Monitoring Committee
-
మొదలైన పెట్టుబడుల కార్యాచరణ
సాక్షి, అమరావతి: విశాఖ వేదికగా మార్చి 3–4 తేదీల్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో కుదిరిన పెట్టుబడుల ఒప్పందాలను వాస్తవ రూపంలోకి తీసుకువచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ కార్యాచరణ ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. సదస్సులో కుదిరిన ఒప్పందాలను సాధ్యమైనంత త్వరగా అమల్లోకి తీసుకురావడానికి సీఎస్ చైర్మన్‌గా 17 మంది సభ్యులతో మానిటరింగ్ కమిటీని ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ఇప్పటికే ఉత్తర్వులు జారీచేశారు. ఈ కమిటీకి మెంబర్ కన్వీనర్‌గా రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తారు. వీరితో పాటు వ్యవసాయ, పశు సంవర్థక, ఆర్థిక, ఇంధన, జలవనరులు, పర్యాటక, రెవెన్యూ, వాణిజ్య పన్నుల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, జీఏడీ (కో–ఆర్డినేషన్), స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్, శాఖల ముఖ్య కార్యదర్శులు, ప్లానింగ్, ఐటీ–ఐటీఈఎస్, ట్రాన్‌పోర్ట్ శాఖల కార్యదర్శలు సభ్యులుగా ఉంటారు. వీరుకాకుండా అవసరమైతే ఇతర శాఖలకు చెందిన అధికారులను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలుస్తారు. ప్రతీ శాఖలో కుదరిన ఒప్పందాలను ఆయా ఇన్వెస్టర్లతో సమీక్షించి పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు? ఎప్పటిలోగా ఉత్పత్తిలోకి తీసుకొస్తారన్న అంశాలపై ఒక అజెండాను రూపొందించి ఆ వివరాలను పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో పాటు సమీక్ష కోసం మానిటరింగ్ కమిటీకి ఇవ్వాల్సిందిగా ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఇక మానిటరింగ్ కమిటీ తరచూ సమావేశమై పెట్టుబడులను త్వరితగతిన వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి ఉన్న అడ్డంకులు, సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలన్నారు. విశాఖ జీఐఎస్–2023 సమావేశాల సందర్భంగా మొత్తం 386 ఒప్పందాలు జరిగినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఒప్పందాల ద్వారా రూ.13,11,468 కోట్ల పెట్టుబడులతో పాటు 6,07,383 మందికి ఉపాధి లభించనుంది. ప్రతీ 15రోజులకోసారి సమీక్షిస్తాం జాతీయ, అంతర్జాతీయ కార్పొరేట్ దిగ్గజ ప్రముఖలను విశాఖకు తీసుకొచ్చి లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రం ఇప్పుడు వాటిని వాస్తవరూపం తీసుకురావడంపై దృష్టిసారించింది. ఎంఓయూలు కుదుర్చుకున్న కంపెనీలు ఎప్పటిలోగా ఉత్పత్తి ప్రారంభించాలని భావిస్తున్నాయో అన్న దానిపై సమాచారం సేకరించి దానికనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం. ఇందులో భాగంగా తొలి సమావేశం గత శుక్రవారం సీఎస్ అధ్యక్షతన జరిగింది. ఇలా ప్రతీ 15 రోజులకొకసారి సమావేశమై ఎంఓయూల పరిస్థితిని సమీక్షిస్తాం. – జి. సృజన, రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ -
దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం
న్యూఢిల్లీ: భారత్‌లో నిరుద్యోగం రోజు రోజుకీ ఎక్కువైపోతోంది. డిసెంబర్లో అత్యధికంగా 8.3% శాతానికి నిరుద్యోగం రేటు ఎగబాకింది. గత 16 నెలల్లో అదే అత్యధికమని సెంటర్ ఫర్ మోనటిరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) ఒక నివేదికలో తెలిపింది. పట్టణాల్లో నిరుద్యోగ రేటు 2022 నవంబర్‌లో 8.96 ఉంటే, డిసెంబర్ వచ్చేసరికి 10.09 శాతానికి పెరిగింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం రేటు నవంబర్‌లో 7.55% ఉంటే స్వల్పంగా తగ్గి డిసెంబర్ నాటికి 7.44శాతానికి చేరుకుంది. నిరుద్యోగం రేటు అత్యధికంగా హర్యానాలో 37.4% ఉంది. ఆ తర్వాత స్థానాల్లో రాజస్థాన్ (28.5%), ఢిల్లీ (20.8%) ఉన్నాయి. కేంద్రానికి అతి పెద్ద సవాల్ పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం అదుపు చెయ్యడం, లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించడం మోదీ సర్కార్ ముందున్న అతి పెద్ద సవాల్‌గా ఉంది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన పాదయాత్రలో కూడా అధిక ధరలు, నిరుద్యోగం సమస్యలపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. ఇలాంటి సమయంలో నిరుద్యోగం రేటు మరోసారి పెరిగిపోవడం ఆందోళన కలిగించే అంశమే. అయితే కరోనా భయాలు తొలగిపోయిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో కార్మికుల భాగస్వామ్యం బాగా పెరిగిందని, ఇది నిజంగానే మంచి విషయమని సీఎంఐఈ మేనేజింగ్ డైరెక్టర్ మహేశ్ వ్యాస్ చెప్పారు. గత ఏడాది కాలంలో ఉపాధి కార్మికులు భాగస్వామ్యం రేటు పెరిగి డిసెంబర్లో అత్యధికంగా 40.48% నమోదైందని ఆయన వివరించారు. -
ఏపీ: 9 మందితో ఆక్సిజన్ మానిటరింగ్ కమిటీ
సాక్షి, అమరావతి: కరోనా బాధితులకు ఆక్సిజన్ సరఫరా చాలా కీలకమైనందున.. దీన్ని సమర్థంగా నిర్వహించడం కోసం 9 మంది సభ్యులతో మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం ఆక్సిజన్ ఎంత కావాలి? భవిష్యత్ అవసరాలకు ఎంత అవసరం.. అనే అంశాలను పరిశీలించడంతో పాటు.. ఎలాంటి అంతరాయం లేకుండా ఆక్సిజన్ సరఫరా అయ్యేలా ఈ కమిటీ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ పేర్కొన్నారు. ఐఏఎస్ అధికారులు ఢిల్లీ రావు, రాజాబాబుతో పాటు పరిశ్రమలశాఖకు చెందిన డీడీ ఎం.సుధాకర్‌బాబు, ముగ్గురు కన్సల్టెంట్లు, డ్రగ్ ఇన్స్పెక్టర్ అవినాష్‌రెడ్డి, రవాణా శాఖ నుంచి ఆర్టీఏ పుమేంద్ర, ఎంవీఐ ప్రవీణ్‌లతో ఈ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రత్యేక అధికారి షాన్ మోహన్‌కు వీరంతా రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చదవండి: World Bank: మిగతా రాష్ట్రాల కంటే ఏపీ బెస్ట్ పోలవరం ప్రాజెక్టుకు రూ.745.94 కోట్లు -
సభలో కల్తీ చర్చ
♦ చర్యలు తప్పదన్న మంత్రి బాలాజీ ♦ పరిశోధన సాగుతున్నట్టు వివరణ ♦ హార్బర్ ప్రైవేటీకరణపై సీఎం వ్యాఖ్య ♦ తామెప్పుడూ ప్రజల పక్షమే: స్టాలిన్ పాలల్లో రసాయనాల కల్తీ వ్యవహారం అసెంబ్లీకి చేరింది. ప్రధాన ప్రతిపక్షం పట్టుతో స్పీకర్ చర్చకు అనుమతి ఇచ్చారు. కల్తీ విషయంలో తగ్గేది లేదని, పరిశోధనల మేరకు చర్యలు తప్పదని పాడి, డెయిరీల అభివృద్ధి శాఖ మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ స్పష్టం చేశారు. ఇక ఎన్నూరు కామరాజర్ హార్బర్ ప్రైవేటీకరణపై తమకు ఎలాంటి సమాచారం లేదని సీఎం పళనిస్వామి స్పష్టం చేశారు. ఇక, వాకౌట్లు సాగించినా, మళీ అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రజల పక్షాన తాము పోరాడుతున్నామని స్టాలిన్ వ్యాఖ్యానించారు. సాక్షి, చెన్నై : అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం పాలకల్తీపై ఇది వరకు మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ చేసిన సంచలన ప్రకటనపై చర్చకు ప్రధాన ప్రతిపక్షం పట్టుబట్టింది. స్పీకర్ ధనపాల్ అనుమతి ఇవ్వడంతో ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ ప్రసంగాన్ని అందుకున్నారు. ప్రైవేటు పాలల్లో రసాయనాల కల్తీపై మంత్రి చేసిన సంచలన ప్రకటనను గుర్తు చేశారు. కల్తీని ధ్రువీకరించే విధంగా నిర్ధారణ సాగినట్టు, ఈ వ్యవహారం నిగ్గు తేలని పక్షంలో ఉరి కంబం ఎక్కేందుకు తాను సిద్ధమని మంత్రి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ తన దైన శైలిలో స్టాలిన్ స్పందించారు. అయితే, ఈ కల్తీ విషయంలో తీసుకున్న చర్యలు ఏమిటోనని ప్రశ్నించారు. డీఎంకే శాసన సభాపక్ష ఉప నేత దురైమురుగన్ సైతం తన ప్రసంగలో కల్తీ వ్యవహారంలో ఇప్పటివరకు సాగిన పరిణామాలను గుర్తు చేస్తూ, చర్యలు ఎక్కడ అని ప్రశ్నల వర్షం కురిపించారు. భిన్న వాదనలు ప్రభుత్వంలోనే ఈ వ్యవహారం మీద సాగుతున్నాయని విమర్శలు గుప్పించారు. పాలల్లో కల్తీ లేనట్టుగా కోర్టుకు ఆరోగ్యశాఖ నివేదించి వివరణలు అసెంబ్లీ ముందు ఉంచారు. దీంతో మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ వివరణ ఇస్తూ, తన ప్రకటనకు కట్టుబడే ఉన్నట్టు స్పష్టం చేశారు. పాల కల్తీ నిగ్గు తేల్చేందుకు తగ్గ పరిశోధనలకు అడ్డు పడే వాళ్లూ ఉన్నారని వ్యాఖ్యానించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎదురైనా పరిశోధన సాగుతుందని, చర్యలు తప్పదని స్పష్టం చేశారు. తాము ఇప్పుడే చర్యలు తీసుకున్న పక్షంలో ప్రైవేటు సంస్థలు కోర్టుల్ని ఆశ్రయించి జరిమానాలతో తప్పించుకునే ప్రయత్నం చేస్తాయని, అందుకే పరిశోధన నివేదిక ఆధారంగా ఒకేసారి వేటు పడే విధంగా చర్యలు తీసుకుని తీరుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో రాష్ట్ర స్థాయిలో ఓ పర్యవేక్షణ కమిటీ, జిల్లాల కలెక్టర్ల స్థాయిలో ఆయా జిల్లాల్లో ప్రత్యేక కమిటీలు పాల కల్తీపై పరిశీలన సాగిస్తున్నట్టు తెలిపారు. తదుపరి సభలో న్యాయశాఖకు నిధుల కేటాయింపులపై ఆ శాఖ మంత్రి సీవీ షణ్ముగం వివరించారు. హార్బర్ ప్రైవేటీ కరణ సమాచారం లేదు : ముందుగా ప్రశ్నోత్తరాల సమయంలో పలు ప్రశ్నలను ప్రభుత్వం ముందు ప్రతి పక్షాలు ఉంచాయి. ఆ మేరకు ఎన్నూరు కామరాజర్ హార్బర్‌ను ప్రైవేటీకరించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నదంటూ వచ్చిన వార్తలపై సభలో ప్రభుత్వాన్ని డీఎంకే సభ్యులు ప్రశ్నించగా, సీఎం స్పందించారు. అధికారికంగా తమకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. కేంద్రం వంద శాతం వాటాల్ని వెనక్కు తీసుకుంటున్నట్టుగా మీడియాలో మాత్రమే వార్తలు వచ్చాయని గుర్తు చేశారు. ఈ విషయంగా కేంద్రాన్ని, కేంద్ర నౌకాయన శాఖ నుంచి సమాచారం రాబట్టే యత్నం చేస్తామన్నారు . ఇక, హార్బర్ వెంబడి రోడ్డు మీద నివాసం ఉంటున్న వారికి సొంత గృహాల నిర్మాణం గురించి అడిగిన ప్రశ్నకు మంత్రి ఉడుమలై రాధాకృష్ణన్ స్పందించారు. బహుళ అంతస్తుల గృహాల నిర్మాణం సాగుతోందని, అందులో వారికి కేటాయింపులు ఉంటాయని వివరించారు. ఇక, తిరుచ్చి తుపాకీ పరిశ్రమ ప్రైవేటీకరణ గురించి ప్రశ్నించగా, అలాంటి సమాచారం లేదని ప్రభుత్వం తరఫున డీఎంకే సభ్యులకు మంత్రి వివరణ ఇచ్చారు. ప్రజల పక్షం : డీఎంకే వాకౌట్ల పర్వంతో సభా సమయాన్ని వృథా చేస్తున్నట్టుగా అధికార పక్షం విమర్శలు గుప్పించడంతో స్టాలిన్ స్పందించారు. ప్రధాన ప్రతిపక్షం గళం నొక్కడం లక్ష్యంగా అధికార పక్షం వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. పదే పదే సమస్యలను ప్రస్తావించినా, చర్చకు పట్టుబట్టినా, పాలకులు ఖాతరు చేయని దృష్ట్యా, వాకౌట్‌తో తమ నిరసన తెలియచేస్తున్నామని గుర్తు చేశారు. వాకౌట్ చేసి తాము ఇళ్లకు వెళ్లడం లేదని, మళ్లీ సభలోకే వెళ్లి మరో అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. అసెంబ్లీలో ఆరోగ్యకర వాతావరణం లేదని, ప్రధాన ప్రతిపక్షం సహకరిస్తున్నా, పాలకులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎప్పుడూ తాము ప్రజల పక్షమేనని, ప్రజల పక్షాన తమ గళం అసెంబ్లీలో వినిపిస్తూనే ఉంటుందన్నారు. -
పేదల గొంతు తడ పండి
► వేసవి ముగిసేవరకు ► ట్యాంకర్లతో నీటిసరఫరా చేయాలి ► పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయాలి ► మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఎంపీ, ► ఎమ్మెల్యేల డిమాండ్ మహబూబ్‌నగర్ క్రైం : మండే ఎండల్లో తాగునీటికోసం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని, వారి గొంతు తడపడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మానిటరింగ్ కమిటీ సమావేశ అధ్యక్షుడు, నాగర్‌కర్నూల్ ఎంపీ నంది ఎల్లయ్య అన్నారు. సోమవారం స్థానిక జెడ్పీహాల్‌లో జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ సమావేశం ఎంపీ నంది ఎల్లయ్య అధ్యక్షతన జరిగింది. గ్రామీణ నీటి సరఫరా విభాగం, డ్వామా, హౌసింగ్, పంచాయతీ రాజ్, డీఆర్డీఏ, జెడ్పీ, గిరిజన సంక్షేమ శాఖ, మాడా విభాగాలపై వేర్వేరుగా చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు చేసే గ్రామీణాభివృద్ధి పథకాలు సకాలంలో లబ్ధిదారులకు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు. వేసవి ముగిసేవరకు గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా ప్రభుత్వం మినరల్ వాటర్ సరఫరా చేయాలన్నారు. లీజుకు తీసుకున్న బోర్లు, ట్రాన్స్పోర్ట్ బిల్లులు సకాలంలో ఇవ్వడం లేదని, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు గ్రామాలను సందర్శించడం లేదన్నారు. తాగునీటి పథకాలను పూర్తిచేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్‌పై చర్య తీసుకోవాలని సమావేశంలో ఎంపీ నంది ఎల్లయ్య డిమాండ్ చేశారు. ఇంచార్జ్ కలెక్టర్ రాంకిషన్, డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ లక్ష్మినారాయణ, హౌసింగ్ పీడీ రమణారావు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యమే.. : జెడ్పీచైర్మన్ గట్టు మన్నపురం తాగునీటి పథకం ప్రారంభం చేసి ఏళ్లు గడుస్తున్నా గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎవరికి ప్రయోజనం చేకూరడంలేదు. గతంలో వరుసగా 10 సార్లు గెలిచిన నేతలు గద్వాలకు ఏం చేయలేకపోయారు. తాగునీటి పథకంలో నాసిరకం పైపులు వేసి ప్రజాధనం వృథా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. ప్రత్యేక నిధులు కావాలి : డీకే అరుణ, గద్వాల ఎమ్మెల్యే నాగర్‌దొడ్డి పథకాలకు సకాలంలో నిధులు అందక ఇబ్బందులొస్తున్నాయి. ప్రత్యేక నిధులు వస్తేగాని సమస్యలు తీరవు. ఎండలు అధికంగా ఉన్న నేపథ్యంలో ట్యాంకర్ల ద్వారా గ్రామాల్లో తాగునీరు సరఫరా చేయాలి. ప్రతి మనిషికి వంద లీటర్ల చొప్పున నీటి సరఫరా చేయాలి. కౌకుంట్లను పూర్తిచేయండి వెంకటేశ్వర్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే తాగునీరు సమస్య లేకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలి. కౌకుంట్ల తాగునీటి పథకం పనులు త్వరగా పూర్తిచేసి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. ఎక్కడ నిర్లక్ష్యం జరిగినా ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఒక్క సమస్యా పరిష్కారం కాలే.. సంపత్‌కుమార్, అలంపూర్ ఎమ్మెల్యే గతంలో జరిగిన సమావేశంలో నీటి సమస్యపై చాలాసార్లు చర్చించాం. అయినా ఏ ఒక్క సమస్యను కూడా అధికారులు పరిష్కరించలేదు. ప్ర భుత్వం నుంచి వస్తున్న కోట్ల రూపాయలు క్షేత్రస్థాయిలోకి వెళ్లడం లేదు. మీ నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఎంతగానో నష్టపోతున్నారు. కరువు నివారణ చర్యలు తీసుకోవడంలో అధికారుల బాధ్యత ఎంతో ఉంది. ప్రణాళికతో ముందుకెళ్లాలి : కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నడూలేని విధంగా ఈ సారి ఎండల ప్ర భావం ఉంది. ఈ కారణంతోనూ నీటికి అనేక స మస్యలు వస్తున్నాయి. అధికారులు సమస్యను అధిగమించడానికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్లాలి. ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నా ప్రజలకు సరిపోవడంలేదు. వాటి సంఖ్యను పెంచాలి. కేంద్ర ప్రభుత్వం జిల్లాకు ఎన్సీడీపీ పథకం కింద విడుదల చేసిన రూ.66 కోట్లను వినియోగించుకోవాలి. డీకే అరుణగీ బండారి భాస్కర్ సమావేశంలో బండారి భాస్కర్ మాట్లాడుతున్న సమయంలో గట్టు మన్నపురం ప ను ల్లో అవినీతి జరిగిందని ఆరోపించగా గ ద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ కలుగచేసుకున్నారు. క్షేత్రస్థాయిలో జరిగిన విషయాలు తె లుసుకొని మాట్లాడాలని, నోటికేదొస్తే అది మాట్లాడితే సరిపోదని తప్పుపట్టారు. ప్ర స్తుతం మీ ప్రభుత్వం ఉంది మీకు నచ్చిన ప నులు గద్వాలకు చేయొచ్చు కదా అని ప్రశ్నించారు. అందుకు జెడ్పీచైర్మన్ బండారి భాస్కర్ బదులిస్తూ గద్వాలకు గత పదేళ్ల నుంచి వరుసగా గెలిచి ఏం చేశారని చెప్పడంతో ఇద్దరి మధ్య మాటల యు ద్ధం చోటుచేసుకుంది. అనంతరం ఎమ్మెల్యే లు కలుగజేసుకొని వారిని సముదాయించారు. -
‘అగ్రిగోల్డ్’ పర్యవేక్షణ కమిటీకి సౌకర్యాలు కల్పించాల్సిందే
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ భూముల వేలానికి సంబంధించి తాము ఏర్పాటు చేసిన పర్యవేక్షణ కమిటీకి అన్ని సౌకర్యాలు కల్పించాల్సిందేనని ఉభయ రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టు మరోసారి తేల్చి చెప్పింది. పర్యవేక్షణ కమిటీకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాతో పంచుకోవద్దని, అలా చేస్తే కేసులో వాదనలు వినిపించేందుకు అనుమతించబోమని పిటిషనర్ల తరఫు న్యాయవాదులకు హైకోర్టు తేల్చిచెప్పింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులిచ్చింది. ప్రజల నుంచి అగ్రిగోల్డ్ యాజమాన్యం వివిధ రూపాల్లో రూ.వేల కోట్లు వసూలు చేసి, వాటిని చెల్లించకుండా ఎగవేసిందని.. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని అగ్రిగోల్డ్ డిపాజిటర్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎ.రమేశ్‌బాబు, మరికొందరు హైకోర్టులో వేర్వేరుగా పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను ఇప్పటికే పలుమార్లు విచారించిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. -
కమిటీ ఆమోదం పొందగానే భూముల వేలం
* ప్రముఖ దినపత్రికల్లో ప్రకటనలు ఇవ్వండి * సీ1 ఇండియాకు హైకోర్టు ఆదేశం * అగ్రిగోల్డ్ కేసులో విచారణ రెండు వారాలకు వాయిదా సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ భూముల విషయంలో పర్యవేక్షణ కమిటీ ఆమోదం పొందిన వెంటనే వేలం ప్రక్రియను ప్రారంభించాలని హైకోర్టు గురువారం వేలం సంస్థ ‘సీ1 ఇండియా’ను ఆదేశించింది. భూముల వేలం విషయంలో ఆయా రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికల్లో ప్రముఖంగా ప్రకటనలు ఇవ్వాలని, ఆ ప్రకటనలు అందరి దష్టిని ఆకర్షించేలా ఉండాలని తెలిపింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్రిగోల్డ్ యాజమాన్యం సామాన్య ప్రజల నుంచి రూ.6,350 కోట్లను డిపాజిట్ల రూపంలో వసూలు చేసి చేతులెత్తేసిందని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ అగ్రిగోల్డ్ డిపాజిట్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎ.రమేశ్‌బాబు పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు ధర్మాసనం గురువారం విచారించింది. ఈ సందర్భంగా పర్యవేక్షణ కమిటీ తరఫు న్యాయవాది రవిప్రసాద్ వాదనలు వినిపించారు. రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ సూర్యారావు నేతత్వంలోని పర్యవేక్షణ కమిటీ బుధవారం సమావేశమైందని తెలిపారు. వేలం విధివిధానాలపై హైకోర్టు ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తోందని చెప్పారు. అగ్రిగోల్డ్ తరఫు సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ, లేఔట్ల అభివద్ధికి తాము పెట్టుకునే దరఖాస్తులపై సత్వరమే నిర్ణయం తీసుకునేలా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. తప్పుదోవ పట్టిస్తున్నారు అగ్రిగోల్డ్ యాజమాన్యం కేసులో అగ్రిగోల్డ్ దాఖలు చేసిన కౌంటర్‌కు పిటిషనర్ రమేశ్‌బాబు తిరుగు సమాధానం(రిప్లై) దాఖ లు చేశారు. మొత్తం 14 ఎకరాల భూమిని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి ప్రత్తిపాటి వెంకాయమ్మకు విక్రయించారన్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించి, లావాదేవీల సొమ్మును హైకోర్టు రిజిష్ట్రార్ వద్ద డిపాజిట్ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. వేలం ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందే బినామీల ద్వారా తమ భూములను అమ్మి సొమ్ము చేసుకోవాలని అగ్రిగోల్డ్ యాజమాన్యం భావిస్తోందని, అందుకు ఉదాహరణే ఈ 14 ఎకరాల భూమి విక్రయమని వెల్లడించారు. -
హరిబాబు జోరు..అశోక్ బేజారు
విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీకి చైర్మన్ ఆయన. కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రగతి, అధికారుల పనితీరు పర్యవేక్షణపై ఆయన ఆధ్వర్యంలోనే సమీక్ష ఆసాంతం జరగాల్సి ఉంది. అయితే జిల్లాలో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో పక్కజిల్లా ఎంపీ హవా ప్రదర్శించేసరికి సాక్షాత్తు కమిటీ చైర్మన్ ప్రేక్షక పాత్ర పోషించారు. దీంతో సమావేశంలో పాల్గొన్న అధికారులు, జిల్లా ప్రజాప్రతినిధులు విస్తుపోయారు. 'ఎంపీ రివ్యూ చేస్తున్నారు...కేంద్రమంత్రి చూస్తున్నారు' అంటూ గుసగుసలాడుకున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రగతి, అధికారుల పనితీరు, పర్యవేక్షణపై నిర్వహించిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో విశాఖ పార్లమెంట్ సభ్యుడు కంభంపాటి హరిబాబు దూకుడు చూపించారు. కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు కమిటీకి చైర్మన్ అయినప్పటికీ హరిబాబు దాదాపు ఓవర్ టేక్ చేశారు. హరిబాబు సమావేశానికి రాక ముందు వరకే అశోక్ సమీక్ష కన్పించగా, ఆ తర్వాత హరిబాబు హవాయే కన్పించింది. దీంతో అశోక్ దాదాపు ప్రేక్షక పాత్ర పోషించాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్థానిక డీఆర్డీఎ సమావేశం హాల్లో ఉదయం 11.30గంటలకు విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ప్రారంభమైంది. కమిటీ చైర్మన్, కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుతో పాటు రాష్ర్టమంత్రి కిమిడి మృణాళిని, జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి, ఎమ్మెల్యేలు పతివాడ నారాయణస్వామినాయుడు, మీసాల గీత, కె.ఎ.నాయుడు, కలెక్టర్ ఎం.ఎం.నాయక్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఎజెండాలో పేర్కొన్న ప్రకారం అశోక్ సమీక్ష మొదలు పెట్టారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అందే పథకాలపై సమీక్ష నిర్వహించారు. ఒకటి రెండు సందర్భాల్లో అధికారులిచ్చే వివరణపై అశోక్ అసంతృప్తి చెందుతూ గత ప్రభుత్వ హయాంలో షాడో నేత, బ్రోకర్లను ప్రస్తావిస్తూ ముందుకు సాగారు. ఇంతలో గృహ నిర్మాణ శాఖ చర్చకొచ్చింది. అదే సమయంలో విశాఖ పార్లమెంట్ సభ్యుడు కంభంపాటి హరిబాబు హాజరయ్యారు. హౌసింగ్ పీడీ శాఖా పరంగా అమలవుతున్న పథకాల్ని వివరిస్తుండగా హరిబాబు జోక్యం చేసుకుని ఐఏవై కింద ఎవరికి ఇళ్లు మంజూరు చేశారని, వాటి జాబితా ఏదని, ఏ ప్రకారం లబ్ధిదారుల్ని ఎంపిక చేశారని ప్రశ్నించారు. దీనికి హౌసింగ్ పీడీ సూటిగా సమాధానం చెప్పలేదు. లబ్ధిదారుల ఎంపిక తాము చేయలేదని, హౌసింగ్ ఎం.డి. చేశారని, అక్కడి నుంచే మంజూరు జాబితా వచ్చిందని చెప్పడంతో హరిబాబులో ఆగ్రహించారు. ఈ సందర్భంలో రాష్ట్రమంత్రి కిమిడి మృణాళిని జోక్యం చేసుకోగా అధికారుల్ని వెనకేసుకుని రావద్దని సుతిమెత్తగా మంత్రికి సూచిం చారు. అక్కడి నుంచి డ్వామా, డీఆర్డీఎ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఐటీడీఎ, ఉద్యానవన శాఖ, ట్రాన్స్‌కో తదితర శాఖలపై దాదాపు హరిబాబే సమీక్ష నిర్వహించారు. ప్రతి అధికారినీ గట్టిగా నిలదీశారు. పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్‌ఈలపై కూడా విరుచుకుపడ్డారు. మధ్యలో ఒకటి రెండు సందర్భాల్లో అశోక్ మాట్లాడేందుకు ప్రయత్నించినా హరిబాబు స్పీడుకు వెనక్కి తగ్గారు. అసలీ కమిటీకి చైర్మన్ అశోకా, హరిబాబా అని పలువురు లోలోపల చర్చించుకున్నారు. గ్యాప్ ఇవ్వకుండా హరిబాబు సమీక్ష చేయడంతో ఎందుకొచ్చిందనుకున్నారో ఏమో గానీ అశోక్ చూస్తూ ఉండిపోయారు. సమీక్ష సమయం ఎక్కువవడంతో అశోక్ గజపతిరాజుకు ఆవలింతలు కూడా వచ్చేశాయి. అప్పుడైనా హరిబాబు వెనక్కి తగ్గుతారేమోనని పలువురు ప్రజాప్రతినిధులు ఆశించారు. కానీ చివరి వరకు ఫలితం లేకపోయింది. -
నిఘా, పర్యవేక్షణ కమిటీ చైర్మన్‌గా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: నిఘా, పర్యవేక్షణ కమిటీ జిల్లా చైర్మన్‌గా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి నియమితులయ్యారు. కో చైర్మన్లుగా భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మల్కాజిగిరి ఎంపీ చామకూర మల్లారెడ్డిలను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణాభివృద్ధి ద్వారా అమలయ్యే కార్యక్రమాలపై ఈ కమిటీ సమీక్షించి తదుపరి చర్యలు తీసుకుంటుంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా నీటియాజమాన్య సంస్థల పరిధిలో కేంద్ర ప్రభుత్వం అమలుచేసే కార్యక్రమాలను కమిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించి నిర్ణయాలు తీసుకోనుంది. గతంలో ఈ కమిటీకి చైర్మన్‌గా సర్వే సత్యనారాయణ కొనసాగారు. అయితే కేంద్ర మంత్రిగా విధులు నిర్వహించిన నేపథ్యంలో ఈ కమిటీ భేటీ అరుదుగా జరిగింది. ఈ క్రమంలో పర్యవేక్షణ లోపించడంతో ఉపాధిహామీ పథకంలో పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయి. తాజాగా కొత్త కమిటీ ఏర్పాటు కావడంతో ఈ అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందో లేదో చూడాలి. -
సాదాసీదాగా..
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం సాదాసీదాగా ముగిసింది. శనివారం ఎంపీ రాథోడ్ రమేష్ అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ సమావేశం నిర్వహించారు. ఇందులో ఎజెండా ప్రకారం 28 అంశాలపై చర్చించాల్సి ఉండగా.. 15 అంశాలకే పరిమితం చేశారు. పైగా చర్చ జరిగిన అంశాలనూ అంతగా లోతుగా పట్టించుకోలేదు. చెన్నూర్ మండలం కత్తెరశాల వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు చేపట్టిన ధర్నాకు విజిలెన్స్ కమిటీ మద్దతు తెలిపింది. వాగుపై వంతెన నిర్మాణానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ప్రధానంగా వ్యవసాయంలో పంట నష్టం, హౌసింగ్‌లో ఇళ్లను కట్టకుండానే బిల్లులు చెల్లించడం, కూలిపోయిన ఇళ్లు, పంచాయతీ రాజ్ శాఖలో వర్షాలకు చెడిపోయిన రోడ్లపై చర్చ కొనసాగింది. గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం, డ్వామాలో ఉపాధి హామీ కూలీ డబ్బుల చెల్లింపు, ఇందిర జలప్రభ కింద ఎస్సీ, ఎస్టీల వ్యవసాయ భూములకు సాగునీరు, ఆర్‌డబ్ల్యూఎస్‌లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీరు కల్పించాల్సిన గ్రామాలకు పైప్‌లైన్ సౌకర్యాలు, మార్కెట్ యార్డులో పత్తి కొనుగళ్లు, విద్యుత్, అంగన్వాడీలపై, పాఠశాలలపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అహ్మద్‌బాబు మాట్లాడుతూ.. బేల మండలానికి మంజూరైన సబ్ మార్కెట్‌యార్డు ఏర్పాటుకు స్థలం గుర్తించామని, నాలుగు నెలల్లో కాంటాలతో కూడిన మార్కెట్‌యార్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. జిన్నింగ్‌మిల్లులో పత్తి కొనుగోళ్లు కుదరదని, అలాగైతే జిల్లా వ్యాప్తంగా చేపట్టాల్సి ఉంటుందన్నారు. ఐసీడీఎస్‌లో అమృతహస్తం, సబల కార్యక్రమంపై పూర్తి వివరాలను తనకు అందజేయాలని పీడీ మీరాబెనర్జీని ఆదేశించారు. గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం, పంచాయతీ భవనాలు, మండల సమాఖ్య భవన నిర్మాణాలకు, ఇతర పనులకు మార్చి 31 వరకు కొత్తగా మంజూరు ఇవ్వలేమని డ్వామా పీడీ వినయ్‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు. హౌజింగ్ పీడీ గంగారాం మాట్లాడుతూ.. అవతవకలు జరిగిన మండలాల్లో విచారణ చేపట్టి సంబంధిత ఏఈని సస్పెండ్ చేయడం జరిగిందని తెలిపారు. విద్యుత్ శాఖ ఎస్ఈ అశోక్ మాట్లాడుతూ.. కరెంటు లేని గ్రామాల్లో స్తంభాలు సరఫరా చేస్తామన్నారు. చెడిపోయిన రోడ్లకు మరమ్మతు కోసం టెండర్లు పిలిచామని ఎస్ఈ ఉమా మహేశ్వర్‌రావు పేర్కొన్నారు. సమావేశంలో ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, డీఆర్వో ఎస్ఎస్.రాజు, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, జేడీఏ రోజ్‌లీల, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇళ్లు కట్టకుండానే బిల్లులు చెల్లించారు.. - రాథోడ్మ్రేష్, ఆదిలాబాద్ ఎంపీ ఏజెన్సీ ప్రాంతమైన పిట్టగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని కొసాయి గ్రామంలో గిరిజనులకు, కోలాంలకు, ఎస్సీ, ఎస్టీలకు 20 ఇళ్లు మంజూరయ్యాయి. కానీ.. వారు నిర్మించకుండానే అధికారులే బిల్లులు కాజేశారు. ఇందిర జలప్రభ కింద ఎంత మంది లబ్ధిదారులున్నారు.. ఏయే పనులు చేపట్టాల్సి ఉందో అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవకతవకలు - వివేక్, ఎంపీ, పెద్దపల్లి భీమిని, నెన్నెల, బెల్లంపల్లి మండలాల్లో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో చాలా అవకతవకలు జరిగాయి. రచ్చబండ కార్యక్రమంలో కూడా ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. దండేపల్లి మండలం వెల్గనూరులో పశుసంవర్ధక శాఖకు చెందిన డాక్టర్ రావడం లేదు. ఇందిరా జలప్రభ కింద ఎస్సీ, ఎస్టీల వ్యవసాయ భూముల్లో బోర్లు వేయకుంటే ఆ పథకం ఫెయిల్ అయినట్లే. ఇటిక్యాల, కోటపల్లి, కాసిపేటలో ఆర్‌డబ్ల్యూఎస్‌కు సంబంధించిన పనులు ఇంకా ప్రారంభం కాలేదు. రోడ్లు సరిగా లేవు.. - గుండా మల్లేష్, ఎమ్మెల్యే, బెల్లంపల్లి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జిల్లాకు కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. ఇంటర్ కనెక్టివిటి కింద చేసి గ్రామాలలో పనులు జరిగేలా చూడాలి. క్లస్టర్ విలేజ్ ట్రైనింగ్ క్యాంప్‌కు ఒక్క గ్రామం, మండలం కానీ ఎంపికకాలేదు. వర్షాలకు రోడ్లు పూర్తి అధ్వానంగా మారాయి. టేకులపల్లి నుంచి మండల కేంద్రానికి వెళ్లాలంటే 15 నుంచి 20 కిలో మీటర్లు వెళ్లాల్సి వస్తుంది. రోడ్లు సరిగా లేకపోవడం వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తోంది. బెల్లంపల్లి మార్కెట్‌యార్డు విస్తరణకు ప్రభుత్వ భూమి కావాలి. మార్కెట్‌యార్డు పక్కన ఉన్న ఐదారు ఎకరాలు ప్రభుత్వ భూమిని కేటాయించాలి. రాత్రిపూట చీకట్లో ప్రజలు.. - కావేటి సమ్మయ్య, ఎమ్మెల్యే, సిర్పూర్ సిర్పూర్ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు, బల్బులు లేక ప్రజలు చీకట్లో ఉంటున్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్న వారికి ఇంకా డబ్బులు చెల్లించలేదు. రోడ్లు బాగా చెడిపోయాయి. పత్తి తీసుకురావాలంటే ఇబ్బందులు.. - గేడం నగేష్, ఎమ్మెల్యే బోథ్ బోథ్ వ్యవసాయ మార్కెట్‌యార్డుకు పత్తి తీసుకురావాలంటే రైతులు ఇబ్బందులు పడుతున్నా రు. నియోజకవర్గంలోని చాలా మండలాల్లో రోడ్లు చెడిపోయి ఉన్నాయి. పనులు చేపట్టాలి. సబ్‌మార్కెట్ యార్డు ఏర్పాటు చేయాలి.. - జోగు రామన్న, ఎమ్మెల్యే, ఆదిలాబాద్ బేల మండలంలో సబ్ మార్కెట్ నిర్మాణానికి ప్రభుత్వం 2008లో మంజూరు చేసింది. కానీ ఇంత వరకు సబ్ మార్కెట్‌యార్డు ఏర్పాటు కాలేదు. బేలలో మార్కెట్ లేకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిన్నింగ్ మిల్లుల ద్వారా బేలలో పత్తి కొనుగోలు చేయాలి. జైనథ్‌లో మార్కెట్ యార్డు ఉన్న జిన్నింగ్ మిల్లులు లేవు. ఏజెన్సీ ఏరియాల్లో రోడ్లే లేవు.. - వేణుగోపాలచారి, ఎమ్మెల్యే ముథోల్ ఏజెన్సీ ఏరియాల్లో రోడ్లు లేవు. రెండేసి రేషన్‌కార్డులు ఉన్నాయి. కుభీర్‌లో 12 ఇండ్లు కాలిపోయాయి. ఇండ్లు పూర్తిగా కట్టుకున్న వారు బిల్లుల కోసం తిరుగుతున్నరు. ఉపాధి కూలీ డబ్బులు అందించాలి. ఆరు గ్రామాలకు ఒక పోస్టాఫీసు మాత్రమే ఉంది. దీని వల్ల ఇబ్బంది అవుతంది. ఆధార్, నగదు బదిలీలాగే వ్యక్తి గత మరుగుదొడ్లను కూడా జిల్లాలో మొదటి స్థానంలో నిలపాలి. ఐసీడీఎస్ అధికారులకు ఫోన్ చేసినా స్పందించడంలేదు.