నేటి నుంచి 9 జిల్లాల్లో సీరో సర్వే | Serosurveillance In Nine Districts From 26th August | Sakshi
Sakshi News home page

నేటి నుంచి 9 జిల్లాల్లో సీరో సర్వే

Published Wed, Aug 26 2020 4:19 AM | Last Updated on Wed, Aug 26 2020 4:19 AM

Serosurveillance In Nine Districts From 26th August - Sakshi

సాక్షి,అమరావతి: కోవిడ్‌–19 వైరస్‌ ప్రభావాన్ని అంచనా వేసేందుకు రాష్ట్రంలో నిర్వహిస్తోన్న సీరో సర్వైలెన్స్‌ సర్వే నేటి నుంచి మిగతా 9 జిల్లాల్లో మొదలుకానుంది. ఇప్పటికే తూర్పుగోదావరి, నెల్లూరు, అనంతపురం, కృష్ణా జిల్లాల్లో ఈ సర్వైలెన్స్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే కాగా, మిగిలిన ఒక్కో జిల్లాలో 5 వేల నమూనాలు సేకరించి సర్వే నిర్వహించనున్నారు. వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు ప్రణాళిక రచించారు. సర్వే ఇలా చేయనున్నారు.. 

► ప్రతి జిల్లాలో సేకరించిన 5 వేల నమూనాల్లో వెయ్యింటిని కేవలం హైరిస్కు ప్రాంతాల్లో చేస్తారు.
► మిగతా 4వేల నమూనాలు 60 శాతం కంటెయిన్మెంట్‌ జోన్‌లోనూ, 40 శాతం నాన్‌ కంటెయిన్మెంట్‌ జోన్‌లలోనూ నిర్వహిస్తారు.
► ఈ జోన్లలో 30 శాతం అర్బన్‌ ప్రాంతాల్లోనూ, 60 శాతం రూరల్‌లో నిర్వహిస్తారు
► అర్బన్‌లో 3 వార్డులు, రూరల్‌లో 16 గ్రామాల్లో ఈ నమూనాలు సేకరిస్తారు. నాన్‌ కంటెయిన్మెంట్‌ జోన్‌లో 30 శాతం అర్బన్, 70 శాతం రూరల్‌లో నిర్వహిస్తారు.
► ఇందులో అర్బన్‌లో 2 వార్డులు, రూరల్‌లో 8 గ్రామాలు ఉంటాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement