
పైరవీ.. పదోన్నతి
తప్పు చే సిన వారికి దండన లేకపోవడంతో తిరిగి అవే పునరావృతం అవుతున్నాయి. జిల్లా పరిషత్‌లో జరిగే అక్రమాలనే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.
మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: తప్పు చే సిన వారికి దండన లేకపోవడంతో తిరిగి అవే పునరావృతం అవుతున్నాయి. జిల్లా పరిషత్‌లో జరిగే అక్రమాలనే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (ఈఓపీఆర్‌అండ్‌ఆర్‌డీ)లుగా పదోన్నతి పొందేందుకు జిల్లా పరిషత్, మండల పరి షత్ పరిధిలో పని చేస్తున్న అర్హులైన సీనియర్ అసిస్టెం ట్ల జాబితా తయారు చేసి పంపాలని ఇటీవల పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈఓపీఆర్ అండ్ ఆర్‌డీలకు గెజిటెడ్ హోదా ఉండటం తో ఆ పోస్టులపై అందరి కన్ను పడింది. సీనియర్ అ సిస్టెంట్ల నుంచి సూపరింటెండెంట్‌లుగా గతంలో పదోన్నతి పొందిన వారు ఈ పోస్టులకు అనర్హులని పంచాయతీరాజ్ శాఖ అధికారులే తేల్చి చెప్పారు.
ఆకుపచ్చ ఇంకు వాడే పోస్టులపై కొందరికి మోజు ఉం డటంతో ప్రస్తుతం సూపరింటెండెంట్లుగా పని చేస్తున్న ఆరుగురు పైరవీలు చేసి ఈఓపీఆర్‌అండ్‌ఆర్‌డీ పోస్టుల ఎంపిక కోసం జిల్లా పరిషత్ నుంచి వెళ్లిన మెరిట్ జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవడం లో సఫలీకృతులయ్యారు.
ప్రస్తుతం సూపరింటెండెంట్లుగా పని చేస్తున్న వారు ఈఓపీఆర్‌అండ్‌ఆర్‌డీ పోస్టులకు అనర్హులని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నప్పటికీ జాబితాలో పొందుపరచిన ఆరుగురి పే ర్లను సూపరింటెండెంట్లుగా కాకుండా సీనియర్ అసిస్టెంట్లుగా పని చేస్తున్నారని జాబితాలో చూపడం వి శేషం. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో పని చేస్తున్న ఒకరు, అచ్చంపేట, దేవరకద్ర నియోజకవర్గాల్లోని మండల పరిషత్ కార్యాలయాల్లో పని చేస్తున్న ముగ్గురు సూపరింటెండెంట్ల పేర్లను జాబితాలో చేర్చినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ఇటీవల జిల్లా పరిషత్‌లో ఏడు సూపరింటెండెంట్ పోస్టులు ఖాళీగా ఉంటే అక్రమంగా పదోన్నతులు పొందేందుకు మరో నలుగురి పేర్లను కలిపి మొత్తం 11 మందితో కూడిన జాబితాను కలెక్టర్‌కు పంపారు. ఈ విషయాన్ని అక్రమంగా పదోన్నతులు పొందేందుకు జాబితా రెడీ అనే కోణంలో అక్టోబర్‌లో సాక్షి పత్రికలో వార్త ప్రచురితమైంది. దీంతో కలెక్టర్ విచారణకు ఆదేశించి ఆఖరుకు అర్హులైన వారికి మాత్రమే పదోన్నతులు కల్పించారు.
జిల్లా పరిషత్ నుంచి మరో శాఖకు డిప్యుటేషన్‌పై వెళ్లిన వారి పోస్టులను కూడా ఖాళీలుగా చూపి వాటి స్థానంలో అక్రమంగా పదోన్నతులు పొందినట్లు తేలినా రాజకీయ ఒత్తిళ్ల కారణంగా జిల్లా అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రస్తుతం తిరిగి ఈఓపీఆర్‌అండ్‌ఆర్‌డీ పోస్టుల కోసం అర్హులైన సీనియర్ అసిస్టెంట్ల జాబితా పంపాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులు అడిగిన మరుక్షణం నుంచే పైరవీకారులు ముందుకు వచ్చారు. అర్హులైన వారికి అన్యాయం చేసి అనర్హులకు న్యాయం చేసే విధంగా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.