సంసద్ సంకల్పం | government starts the sagy scheme | Sakshi
Sakshi News home page

సంసద్ సంకల్పం

Published Fri, Nov 28 2014 3:28 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

సంసద్ సంకల్పం - Sakshi

సంసద్ సంకల్పం

‘గ్రామాభివృద్ధి విషయంలో మహాత్మాగాంధీ సిద్ధాంతమే తనకు స్ఫూర్తి.. విలువలు, సామాజిక స్ఫూర్తి, మంచి విద్యను ప్రోత్సహించడం ద్వారా గ్రామాలు వెలుగులీనుతారుు.. వరంగల్ జిల్లాలోని గంగదేవిపల్లి, గుజరాత్ రాష్ట్రంలోని పన్సారీ గ్రామాలను ఆదర్శంగా తీసుకుని ప్రతీ పల్లె అభివృద్ధి సాధించాలి..

- పథకం ప్రారంభ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
 
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన(ఎస్‌ఏజీవై) పథకాన్ని ప్రవేశ పెట్టింది. మహాత్ముడి మాటను స్ఫూర్తిగా తీసుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఈ పథకంలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు తమ నియోజకవర్గ పరిధిలోని గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తారు. 2019 వరకు మూడు గ్రామాలను తీసుకుని అభివృద్ధి చేయూల్సి ఉంటుంది. ఆరోగ్యం, పారిశుద్ధ్యం, పచ్చదనం, సౌహార్థ్ర సంబంధాలు పెంచడమే ఈ పథకం ఉద్దేశం. మైదాన ప్రాంతాల్లో 3 వేల నుంచి 5 వేల జనాభా, గిరిజన ప్రాంతాల్లో 1000 నుంచి 3 వేల జనాభా ఉంటే చాలు.

ముందుగా 2016 నాటికి ఒక్కో ఎంపీ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయూలి. ఒక గ్రామం అభివృద్ధి చెందితే చుట్టుపక్కల గ్రామాలు కూడా అభివృద్ధి బాట పడతాయనేది లక్ష్యం. ఈ పథకంతో పల్లెల రూపురేఖలు మారనున్నారుు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వివిధ పథకాలకు సంబంధించిన నిధులను సమీకరించడం, తమ ఎంపీ నిధులను వీటికి జోడించి అభివృద్ధి చేయడమే లక్ష్యం. దీనికి జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ కూడా తోడ్పాటునందిస్తుంది. జిల్లాకు సంబంధించి ఇద్దరు లోక్‌సభ సభ్యులు, ముగ్గురు రాజ్యసభ సభ్యులు గ్రామాలను దత్తత తీసుకున్నారు.

వరంగల్ లోకసభ సభ్యుడు కడియం శ్రీహరి వర్ధన్నపేట మండలం ఐనవోలు గ్రామాన్ని, మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ నెల్లికుదురు మండలం నారాయణపురం, రాజ్యసభ సభ్యులు గుండు సుధారాణి ఆత్మకూరు మండలం నీరుకుల్ల, గరికపాటి మోహన్‌రావు గోవిందరావుపేట, రాపోలు ఆనందభాస్కర్ కొడకండ్ల మండలం ఏడునూతుల గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఎంపీలు దత్తత తీసుకున్న గ్రామాలను ‘సాక్షి’ సందర్శించింది. అక్కడి ప్రజల మనోభావాలను తెలుసుకుంది. అక్కడి సమస్యలు, ప్రజలు కోరుకుంటున్న వివరాలు మీకోసం..
 
ఏడునూతుల
కొడకండ్ల :  సంసద్ ఆదర్శ యోజన పథకంలో భాగంగా ఏడునూతుల గ్రామాన్ని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ దత్తత తీసుకున్నారు. అన్ని రంగాల్లో వెనుకబడిన గ్రామా న్ని కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి బాట పట్టించనున్నారు. దీంతో తమ గ్రామం ప్రగతి పథంలో పయనిస్తుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి జమ్మికుంటతండా ఆవాస ప్రాంతంగా ఉంది. ఇక్కడ నామమాత్రం గా మరుగు కాల్వలు, సీసీ రోడ్లు నిర్మించారు. మురుగు కాల్వ లు లేకపోవడంతో వ్యర్థపు నీరంతా వీధుల్లోనే ప్రవహిస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెయిన్ రోడ్డు నుంచి గ్రామంలోకి వెళ్లే రోడ్డు అధ్వానంగా తయారైంది.
 
భవనాలు కరువు..
గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రాలు నాలుగు ఉన్నాయి. వీటిలో ఒక్క కేంద్రానికి మాత్రమే సొంత భవనం ఉంది. మిగతావి అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. గ్రామ పంచాయతీ భవనం శిథిలావస్థకు చేరింది. గ్రంథాలయం లేకపోవడంతో పాఠకులు ఇబ్బంది పడుతున్నారు. కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం లేకపోవడంతో మహిళా, కుల, యువజన సంఘాల వారు సమావేశాలు నిర్వహించుకోవడానికి ప్రైవేటు భవనాలు ఆశ్రయించాల్సి వస్తోం ది. మంచినీ టి వసతి కూడా అం తంత మాత్రం గానే ఉంది. డీఫ్లోరైడ్ ప్రాజెక్ట్ పనులు పదేళ్ల క్రితం ప్రారంభమైనా నేటికీ పూర్తి కాలేదు. గ్రామం నుంచి వావిలా ల, పాకాల, నారబోయినగూడెంకు అంతర్గత రోడ్లు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. వ్యక్తిగత మరుగుదొడ్లు లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎస్సీ కాలనీలో మురుగు కాల్వలు, సీసీ రోడ్లు లేవు.
 
నారాయణపురం
నారాయణపురం(నెల్లికుదురు) : నారాయణపురం గ్రామం అభివృద్ధిలో ఆదర్శంగా నిలవనుంది. సంసద్ పథకంలో భాగంగా మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. 68 ఏళ్ల క్రితం ఏర్పడిన గ్రామంలో 762 కుటుంబాలు నివసిస్తున్నాయి. శివారులోని 15 గిరిజన తండాల్లో 93 శాతం గిరిజనులు ఉన్నారు. వీరంతా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. రికార్డుల్లో అక్షరాస్యత 90 శాతం ఉన్నప్పటికీ.. కేవలం 10 శాతమే ఉందని గ్రామస్తులు అంటున్నారు. అయితే గ్రామానికి చేరుకునేందుకు తారాసింగ్ బావి నుంచి రోడ్డు సౌకర్యం లేదు.  

ప్రధాన సమస్యలు..
విద్య, వైద్యం, విద్యుత్, తాగు, సాగునీరు, అంతర్గత రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేదు. 30 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన విద్యుత్ లైన్లు శిథిలావస్థకు చేరుకొని తీగలు తెగిపోతున్నాయి. తాగునీరు లేకపోవడంతో తండావాసులు అవస్థలు పడుతున్నారు. గ్రామం, తండాలో మరుగుదొడ్లు కేవ లం 21 శాతం నిర్మించుకున్నారు. అయితే గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్ డాక్టర్ ఊకంటి యాకూబ్‌రెడ్డి 44 అభివృద్ధి కమిటీలు వేశారు. ఇందులో 33 కమిటీలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి.

గ్రామంలో 462 పనులను గుర్తించి.. రూ.128కోట్లతో నివేదికను ప్రభుత్వానికి పంపించారు. మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో వైద్యం అందక గిరిజనులు అవస్థలు పడుతున్నారు. గ్రాామం ఏర్పడినప్పటి నుంచి కాస్తులో ఉన్న వారికి ఇప్పటివరకు హక్కు పత్రాలు ఇవ్వలేదు. రైతులు ధాన్యం నిల్వ చేసుకోవడానికి గోదాంలు, ఆరోగ్య కేంద్రం నిర్మించాలి. విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement