కీటకాలు, పక్షుల ఆకారంలో బయో ఇన్‌స్పైర్డ్ డ్రోన్‌లు.. హైదరాబాద్ ఐఐటీలో కొనసాగుతున్న పరిశోధనలు
నిఘా, భద్రత అవసరాలకు ఉపయోగమంటున్న పరిశోధకులు
సాక్షి ప్రతినిధి,సంగారెడ్డి: తూనీగలా తిరుగుతూ నిఘా పెడు తుంది.. సీతాకోక చిలుకలా కదులుతూ పరిస్థితులను కళ్లకు కడుతుంది... గద్దలా ఎగు రుతూ ఎప్పటికప్పుడు ఫొటో లు, వీడియోలు పంపుతుంది.. ఐఐటీ హైద రాబాద్ పరిశోధకులు అభివృద్ధి చేస్తున్న బయో ఇన్‌స్పైర్డ్ ఫ్లాపర్ డ్రోన్ సాంకేతికత ప్రత్యేకత ఇది. పక్షులు, కీటకాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రత్యేక తరహా డ్రోన్లపై ఐఐటీహెచ్ పరిశోధనలు చేస్తోంది.
ఆయా ప్రాంతాల్లోని భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా వాటిని డిజైన్ చేస్తోంది. అటవీ ప్రాంతాలు, కొండలు, చెరువులు, సరస్సులు, దూర ప్రాంతాల్లో సైతం తిరిగేందుకు అనువుగా వాటిని రూపొందిస్తోంది. డ్రోన్లు ఎగిరినట్లు బయో ఇన్‌స్పైర్డ్ డ్రోన్లు దేశ సరిహద్దుల్లో సైతం నిఘా పెట్టడానికి ఉపయోగించుకోవచ్చని, భద్రతా అవసరాలకు వాడుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
డ్రోన్లకు కాస్త భిన్నంగా..
డ్రోన్ టెక్నాలజీకి కాస్త భిన్నంగా ఈ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు. డ్రోన్లు బ్యాటరీల సాయంతో పనిచేస్తుంటాయి. అయితే ఒకసారి వాటి చార్జింగ్ అయిపోతే తిరిగి చార్జ్ చేస్తేనే తిరిగి పనిచేస్తాయి. కానీ తూనీగ మాదిరిగా ఉండే బయో ఇన్‌స్పైర్డ్ డ్రోన్‌లో రెక్కలు కొట్టుకోవడం ద్వారా వచ్చే శక్తితో దాటంతట అదే చార్జ్ అయ్యేలా డిజైన్ చేస్తున్నారు.
అలాగే గద్ద ఆకారంలో తయారు చేసిన ఫ్లాపర్ దూరప్రాంతాలకు సైతం ఎగురుకుంటూ వెళ్లి ఆధునిక కెమెరాల ద్వారా అక్కడి పరిసరాలను వీడియో రికార్డు చేస్తుంది. కంట్రోల్ యూనిట్ ద్వారా దీని గమ్యాన్ని మార్చొచ్చు. తక్కువ ఎత్తు నుంచి ఈ డ్రోన్లను ఎగరేయడం వీలవుతుందని.. దీనివల్ల ఇతర దేశాల రాడార్ల నిఘాకు అవి చిక్కవని పరిశోధకులు చెబుతున్నారు.
నాలుగేళ్లుగా పరిశోధనలు..
దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీ హెచ్‌లో టీఐహెచ్‌ఏఎన్ (టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ అటానమస్ నేవిగేషన్) అనే పరిశోధన విభాగం ఉంది. ఇందులో యూఏవీ (అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్), ఆర్‌ఓవీ (రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్స్) రకాల అటానమస్ వాహనాలను అభివృద్ధి చేస్తున్నారు.
గత నాలుగేళ్లుగా వాటిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఏరోస్పేస్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ వంటి బ్రాంచీలకు చెందిన ఎంటెక్, పీహెచ్‌డీ విద్యార్థులు ఈ పరిశోధన విభాగంలో పనిచేస్తున్నారు.
నిఘా, భద్రత అవసరాలకు ఉపయోగపడేలా
బయో ఇన్‌స్పైర్డ్ డ్రోన్‌లపై పరిశోధనలు కొనసాగు తున్నాయి. ఇవి ప్రొటోటైప్ (నమూన దశ) స్టేజీలో ఉన్నాయి. కొన్ని డ్రోన్‌ల పరిశోధనలు చివరి దశకు చేసుకుంటున్నాయి. పక్షులు, తూనీగ వంటి వాటిని స్ఫూర్తిగా తీసుకొని బయో ఇన్‌స్పైర్డ్ డ్రోన్లను తయారు చేస్తున్నాం. దేశ నిఘా, భద్రతా అవసరాలకు ఎంతగానో ఉపయోగపడేలా వాటిని అభివృద్ధి చేస్తున్నాం.
– సంతోష్‌రెడ్డి, టెక్నికల్ ఆఫీసర్, టీఐహెచ్‌ఏఎన్
Comments
Please login to add a commentAdd a comment