కలెక్టర్ త్రిలోక్‌చంద్ర
కోలారు : పారదర్శక పాలన అందించడం, ఎలాంటి అవ్యవహారాలకు చోటులేకుండా చే యడానికి తమ కార్యాలయంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ త్రిలోక్‌చంద్ర తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సిబ్బంది ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా ఉండేందుకు కార్యాలయంలో 8 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కార్యాలయానికి అధిక సంఖ్యలో వస్తుంటారన్నారు. దీనిపై నిఘా వహించడానికి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీనికి రూ.50 వేలు వెచ్చించినట్లు తెలిపారు. కలెక్టర్ కార్యాలయానికి కొత్త హంగులు తీసుకురానున్నామన్నారు. నగర సమీపంలోని కెంబోడి వద్ద కలెక్టర్ కార్యాలయ నిర్మాణానికి టెండర్లు పిలిచామన్నారు. మిని విధాన సౌధ పనులు పూర్తయిన తరువాత పనులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. నగరంలో 13వ తేదీ సర్వే పనులు పూర్తయిన తరువాత రోడ్డు విస్తరణ పనులను ప్రారంభిస్తామన్నారు. ఎం.జి రోడ్డు, కాళమ్మ గుడివీధి, ఖాద్రిపుర, దొడ్డపేట, చిక్కబళ్లాపురం రోడ్లను విస్తరిస్తున్నట్లు తెలిపారు. దొడ్డపేటలో ఆరు మీటర్లు, అంతరగంగ రోడ్డు 9 మీటర్లు విస్తరిస్తున్నట్లు తెలిపారు.
పోస్టు మార్టం రిపోర్టు వచ్చిన తరువాత చర్యలు
తాలూకాలోని త్యావనహళ్లి గ్రామం వద్ద అనుమానాస్పదంగా మృ తి చెందిన తాత మనువల పోస్టు మార్టం రిపోర్టు ఈ నెల 12 వస్తుందని, తదనంతరం ఘటన హత్యనా? లేక చిరుత దాడిలో మరణించారా? నిర్ధారించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలి పారు. అటవీశాఖ అధికారులు, సిబ్బంది ఇప్పటికే త్యావనహళ్లి గ్రామ సమీపంలో ఉన్న కొండలలో గాలింపు చేపడుతున్నారన్నారు. ఆ ప్రాంతంలో చిరుతలు ఉన్నట్లు ఆధారాలు ఇంకా లభ్యం కాలేదన్నారు.
పారదర్శక పాలన కోసం సీసీ కెమెరాల ఏర్పాటు
Published Sun, Jan 11 2015 1:50 AM | Last Updated on Sat, Sep 2 2017 7:30 PM
Advertisement
Advertisement