అనుమతి తీసుకున్నాకే పౌరులపై నిఘా | No Blanket Powers For Agencies To Intercept Info On Computers | Sakshi
Sakshi News home page

అనుమతి తీసుకున్నాకే పౌరులపై నిఘా

Published Mon, Dec 31 2018 5:33 AM | Last Updated on Mon, Dec 31 2018 5:33 AM

No Blanket Powers For Agencies To Intercept Info On Computers - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ కార్యదర్శి లేదా రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి నుంచి అనుమతి తీసుకున్నాకే పౌరుల కంప్యూటర్లపై నిఘా పెట్టాల్సి ఉంటుందని కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ విషయంలో ఏ విచారణ సంస్థకూ సంపూర్ణ అధికారాలు అప్పగించలేదన్నారు. 2009లో తెచ్చిన నిబంధనల మేరకే ఈ నిఘా కొనసాగుతోందనీ, వీటిలో చిన్నమార్పు కూడా చేయలేదన్నారు. పౌరుల కంప్యూటర్లలోని సమాచారంపై నిఘాతో పాటు డీక్రిప్ట్‌ చేసే అధికారాన్ని 10 ప్రభుత్వ సంస్థలకు అప్పగించడంపై వివాదం రాజుకున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement