వేలూరు, న్యూస్‌లైన్: అన్నాడీఎంకే ప్రభుత్వంతోనే గ్రామీణాభివృద్ధి సాధ్యమని వేలూరు పార్లమెంట్ అభ్యర్థి సెంగొట్టవన్ తెలిపారు. శనివారం ఉదయం నియోజక వర్గం లోని మేల్ మనూర్, కీల్ మనూర్, పొయిగై, అమ్ముండి తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. మూడేళ్ల అమ్మ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు పలు సంక్షేమ పథకాలను పొందారని వీటిని ప్రతి ఓటరు గుర్తించుకోవాలన్నారు. ప్రస్తుతం అన్ని గ్రామాల్లోను సిమెంట్ రోడ్లు, తాగునీటి ట్యాంకర్‌లున్నాయంటే అందుకు ముఖ్యమంత్రి జయలలితనే కారణమన్నారు.
ఎన్నికల సమయంలో పలు పార్టీలు ఎన్నో ఉచిత హామీలిస్తుంటారని వాటిని ప్రజలు నమ్మవద్దన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి కూడా పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత అన్నాడీఎంకే ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఓటర్లు ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాష్ట్ర, గ్రామీణాభివృద్ధిని గుర్తు తెచ్చుకొని ఓటు వేయాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో డెప్యూటీ మేయర్ ధర్మలింగం, జిల్లా జాయింట్ కార్యదర్శి మునెమ్మ, ఆవిన్ పాలడెరుురీ చైర్మన్ వేలయగన్, సర్పంచ్ సెల్వి, మాజీ కౌన్సిలర్ జిజిఆర్ రవి, కాట్పాడి యూనియన్ చైర్మన్ రాజ, అన్నాడీఎంకే నాయకులు పాల్గొన్నారు.
అన్నాడీఎంకేతోనే గ్రామీణాభివృద్ధి సాధ్యం
Published Sun, Mar 30 2014 12:11 AM | Last Updated on Tue, Aug 14 2018 2:24 PM
Advertisement
Advertisement