![Special intelligence for crime control - Sakshi](/styles/webp/s3/article_images/2018/02/7/qwer.jpg.webp?itok=o4o0ZXXX)
మాట్లాడుతున్న ఉట్నూర్ డీఎస్పీ వెంకటేశ్
నార్నూర్ : నేరాల నియంత్రణకు పోలిసు శాఖ అద్వర్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటుతో పాటు ప్రధాన కూడలిలో సీసీ కెమోరాలు ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉట్నూర్ డీఎస్పీ వెంకటేశ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక పోలిస్ స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడారు. డివిజన్‌లోని అన్ని పోలీస్టేషన్ పరిధిలో ప్రధాన పట్టణంతో పాటు కూడలిలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం ఏజెన్సీలో ప్రశాంత వాతావరణం ఉందని చెప్పారు. కొన్ని సమస్యలు చర్చల ద్వారా పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని ఎక్కడైనా ఎలాంటి అనుమానం ఉన్న గొడవలు జరిగినా నేరుగా పోలిస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలన్నారు.ఆయన వెంట ఎస్‌ఐ కృష్ణకుమార్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment