారు కల్లా నర్సరీల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామాలలో ఉపాధి హామీ లేబర్ బడ్జెట్‌ను పెంచేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ సత్యనా రాయణరెడ్డి, ఉపాధి హామీ జాయింట్ కమిషనర్ బి.సైదులు, ముఖ్య విజిలెన్స్ అధికారి ఎస్.జె.ఆషా తదితరులు పాల్గొన్నారు.