కళాశాలలో నిఘా నేత్రాలు..
-
l సీసీ కెమెరాలు, బయోమెట్రిక్‌మిషన్‌ల ఏర్పాటు
-
l విద్యార్థులు, అధ్యాపకుల సమయపాలనకు దోహదం
-
l సత్ఫలితాలిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం
కరీమాబాద్ : ఇటు విద్యార్థులు..అటు అధ్యాపకులు సమయానికి కళాశాలకు వచ్చేందుకు బయోమెట్రిక్ మిషన్‌లు, ఏ తరగతి గదిలో ఏం జరుగుతుందో ప్రిన్సిపాల్ గది నుంచే తెలుసుకునేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
అంతేకాకుండా మధ్యాహ్న భోజనానికి వచ్చేవారి సంఖ్య కూడా తెలుసుకోవచ్చు. దీంతో క్రమశిక్షణతో కూడిన వాతావరణం ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ బోర్డు ద్వారా జిల్లాలోని 44 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సీసీ కెమెరాలతోపాటు విద్యార్థులు, అధ్యాపకులకు వేర్వేరుగా బయోమెట్రిక్ మిషన్లను ఏర్పాటు చేసింది. రంగశాయిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీసీ కెమెరాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏర్పాటు చేయగా, బయోమెట్రిక్ మిషన్‌లు తాజాగా ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపాల్ కె.శోభాదేవి తెలిపారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ మిషన్‌లు సత్ఫలితాలనిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.,
4 సీసీ కెమెరాలు, 2 బయోమెట్రిక్
మిషన్‌లు..
రంగశాయిపేట జూనియర్ కళాశాలలో నాలు గు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇందులో ప్రిన్సిపాల్ గదిల–1, వరండా–1, స్టాఫ్ రూం–1, గేట్ కనిపించేలా–1 సీసీ కెమెరా ఏ ర్పాటు చేశారు. అలాగే అధ్యాపకుల కోసం ప్రిన్సిపాల్ గదిలో ఒక బయోమెట్రిక్ మిషన్, విద్యార్థుల కోసం లైబ్రరీలో మరో బయోమెట్రి క్ మిషన్ ఏర్పాటు చేశారు. అధ్యాపకుల బయోమెట్రిక్ మిషన్ ఉదయం 9.30 గంటల నుంచి 9.45 గంటల వరకు పనిచేస్తుంది. ఆ తర్వాత ఉదయం 10.30 గంటల వరకు అధ్యాపకులు ఎవరు వచ్చినా హాఫ్‌డే ఆబ్సెంట్ కిందే లెక్క ఉంటుంది. సాయంత్రం 4 నుంచి 4.30 గం టలలోపు కళాశాల ముగిసిన తర్వాత మరోసారి అధ్యాపకులు బయోమెట్రిక్ మిషన్ వాడాల్సిందే. అలాగే విద్యార్థుల కోసం ఏర్పాటు చేసి న బయోమెట్రిక్ మిషన్ ఉదయం 9 నుంచి 11 గంటల వరకు ఉపయోగంలో ఉంటుంది. ఆ మధ్య సమయంలో బయోమెట్రిక్ మిషన్‌ను ఉపయోగించాలి. లేదంటే ఆబ్సెంట్ పడుతుంది.
సమయపాలనకు దోహదం
నూతనంగా జూనియర్ కళాశాలలో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ మిషన్‌లు ఏర్పాటు చేయడం ఉపయోగకరంగా ఉంది. సీసీ కెమెరాల వల్ల కళాశాలలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. ఎప్పటికప్పుడు తగిన సూచనలు ఇవ్వడం జరుగుతుంది. బయోమెట్రిక్ మిషన్‌ల వల్ల అధ్యాపకులు, సిబ్బంది సమయానికి రావడంతో పాటు విద్యార్థుల హాజరు శాతం పెరుగుతోంది. కళాశాలలో 230 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ ప్రక్రియ వల్ల గతంలో కంటే 70 నుంచి 80 శాతం విద్యార్థులు కళాశాలకు వస్తున్నారు. వంద శాతం విద్యార్థులు హాజరయ్యేలా కృషి చేస్తున్నాం.
– కె.శోభాదేవి, ప్రిన్సిపాల్, రంగశాయిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల