permissions
-
నిరుద్యోగ మార్చ్ కి మద్దతు తెలిపిన కేయూ, ఓయూ, జేఏసీలు
-
విదేశీ బ్యాంక్ శాఖలకు కొంత స్వేచ్ఛ
ముంబై: భారత బ్యాంకులకు సంబంధించి విదేశీ శాఖలు, సబ్సిడరీలు.. ఇక్కడ అనుమతించని ఆర్థిక సాధనాల్లో లావాదేవీలు నిర్వహించుకునేందుకు ఆర్బీఐ అనుమతించింది. భారత మార్కెట్లో ప్రత్యేకంగా అనుమతించని సాధనాల్లో లావాదేవీలకు, గిఫ్ట్ సిటీ వంటి భారత్‌లోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్లలో వీటిని అనుమతించడానికి సంబంధించి ప్రత్యేకా కార్యాచరణ అవసరమని భావించినట్టు ఆర్బీఐ తెలిపింది. ఆర్బీఐ అనుమతించని, ఇక్కడ అందుబాటులో లేని ఆర్థిక సాధనాల్లో భారత బ్యాంకుల విదేశీ శాఖలు, సబ్సిడరీలు లావాదేవీలు చేపట్టొచ్చని తన తాజా సర్క్యులర్‌లో పేర్కొంది. అలాగే, గిఫ్ట్ సిటీ (గుజరాత్)లో బ్యాంకు శాఖలకు సైతం ఇదే వర్తిస్తుందని తెలిపింది. -
రూబీ లాడ్జి ప్రమాదం: ఇలాంటి కాంప్లెక్స్లెన్నో?
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ పరిధిలోని రూబీ లాడ్జిలో జరిగిన అగ్నిప్రమాద ఘటన.. నిర్లక్ష్యాన్ని, అలసత్వాన్ని లేవనెత్తుతోంది. ఇప్పటికే ఈ భవనం ఓనర్ రంజిత్ సింగ్ బగ్గాను నార్త్‌జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే.. రూబీ లాడ్జి బిల్డింగ్ అనుమతులపైనే ఇప్పుడు ప్రముఖ చర్చ నడుస్తోంది. తక్కువ స్పేస్‌లో అంత బిల్డింగ్ ఇరుక్కుగా కట్టడం, వాటికి అనుమతులు ఎలా దక్కాయన్న కోణంలోనూ ఘటనస్థలానికి చేరుకున్న ఉన్నతాధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ముఖ్యంగా ఫైర్ ఎన్ఓసీ(నో అబ్జక్షన్సర్టిఫికెట్)పై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. రెండు అంతస్తుల వరకే జీహెచ్ఎంసీ నుంచి ఫైర్ ఎన్ఓసీ తీసుకున్న రూబీ లాడ్జి.. మిగిలిన రెండు ఫ్లోర్లకు ఎలాంటి ఫైర్ అనుమతులు తీసుకోలేదన్నది సమాచారం. పైగా ఒకే భవనంలో.. పైన లాడ్జీ, కింద ఈ-బైక్ షోరూం, సెల్లార్లో ఈ-బైక్స్ నిర్వాహణ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందన్న కోణంలోనూ విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. లాడ్జీ సెల్లార్లో గ్యాస్ సిలిండర్లు సైతం నిల్వ చేయడం విస్మయానికి గురి చేస్తోంది. ఇక లాడ్జికి ఒకటే ఎంట్రీ, ఎగ్జిట్ మార్గం కావడంతో అప్పటికే పొగలో చిక్కుకున్న వాళ్లకు ఇబ్బందికరంగా మారిందని అధికారులు గుర్తించారు. జంట నగరాల్లో ఈ తరహా కాంప్లెక్స్‌లు వందల్లో ఉండొచ్చని వాదన బలంగా వినిపిస్తోంది. కమర్షియల్ కాంప్లెక్స్ అయినప్పటికీ అగ్ని ప్రమాద నివారణ చర్యలు లేకపోవడం ఒక ఎత్తైతే.. నిరంతరం తనిఖీలు చేయని అధికారులు పట్టించుకోలేదన్న విమర్శలు చెలరేగుతున్నాయి. భవనం పద్దెనిమిది మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉంటేనే ఫైర్ డిపార్ట్మెంట్ పరిధిలోకి వస్తుందని ఫైర్ డిజి సంజయ్ జైన్ చెప్పడం మరోవైపు జీహెచ్ఎంసీ, ఫైర్ డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయ లోపం ఉండడం.. పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. వెరసి.. నిర్లక్ష్యం కారణంగానే ఎనిమిది ప్రాణాలు బుగ్గి అయ్యాయన్నది చేదు వాస్తవం. ఇప్పటికైనా అధికారులు మేల్కొని.. ముందు ముందు అనుమతుల విషయంలో కఠినంగా ఉండాలని, ఇప్పటికే ఉన్న ఇలాంటి భవనాలపై దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు. ఆ ఇద్దరు ఫోన్లో ఉండగా.. పని నిమిత్తం వచ్చిన ఇద్దరు ఆచి మసాలా ఉద్యోగులు రూబీ ప్రమాదంలో మరణించడం బాధాకరం. కంపెనీలో ఆడిటర్ అయిన సీతారామన్, మార్కెటింగ్ ఉద్యోగి అయిన బాలాజీ.. నిన్న(సోమవారం) రూబీ లాడ్జ్ లో దిగారు. సీతారామన్ వాళ్ల బ్రదర్ తో ఫోన్లో మాట్లాడిన పది నిమిషాలకు అగ్ని ప్రమాదం జరిగింది. ఇక బాలాజీ అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో కుటుంబ సభ్యులకు కాల్ చేసి హెల్ప్, హెల్ప్ అంటూ కేకలు వేశారు. అయితే.. ఆ పొగలోనే ఆయన ఊపిరి ఆడక అపస్మారక స్థితిలోకి వెళ్ళారు. ఆందోళనతో కుటుంబ సభ్యులు రూబీ రిసెప్షన్‌కు కాల్ చేయగా.. అప్పటికే ఆయన చనియారు. ఇదీ చదవండి: రూబీ లాడ్జి.. బిడ్డ పుట్టిన ఆనందం ఆవిరి -
చంద్రన్న కానుకలే ఈ చీప్ లిక్కర్ బ్రాండ్లు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: చంద్రబాబు ఇంటి పేరు నారా బదులు సారా అని పెడితే బాగుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం మద్యం పాలసీపై అసెంబ్లీ సమావేశాల్లో స్వల్పకాలిక చర్చ సందర్భంగా.. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ప్రస్తుత ప్రభుత్వానికి రుద్దే ప్రయత్నం జరుగుతోందని సీఎం జగన్ వివరించారు. రాష్ట్రంలో 20 డిస్టిలరీలకుగానూ 14 డిస్టీలరీలకు అనుమతి ఇచ్చిన పాపం చంద్రబాబుదేనని, 2019 తర్వాత ఒక్క డిస్టిలరీకి గానీ, ఒక్క బ్రూవరీకిగాని తమ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని సీఎం జగన్ గుర్తు చేశారు. ‘‘నవరత్నాలు, అమ్మ ఒడి.. ఇవీ మా ప్రభుత్వ బ్రాండ్లు. ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ ఛాయిస్ భూంభూం బీర్, పవర్ స్టార్ 999, 999 లెజెండ్.. బ్రాండ్లన్నీ చంద్రన్న కానుకలే. ఇవన్నీ చంద్రబాబు ఆశీస్సులతో వచ్చిన బ్రాండ్లే. ప్రెసిడెంట్ మెడల్ బ్రాండ్.. చంద్రబాబు మెడల్ బ్రాండ్. గవర్నర్ ఛాయిస్ 2018, నవంబర్ 5న అనుమతి ఇచ్చింది చంద్రబాబే. ఆయన దిగిపోయే చివరి క్షణం వరకు లిక్కర్ బ్రాండ్లకు అనుమతులు ఇస్తూనే ఉన్నారు. చంద్రబాబు హయాంలోనే 254 బ్రాండ్లు వచ్చాయి. ఇవన్నీ ఆయన ట్రేడ్ మార్క్ బ్రాండ్లు. కానీ, ఈ బ్రాండ్లను మేం క్రియేట్ చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారు. స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్ అంటూ తప్పుడు లేబుల్స్‌తో ప్రచారం చేసిన ఘనత కూడా టీడీపీ నేతలదేనని సీఎం జగన్ అన్నారు. ‘‘2019 తర్వాత మా ప్రభుత్వం ఒక్క బ్రాండ్‌కు కూడా అనుమతి ఇవ్వలేదు. మేం అమ్మే బ్రాండ్లన్నీ లైసెన్స్డ్ డిస్టిలరీస్ నుంచి వచ్చినవే. మనిషి పరంగా చంద్రబాబు, పార్టీపరంగా టీడీపీ , మరో వైపు ఎల్లో మీడియా ఇవే అసలు సిసలైన చీప్ బ్రాండ్స్. ఏ షాపు నుంచి తీసుకొచ్చారో ఆధారాలు లేకుండా శాంపిల్స్ టెస్టింగ్‌కు ఇచ్చారు. ఇక్కడ శాంపిల్స్‌లో ట్యాంపరింగ్ కూడా చేసి ఉండొచ్చు కదా. వారు ఇచ్చిన లైసెన్స్డ్ డిస్టిలరీస్ నుంచే మద్యం విక్రయిస్తున్నాం. అప్పుడు అది విషంగా ఎలా మారుతుంది?’’ అని ప్రశ్నించారు సీఎం జగన్. మా ప్రభుత్వం 16 మెడికల్ కాలేజీలకు అనుమతిస్తే.. డిస్టిలరీలకు అనుమతి ఇచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని, జంగారెడ్డిగూడెం మరణాలపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, సహజ మరణాలను కల్తీ సారా మరణాలుగా చంద్రబాబు చిత్రీకరిస్తున్నారంటూ సీఎం జగన్ ఆక్షేపించారు. టీడీపీ నేతలవి క్రిమినల్ బ్రెయిన్స్ అని, వాళ్లందరినీ జూలో పెట్టడమే కరెక్ట్ అంటూ సీఎం జగన్ చమత్కరించారు. పీఎంకే డిస్టిలరీస్ యనమల వియ్యంకుడిది కాదా?, శ్రీకృష్ణ డిస్టిలరీస్ ఆదికేశవులనాయుడిది కాదా? విశాల డిస్టిలరీస్ ఎవరిది? అయ్యన పాత్రుడిది కాదా? అని సీఎం జగన్.. సభాముఖంగా నిలదీశారు. -
కరోనా ఎఫెక్ట్: పెళ్లిళ్లకు అనుమతి తప్పనిసరి
సాక్షి, ముంబై: ముందుకు నిశ్చయించుకున్న ప్రకారం పెళ్లిలు నిర్వహించుకోవాలంటే స్థానిక పోలీసుస్టేషన్ నుంచి కచ్చితంగా అనుమతి తీసుకోవాలని బీఎంసీ అదనపు కమిషనర్ సురేశ్ కాకాణీ ప్రజలకు సూచించారు. కరోనా నియంత్రణకు సంబంధించిన పోలీసులు మార్గదర్శకాలు సూచిస్తారిన ఆయన తెలిపారు. ఆ ప్రకారం పెళ్లి తంతు పూర్తిచేసుకోవాలని కాకాణీ సూచించారు. పెళ్లి పూర్తయ్యే వరకు పోలీసుల నిఘా ఉంటుందని, ఒకవేళ నియమాలు ఉల్లంఘించినట్లు వారి దృష్టికి వస్తే పెళ్లి మండపంలోనే పోలీసులు చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. కాగా, కోవిడ్ నిబంధనలు, అనుమతుల చట్రంలో ముందుగా కుదుర్చుకున్న పెళ్లిలు ఎలా నిర్వహించేదని వధూవరుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నెలాఖరులో శుభ ముహూర్తాలు.. ముంబై నగరంలో సెమీ లాక్డౌన్ అమలు చేయడంతో ఇదివరకే పెళ్లి ముహూర్తం పెట్టుకున్నవారు అయోమయంలో పడిపోయారు. ఫంక్షన్ హాళ్లు బుకింగ్, డెకొరేషన్, కేటరింగ్ సర్వీసులకు ముందుగానే ఆర్డర్లు ఇచ్చారు. పెళ్లికి ఇరువైపుల నుంచి 50 మంది బంధువులు మాత్రమే హాజరుండాలనే నియమాలున్నాయి. కానీ, రోజురోజుకు కరోనా రోగుల సంఖ్య పెరిగిపోవడంతో పగలు 144 సెక్షన్, రాత్రులందు నైట్ కర్ఫ్యూ అమలు చేయడంతో ఇబ్బందుల్లో పడిపోయారు. ఈ ఆంక్షల మధ్య పెళ్లి తంతు ఏలా పూర్తి చేయాలని వధు, వరుల తల్లిదండ్రులు అయోమయానికి గురయ్యారు. ఇదివరకు బీఎంసీ నుంచి అనుమతి తీసుకుని పెళ్లి తంతు పూర్తి చేసేశారు. కరోనా నియమాలు ఉల్లంఘిస్తే బీఎంసీ సిబ్బంది చర్యలు తీసుకునేవారు. కానీ, కరోనా వైరస్ రోజురోజుకు పెరిగిపోవడంతో స్థానిక పోలీసుల నుంచి కూడా అనుమతి తీసుకోవాలని సురేశ్ కాకాణీ నిర్ధేశించారు. పోలీసులు జారీచేసిన కరోనా నియమాలకు కట్టుబడి ఉండాలి. అందులో బంధువులు కచ్చితంగా మాస్క్ ధరించాలి. భౌతికదూరం పాటించాలి. చేతులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవాలనే నియమాలున్నాయి. వీటన్నింటిని కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు, మళ్లీ 30వ తేదీన పెళ్లిలకు శుభ ముహూర్తాలున్నాయి. దీంతో ఈ రోజుల్లో ఎక్కువ పెళ్లిలు జరిగే అవకాశాలున్నాయి. దీంతో పోలీసులు ఇక్కడ నిఘా వేస్తారు. ఏ మాత్రం నియమాలు ఉల్లంఘన జరిగిన అక్కడే జరిమానా లేదా చర్యలు తీసుకుంటారని కాకాణీ హెచ్చరించారు. చదవండి: ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోన్న సెకండ్‌వేవ్ -
భవితతో చెలగాటం.. ‘డీఈడీ’ బాగోతం
గత ప్రభుత్వం విద్యను అక్రమాల పుట్టగా మార్చేసింది. ఉపాధ్యాయ నియామకాల డీఎస్సీనే కాదు, ఉపాధ్యాయ విద్య (డీఈడీ)ని సైతం గందరగోళం చేసింది. ఉపాధ్యాయ నియామకాల డీఎస్సీని వివాదాలమయం చేసింది. ఈ క్రమంలోనే ఉపాధ్యాయ విద్యను కూడా వ్యాపారమయం చేసింది. జిల్లాలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ) కళాశాలలు డీసెట్–2018 మార్గదర్శకాలకు సంబంధం లేకుండానే ప్రవేశాలు కల్పించి ఇప్పుడు ఏకంగా 1800 మంది విద్యార్థుల భవితవ్యాన్ని ఆందోళనలోకి నెట్టారు. మొత్తం మీద ఈ సెప్టెంబర్ 28 నుంచి డీఈడీ అభ్యర్థులకు నిర్వహించనున్న పరీక్షలకు అవకాశం లేకుండా చేశారు. సాక్షి, ఒంగోలు మెట్రో: ఉపాధ్యాయ నియామకాలు డీఎస్సీ ద్వారా జరుగుతుండటంతో డీఈడీ కోర్సుకు డిమాండ్ పెరిగింది. దీంతో రాష్ట్రంలో ఏ జిల్లాలో లేనివిధంగా ప్రకాశంలో 139 ప్రవేటు డైట్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. వీటిల్లో కొన్ని కాలేజీల యాజమాన్యాలు లిక్కర్ కాంట్రాక్టర్లు కావటం గమనార్హం. డీఈడీ రెండేళ్ల టీచర్ ట్రెయినింగ్ కోర్సులో చేరాలంటే ముందుగా డీసెట్ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాలి. ఈ ఉత్తీర్ణత ద్వారా డీఈడీ కాలేజీలో ప్రవేశం కల్పిస్తారు. కానీ, గత ప్రభుత్వం డీసెట్ రాయకుండానే ప్రవేశాలు కల్పించుకోవచ్చనే అడ్డగోలు అనుమతులు ఇచ్చింది. దీంతో జిల్లాలోని పలు కాలేజీల యాజమాన్యాలు డీసెట్ రాయకుండానే డీఈడీ ప్రవేశాలను వ్యాపారమయం చేసేశాయి. ఒక్కో సీటుకు 50 వేల నుంచి లక్ష వరకూ వసూలు చేస్తూ సీట్లను విక్రయించారు. ఇలా డీసెట్ నిబంధనలు తుంగలో తొక్కి ప్రవేశాలు కల్పించిన విషయాన్ని గుర్తించిన విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు జిల్లాలోని డైట్ కళాశాలల అక్రమ ప్రవేశాల మీద నివేదిక ఇవ్వాల్సిందిగా డైట్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావును ఆదేశించారు. డీసెట్‌తో పని లేకుండానే సీట్ల భర్తీ.. జిల్లాలో మొత్తం 140 ప్రవేటు డీఈడీ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో మైనంపాడు డైట్ కళాశాల ఒక్కటే ప్రభుత్వ కళాశాల. మిగిలిన 139 కళాశాలలు ప్రవేటువే కాగా, ఉపాధ్యాయ విద్య పెద్ద ఎత్తున బిజినెస్‌గా మార్చటంలో జిల్లాలోని పలు యాజమాన్యాలు కాకలు తీరాయి. 2015లో విడుదల చేసిన జీవో నంబర్ 30 ప్రకారం డీసెట్ పరీక్ష ద్వారానే ఆయా కళాశాలల్లో ప్రవేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. డీసెట్ కన్వీనర్ కోటా ద్వారా 80 శాతం 20 శాతం మేనేజ్మెంట్ కోటా ద్వారా సీట్లు భర్తీ చేయాల్సి ఉంటుంది. కానీ, డీసెట్‌తో సంబంధం లేకుండానే ఏకంగా అన్ని సీట్లూ మేనేజ్మెంట్ కోటాలో భర్తీ చేసుకుని సొమ్ము చేసుకోవటం, ఆనక విద్యార్థులతో కేసులు వేయించి అనుమతులు తెచ్చుకోవటం పరిపాటిగా మారిపోయింది. ఈ విధంగా 2017 విద్యా సంవత్సరంలో జరిగింది కనుక 2018 విద్యా సంవత్సరంలతో కూడా డీసెట్ అర్హత లేకుండానే యాజమాన్యాలు ఇదేవిధంగా ప్రవేశాలు కల్పించారు. ఇలా ఒంగోలు, దర్శి, గిద్దలూరు, మార్కాపురం ప్రాంతాల్లోని డీఈడీ కాలేజీల్లో 200 మంది చొప్పున విద్యార్థులు ఉన్నారు. మిగిలిన కళాశాలల్లో 50 మంది వరకు ఉన్నారు. ఇలా అన్ని కాలేజీల నుంచి డీసెట్‌తో సంబంధం లేకుండా మొత్తం 1800 మంది వరకు విద్యార్థులు డీసెట్‌తో సంబంధం లేకుండా ప్రవేశాలు కల్పించారు. వీరి ద్వారా యాజమాన్యాలు కోర్టులో కేసు వేయించాయి. దీంతో విద్యాశాఖ స్పందించి విచారణకు ఆదేశించింది. వారంలోపు నివేదిక పంపిస్తాం.. నిబంధనలు పాటించకుండా ప్రవేశాలు కల్పించిన కాలేజీల వివరాలు సేకరిస్తున్నాం. ఏయే కాలేజీల్లో ఎన్నెన్ని సీట్లు భర్తీ చేశారో తెలుసుకుని సంపూర్ణ నివేదికను పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు అందజేస్తాం. – వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్, మైనంపాడు డైట్ కళాశాల -
65 ఏళ్ల వారికి షూటింగ్‌కి అనుమతి లేదు!
‘వయసనేది కేవలం ఒక నంబర్ మాత్రమే. మన మనసు యంగ్‌గా ఉంటే సిక్స్టీ ప్లస్‌లోనూ యంగ్ ఏజ్‌లో ఉండేంత హుషారుగా ఉండొచ్చు’ అంటారు. అమితాబ్ బచ్చన్‌లాంటి వారిని చూస్తే అది నిజమేనేమో అనిపిస్తుంది. 70 ప్లస్ ఏజ్‌లోనూ అమితాబ్ విరామం లేకుండా సినిమాలు, టీవీ షోలు, వాణిజ్య ప్రకటనలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. ఇప్పుడు అమితాబ్ వంటి సీనియర్ల వేగం తగ్గనుందా? అంటే.. వారు తగ్గాలనుకోవడంలేదు కానీ ప్రభుత్వ నిబంధన అలా ఉంది. విషయంలోకి వస్తే... ‘ఇక షూటింగ్‌లు చేసుకోవచ్చు’ అంటూ మహారాష్ట్ర ప్రభుత్వం సినిమా, టీవీ షూటింగులకు అనుమతి ఇచ్చింది. కొన్ని నిబంధనలను కూడా సూచించింది. సామాజిక దూరం, తక్కువమందితో షూటింగ్, శుభ్రత.. ఇలా కొన్ని రూల్స్ పాటించాలని కోరింది. ఇవన్నీ ఓకే కానీ రెండే రెండు నిబంధనల విషయంలో ఇబ్బంది ఎదురవుతుందని సినీ, టీవీ రంగాలు భావిస్తున్నాయి. ‘65 ఏళ్లు పైబడినవారిని షూటింగ్‌లకు అనుమతించకూడదు. లొకేషన్లో ఒక డాక్టర్, ఒక నర్స్ కచ్చితంగా ఉండాలి’ అనేవి ఆ రెండు నిబంధనలు. వృద్ధులకు రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి కరోనా వైరస్ త్వరగా సోకే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని వైద్యులు అంటున్నారు. బహుశా 65 ఏళ్లు పైబడిన నటీనటులు, సాంకేతిక నిపుణులు షూటింగులకు వద్దని ప్రభుత్వం అందుకే పేర్కొని ఉంటుంది. లొకేషన్లో ఎవరైనా అస్వస్థకు గురైతే వెంటనే వైద్యం చేయడానికి డాక్టర్, నర్స్ ఉంటే బాగుంటుందనే అభిప్రాయంతో ఆ నిబంధన విధించి ఉంటుంది. అయితే ఈ రెండు నిబంధనలు అమలు చేయడం సాధ్యం కాకపోవచ్చని ప్రభుత్వానికి ‘ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్’ (ఐఎఫ్‌టిడిఎ) వినతిపత్రం సమర్పించింది. అందులో ఉన్న సారాంశం ఈ విధంగా... ‘‘షూటింగ్‌కి అనుమతి ఇచ్చినందుకు మహారాష్ట్ర సినీ, టీవీ రంగాలకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణుల తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు. రెండు నిబంధనలు తప్ప మిగతావన్నీ ఆమోదనీయంగానే ఉన్నాయి. 65 ఏళ్లకు పైబడినవారిని షూటింగ్‌కి అనుమతించకూడదంటే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మన దగ్గర ఉన్న నటుల్లో అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్, నసీరుద్దిన్ షా, పరేష్ రావల్, శక్తీ కపూర్, జాకీ ష్రాఫ్, మిథున్ చక్రవర్తి వంటివారు, సుభాష్ ఘయ్, డేవిడ్ ధావన్, శ్యామ్ బెనెగల్, మహేష్ భట్, శేఖర్ కపూర్, మణిరత్నం, ప్రకాశ్ ఝా, జావేద్ అక్తర్, ప్రియదర్శన్ తదితర ఫిలిం మేకర్స్ అందరూ 65ఏళ్లు, ఆ పైన ఉన్నవారే. వీళ్లందరితో షూటింగ్ చేయకపోవడం అన్నది అసాధ్యం. ఇండస్ట్రీకి చెందిన గొప్ప నిష్ణాణుతులకు పరిమితులు విధించడంవల్ల ఇబ్బంది అవుతుంది. అలాగే కోవిడ్–19 బారినపడిన వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుండటంతో వైద్యుల కొరత ఉంది. అందుకని ప్రతి లొకేషన్‌లోనూ ఒక డాక్టర్, ఒక నర్స్‌ని నియమించడం సాధ్యం కాకపోవచ్చు. అందుకు బదులుగా ఏయే ప్రాంతాల్లో షూటింగ్స్ జరుగుతాయో అక్కడ ఒక డాక్టర్, ఒక నర్స్ అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయగలం. పరిస్థితిని అర్థం చేసుకుని ఈ రెండు నిబంధనల్లో మార్పు చేయాలని విన్నవించుకుంటున్నాం’’ అని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. మరి.. ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అయితే ఇది ఒక్క ఉత్తరాది సమస్య మాత్రమే కాదు.. అన్ని భాషల్లోనూ 60 ఏళ్లకు పైబడిన స్టార్స్ ఉన్నారు. యాక్టివ్‌గా ఉన్నవారి సంఖ్య కూడా ఎక్కువే. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఐఎఫ్‌టిడిఎ విన్నపాన్ని ప్రభుత్వం ఆమోదిస్తుందని ఊహించవచ్చు. -
సడలింపులపై అయోమయం!
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ, మున్సిపాలిటీల పరిధిలోని పరిశ్రమలకు కొన్ని షరతులతో లాక్డౌన్ నిబంధనల నుంచి మినహాయింపును ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు పరిశ్రమల శాఖతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఏప్రిల్ 28న ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రకటన వెలువడి ఐదు రోజులు కావస్తున్నా మార్గదర్శకాల్లో స్పష్టత లేకపోవడంతో పారిశ్రామికవర్గాల్లో అయోమయం నెలకొంది. పారిశ్రామిక పార్కుల్లో ఉన్న పరిశ్రమలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని మార్గదర్శకాల్లో పేర్కొంది. అయితే మున్సిపాలిటీల పరిధిలోని పరిశ్రమలు జిల్లా పరిశ్రమల కేంద్రం వద్ద అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో పారిశ్రామిక పార్కుల వెలుపల ఉన్న పరిశ్రమల యాజమాన్యాలు డీఐసీలను సంప్రదిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. పరిశ్రమలు నడుపుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ రాత పూర్వక అనుమతి ఇచ్చేది లేదని డీఐసీ అధికారులు చెప్తున్నారు. వాణిజ్య సంస్థలు తెరిస్తేనే! పరిశ్రమలు నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు అనుమతి జారీ చేసినా, మరో కోణంలో ఇబ్బందులు తప్పవని పారిశ్రామికవర్గాలు అంటున్నాయి. పరిశ్రమలు ఎక్కువ సంఖ్యలో రెడ్ జోన్ పరిధిలో ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిలాల్లోనే ఉండటంతో రవాణా, కార్మికులు, ముడిసరుకుల సమస్య తలెత్తుతుందని మేడ్చల్ జిల్లాకు చెందిన ఓ పరిశ్రమ యజమాని చెప్పారు. పారిశ్రామిక ఉత్ప త్తుల మార్కెటింగ్ అంతా హైదరాబాద్‌లోనే కేంద్రీకృతం కావడంతో, ఉత్పత్తి చేసినా అమ్ముకునే పరిసి ్థతి లేదని యాజమాన్యాలు చెబుతున్నాయి. దుకాణాలు, వాణిజ్య సంస్థలు తెరుచుకుంటేనే ముడి సరుకులు రావడం, ఫినిషింగ్ గూడ్స్ మార్కెట్‌కు వెళ్లడం సాధ్యమవుతుందని చెప్తున్నారు. వెళ్లేందుకే వలస కార్మికుల మొగ్గు లాక్డౌన్ నిబంధనలను సడలిస్తూ పరిశ్రమలను నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించినా కార్మికుల కొరత తలెత్తే అవకాశముందనే ఆందోళన కూడా యాజమాన్యాల్లో కనిపిస్తోంది. తమ సంస్థలో బిహార్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన 20 మంది కార్మికులు పనిచేస్తున్నారని, ప్రయాణానికి అనుమతిస్తే స్వస్థలాలకు వెళ్లేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారని సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడకు చెందిన ఓ పారిశ్రామికవేత్త వెల్లడించారు. కార్మికులు స్వస్థలాలకు వెళ్తే మరో రెండు మూడు నెలల పాటు తిరిగి వచ్చే అవకాశం లేదని ఆందోళన వెలిబుచ్చారు. స్పష్టత కోసం ఎదురుచూపులు పరిశ్రమలపై ప్రభుత్వ మార్గదర్శకాల్లో స్పష్టత లోపించింది. ఈ నేపథ్యంలో ఈ నెల ఐదో తేదీన సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశం తర్వాతే అన్ని అంశాలపై స్పష్టత వస్తుందని అధికారులు చెప్తున్నారు. పరిశ్రమలతో పాటు దుకాణాలు, వాణిజ్య సంస్థలు తెరుచుకుంటేనే తిరిగి లావాదేవీలు పట్టాలెక్కుతాయని అటు అధికారులు, ఇటు పారిశ్రామికవర్గాలు చెబుతున్నాయి. దీంతో పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చిన తర్వాతే ఉత్పత్తి ప్రారంభించాలనే యోచనలో మెజారిటీ పరిశ్రమల యాజమాన్యాలు ఉన్నాయి. -
ఆ రాష్ట్రంలో పబ్‌లకు పర్మిషన్..
తిరువనంతపురం : మద్యం విధానాన్ని సరళీకరిస్తూ కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం పబ్‌ల ఏర్పాటుకు అనుమతించింది. రాష్ట్రంలో పబ్‌లు లేకపోవడం పట్ల ప్రభుత్వంపై వస్తున్న విమర్శల దృష్ట్యా గత మద్యం విధానాన్ని పునఃసమీక్షించామని చెప్పారు. రోజంతా ఎక్కువ సమయం పనిచేసి అలిసిపోయే ఐటీ ఉద్యోగులు, ఇతర ప్రొఫెషనల్స్ ఫిర్యాదు మేరకు వారి ఉల్లాసం కోసం పబ్‌లను అనుమతించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. కేరళ బెవరేజెస్ కార్పొరేషన్ నిర్వహించే రిటైల్ మద్యం దుకాణాల్లోనూ వినియోగదారులకు మెరుగైన వసతులు కల్పిస్తామని చెప్పారు. మద్యం దుకాణాల ముందు భారీ క్యూలను నివారించేందుకు రాష్ట్రంలో మరిన్ని లిక్కర్ సూపర్ మార్కెట్లు ఏర్పాటు చేసే ప్రతిపాదన పరిశీలిస్తున్నామని అన్నారు. కాగా గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ సర్కార్ కేరళలో మద్యంపై పాక్షిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఫైవ్‌స్టార్ హోటళ్లలో మాత్రమే మద్యం విక్రయాలకు అనుమతించారు. దీంతో 2014-17లో 600కు పైగా బార్లు మూతపడ్డాయి. ఆ తర్వాత వాటిని బీర్, వైన్ పార్లర్లుగా మార్చారు. 2016లో అధికారంలోకి వచ్చిన పినరయి విజయన్ ప్రభుత్వం మద్య నిషేధ విధానాన్ని సమూలంగా మార్చివేసింది. త్రీస్టార్ హోటళ్లలోనూ మద్యం విక్రయాలకు అనుమతించింది. -
అందుబాటులో పౌర సేవలు
సాక్షి, అచ్చంపేట : పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా మున్సిపల్ కార్యాలయంలో పౌరసేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కేంద్రం ద్వారా 34రకాల సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రజలు తమ సమస్యలను ఫోన్, ఈమెయిల్, నేరుగా సంప్రదించి అధికారులకు తెలిపే వెసులుబాటును కల్పించింది. ఆయా సేవలకు దరఖాస్తు చేసుకునే వారు సమర్పించాల్సిన పత్రాలకు సంబంధించిన వివరాలను గోడలపై, బోర్డులపై రాసి ఉంచారు. సిటిజన్ చార్టర్ బోర్డును ఏర్పాటు చేశారు. దరఖాస్తు విధానం ఈవోడీబీ(ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్) సేవలను ఆన్లైన్ ద్వారా ఇంటి నుంచే పొందే వీలు ఉంటుంది. ఆయా పనుల నిమిత్తం కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. దరఖాస్తుదారుడికి తన దరఖాస్తుకు సంబంధించి జరుగుతున్న పని ఎప్పటికప్పుడు మొబైల్‌కు మెసేజ్ వస్తుంది. సిటిజన్ చార్టర్ నిబంధనల ప్రకారం గడువులోగా దరఖాస్తులను పూర్తి చేయాల్సి ఉంటుంది. మున్సిపల్ పరిధిలోని ఏదైనా విభాగంలో దరఖాస్తు చేయాలనుకునే వారు ఈ– ఆఫీస్ ద్వారా ఆన్లైన్ నమోదు చేయాలి. వచ్చిన దరఖాస్తులను కమిషనర్ పరిశీలించి అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనే విషయాలను పరిశీలించిన అనంతరం అనుమతులు జారీ చేస్తారు. సేవలను వినియోగించుకోవాలి పట్టణ ప్రజలు పౌర సేవా కేంద్రం సేవలను వినియోగించుకోవాలి. గడువులోగా సర్టిఫికెట్లు పొందవచ్చు. పైరవీలకు తావే లేదు. 30కి పైగా సేవలు అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని సేవలు అందుబాటులోకి వస్తాయి. పారదర్శకత పెంచేందుకే సేవా కేంద్రం ఏర్పాటు చేశాం. – నాయిని వెంకటస్వామి, మున్సిపల్ కమిషనర్, అచ్చంపేట -
అనుమతి తీసుకున్నాకే పౌరులపై నిఘా
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ కార్యదర్శి లేదా రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి నుంచి అనుమతి తీసుకున్నాకే పౌరుల కంప్యూటర్లపై నిఘా పెట్టాల్సి ఉంటుందని కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ విషయంలో ఏ విచారణ సంస్థకూ సంపూర్ణ అధికారాలు అప్పగించలేదన్నారు. 2009లో తెచ్చిన నిబంధనల మేరకే ఈ నిఘా కొనసాగుతోందనీ, వీటిలో చిన్నమార్పు కూడా చేయలేదన్నారు. పౌరుల కంప్యూటర్లలోని సమాచారంపై నిఘాతో పాటు డీక్రిప్ట్ చేసే అధికారాన్ని 10 ప్రభుత్వ సంస్థలకు అప్పగించడంపై వివాదం రాజుకున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు. -
ప్రకంపనల వెనుక... మురళీ ‘మనోహర’మే...
సాక్షి, రాజమహేంద్రవరం: రాజకీయ, ఆర్థిక బలాన్ని బట్టి ప్రభుత్వ శాఖల్లో పనులు జరుగుతాయన్నది కాదనలేని నిజం. సామాన్య ప్రజలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయం అన్నది జగమెరిగిన సత్యం. ఇందుకు రాజమహేంద్రవరం నగరంలోని ఏవీ అప్పారావు రోడ్డులో నిర్మిస్తున్న మల్టీప్లెక్స్ ఇందుకు సాక్షీభూతంగా నిలుస్తోంది. సామాన్యులు చిన్నపాటి ఇళ్లు నిర్మించుకోవాలంటే సవాలక్ష ఆంక్షలు, ప్లాన్లు, పలు ప్రభుత్వ విభాగాల నుంచి ఎన్వోసీ (అభ్యంతరలేమీ పత్రం)లు.. ఇలా సవాలక్ష ఆంక్షలు, ఆపసోపాలు పడాల్సి ఉంటుంది. అలాంటిది రాజమహేంద్రవరం నగరంలోనే అతి పెద్ద నిర్మాణంగా నిలవనున్న ప్రసాదిత్య మల్టీప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్‌కు ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణం జరిగిపోతోంది. అనుతులు లేకుండా, అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడకుండా ఉండేలా తెరవెనుక మంత్రాంగం నడిపిన శక్తి ఎవరన్న విషయంపై నగరంలో సర్వత్రా చర్చ జరుగుతోంది. ఎంపీ మురళీమోహన్‌కు ఈ మల్టిప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లో వాటా ఉంది కాబట్టే అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా, కనీస ప్రమాణాలు పాటించకుండా పనులు చేయగలుగుతున్నారని తెలిసింది. ఘటన జరిగిన సమయంలోనూ, అంతకుముందు జరిగిన పరిణామాలు ఈ వ్యాఖ్యలకు బలం చేకూరుస్తున్నాయి. శంకుస్థాపనకు హాజరైన ఎంపీ.. ప్రసాదిత్య సంస్థ గత ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన ఈ నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. సంస్థ చైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి. ప్రసాద్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మురళీమోహన్తోపాటు ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మేయర్ పంతం రజనీశేష సాయి, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మురళీమోహన్ నిర్మాణం, నగర అభివృద్ధిపై ప్రసంగించారు కూడా. అన్నీ తానై నడిపిన వైనం... మల్టిప్లెక్స్ నిర్మాణానికి ప్రభుత్వ విభాగాల నుంచి అవసరమైన అన్ని అనుమతులు ఎంపీ మురళీమోహన్ తీసుకున్నారని ఆరోపణలు తాజా ఘటన తర్వాత వెల్లువెత్తుతున్నాయి. 2016లో అర్బన్ జిల్లా ఎస్పీగా ఉన్న హరికృష్ణ నుంచి ఎన్వోసీ తీసుకున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఎంపీ తన అనుచరులను పంపి ఈ పనులు చేయించారని సమాచారం. మల్టీప్లెక్స్, షాపింగ్ మాల్‌కు నగరపాలక సంస్థ పూర్వపు కమిషనర్ వి.విజయరామరాజుపై ఒత్తిడి తెచ్చి మౌఖిక ఆదేశాలు జారీ చేయించారని తెలుస్తోంది. తమకు రాతపూర్వక అనుమతులు ఇంకా రాలేదని, కమిషనర్ అనుమతులు ఇచ్చారంటూ ఘటన జరిగిన సమయంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో నిర్మాణ సంస్థ అధికారులు చెప్పడం గమనార్హం. గుడా పరిధిలో మొదటిసారిగా భారీ స్థాయిలో నిర్మాణం జరుగుతున్నా అధికారులు కానీ, నగరపాలక సంస్థ యంత్రాంగం కానీ ఆ వైపు వెళ్లకుండా చేయడం వెనుక ప్రజాప్రతినిధులు ఒత్తిడి ఉందనడంలో సదేహం లేదని ప్రజాప్రతినిధులు, అధికారులు స్పష్టం చేస్తున్నారు. నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఇంటికి వెళ్లే దారిలోనే కనీస ప్రమాణాలు పాటించకుండా అంచుల వరకు తవ్వినా అధికారులు దృష్టికి రాకుండా ఉండదు. పైగా నగర ఎమ్మెల్యే ఇంటికి వెళ్లే దారి వినాయక చవితి రోజున గోతుల వైపు వాలిపోయింది. మట్టి జారిపోకుండా తాత్కాలికంగా రక్షణ చర్యలు చేపట్టారు. ఘటన తర్వాత అనుక్షణం అప్రమత్తం.. ఘటన జరిగిన తర్వాత ఎంపీ మురళీమోహన్ అనుక్షణం అప్రమత్తంగా ఉన్నారని తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో హుటాహుటిన ఎంపీ అనుచరులు, కార్యాలయ సిబ్బంది ఆయన కారులోనే వచ్చారు. ఎప్పటికప్పుడు సమాచారం చేరవేశారు. రాత్రి 8 గంటల వరకు నగరంలో ఉన్న ఎంపీ మురళీమోహన్ అప్పటికప్పుడు హైదరాబాద్ వెళ్లిపోయారని సమాచారం. ఘటనా స్థలానికి వచ్చిన సబ్ కలెక్టర్, కమిషనర్, డీఎస్పీ, నగరపాలక సంస్థ అధికారులతో నేరుగా మాట్లాడుతూ ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకున్నారు. తర్వాత ఏమి చేయాలన్నదానిపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎంపీ అనుచరుల హల్చల్.. శనివారం రాత్రి ఘటన జరిగిన సమయంలో అక్కడకు వచ్చిన ఎంపీ అనుచరులు హల్చల్ చేశారు. ఫోటోలు తీస్తున్న మీడియా ప్రతినిధులను అడ్డుకున్నారు. లోపలకి వెళ్లేందుకు అనుమతిలేదంటూ హడావుడి చేశారు. అధికారులతో మాట్లాడుతూ అంతా తామై నడిపారు. రాత్రి 10 గంటల సమయంలో ఘటనా స్థలానికి వచ్చిన స్థానిక టీడీపీ కార్పొరేటర్ కోసూరి చండీప్రియపై కూడా జులుం ప్రదర్శించారు. తూతూ మంత్రంగా చర్యలు... అనధికారికంగా గోతులు తీసి, చుట్టుపక్కల ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణాలకు నష్టం కలిగించినా కూడా సదరు నిర్మాణదారులపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిర్మాణం ఎందుకు నిలిపివేయకూడదో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు మాత్రం జారీ చేశారు. రాజకీయ అండలేని ఓ సామాన్యుడైతే పరిస్థితి మరోలా ఉండేదని నగర ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. -
పైసా వసూల్ !
సాక్షి, అమరావతిబ్యూరో : వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా తాత్కాలిక పందిళ్లు వేసుకునేందుకు పైసలిస్తేనే అనుమతులు అన్న ధోరణిలో జిల్లాలో అడ్డగోలు దందాకు ప్రభుత్వ శాఖలు తెరదీశాయి. విజయవాడ నగరంతో పాటు కృష్ణా జిల్లా వ్యాప్తంగా ప్రతి ఏటా వేలాది ఉత్సవ విగ్రహాలను నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. తొమ్మిది రోజుల పాటు అత్యంత నిష్టతో జరుపుకునే వినాయక చవితి ఉత్సవాలను భక్తులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇలా ఘనంగా జరుపుకోవడమే ఇటు పోలీసులకు, అటు అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖ, పంచాయతీ/మున్సిపాలిటీ సిబ్బందికి వరంగా మారింది. అనుమతులు ఇచ్చే పేరిట ఒక్కో శాఖ ఒక్కో తీరున ప్రజల నుంచి పండుగ మామూళ్లను దండుకుంటున్న వైనం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమైంది. పంచాయతీలో ఫీజు తక్కువ..బాధుడు ఎక్కువ సాధారణంగా వినాయక ‘విగ్రహ ప్రతిష్ట పందిళ్లు’ ఏర్పాటు చేసుకోవడానికి, ఊరేగింపునకు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. పోలీసులకు దరఖాస్తు పెట్టే ముందుగా మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీ నుంచి పంచాయతీ అయితే పంచాయతీ కార్యాలయంతో పాటు అగ్నిమాపక, విద్యుత్ శాఖల నుంచి అనుమతులు తీసుకోవడం తప్పనిసరి. ఇదే అదనుగా ఆయా శాఖలు నిర్వాహకుల నుంచి ముక్కుపిండి మామూళ్లు వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పంచాయతీ నుంచి పందిళ్ల ఏర్పాటు కోసం ఎన్ఓసీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం పంచాయతీకి రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. కానీ, ఎన్ఓసీ కోసం రూ.100తో పాటు మరో రూ.500 చేతి చమురు వదిలించుకోవాల్సిన పరిస్థితి. లేదంటే కొర్రీలతో ఇబ్బందులు పెడుతున్నారు. అగ్నిమాపక శాఖ అడిగినంత ఇవ్వాల్సిందే.. పండుగకు ఎలాంటి విఘ్నాలు కలుగకుండా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అదే సందర్భంలో వినాయక విగ్రహలు ఉంచే పందిళ్లు కూడా ఎలాంటి అగ్ని ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా అగ్నిమాపక శాఖ నియమ నిబంధనలకు లోబడి ఈ పందిళ్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పందిళ్ల ఏర్పాటు సమయంలో ఈ శాఖ నుంచి కూడా అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక్కడే అగ్నిమాపక శాఖ అధికారులు అనుమతులు ఇవ్వాలంటే అడిగినంతా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. మంగళవారం విజయవాడ సెంట్రల్ జోన్ పరిధిలో ఉండే ఓ అగ్నిమాపక శాఖ కార్యాలయ సిబ్బంది దరఖాస్తుకు రూ.వెయ్యి డిమాండ్ చేయడం గమనార్హం. రూ.వెయ్యి ఇవ్వకుంటే అనుమతులు ఇచ్చేది లేదని కరాఖండిగా చెప్పడంతో చేసేదీ లేక దాదాపు 40 మందికిపైగా మామూళ్లు ఇచ్చి అనుమతి పత్రాలు తీసుకెళ్లినట్లు తెలిసింది. విద్యుత్ శాఖది అదే తీరు.. తొమ్మిది రోజులు నిర్వహించే ఈ ఉత్సవాలకు విద్యుత్ శాఖది కీలక పాత్ర. ముఖ్యంగా చాలా చోట్ల ఈ పందిళ్లు విద్యుత్ కాంతులతో శోభాయమానంగా వెలుగొందేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తారు. ఇందుకోసం ఏకంగా రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడడం లేదు. వాస్తవానికి విద్యుత్ శాఖకు ఓ వెయ్యి ఓల్టుల విద్యుత్తు కోసం అనుమతి తీసుకోవాలంటే రూ.100 చలానా, మీ సేవా సెంటర్‌కు రూ.45, వెయ్యి ఓల్టుల విద్యుత్తు వాడకానికి గానూ రూ.2,250 చెల్లించాలి. ఆ మొత్తం చెల్లించినా ఒక్కో దరఖాస్తుదారుడు పందిళ్ల ఎత్తు తదితరాలను బట్టి రూ.500 నుంచి రూ.1000 వరకు మళ్లీ అదనంగా సమర్పిస్తేనే అనుమతి ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసు మామూళ్లు సరేసరి.. పందిళ్ల వద్ద మైక్ సెట్టు, ఊరేగింపు తదితరాలకు పోలీసు శాఖ నుంచి అనుమతి పొందాలి. ఈ అనుమతుల కోసం మైక్ కోసం రోజుకు రూ.100, ఊరేగింపు రోజున రూ.250 చెల్లించాలి. మిగిలిన శాఖలతో పోలిస్తే పోలీసు శాఖ వసూలు చేస్తున్న మొత్తం చాలా చిన్నదనే చెప్పాలి. కానీ అనుమతుల మాటున ఎంతెంత మామూళ్లు వసూళ్లు చేస్తున్నారని తెలిస్తే మాత్రం ముక్కున వేలేసుకోవాల్సిందే. ప్రాంతం.. నిర్వాహకులను బట్టి ఒక్కో పందిరికి రూ.1,000 నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఊరేగింపునకు మరో రేటు. రూ. లక్షల్లో దోపిడీ.. జిల్లా వ్యాప్తంగా గత ఏడాది 2 వేలకు పైగా విగ్రహాలు ఏర్పాటు చేస్తే విజయవాడ నగరంలో 1,350 విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఈ సంఖ్య 4 వేలకు చేరుకుంటుందనే అంచనా. ఇలా ఒక్కో పందిరికి నాలుగు శాఖలు కలిపి సగటున రూ.3 వేలు మామూళ్ల రూపంలో వసూలు చేసినట్లయితే మొత్తం 4 వేల పందిళ్లకు రూ. 1.20 కోట్ల వరకు దోపిడీకి అవకాశముందని తెలుస్తోంది. అధికార పార్టీ నాయకులు సిఫార్సులు వల్ల అనుమతులన్నీ టీడీపీ వర్గీయులకు ఇవ్వడం జరుగుతుందన్న ఆరోపణలు లేకపోలేదు. ముఖ్యంగా మైలవరం, జగ్గయ్యపేట, బందరు, పెనమలూరు నియోజవర్గాల్లో టీడీపీ నాయకుల హవా నడిచినట్లు సమాచారం. ఇక్కడ కూడా భారీగా దండుకున్నట్లు తెలుస్తోంది. -
అను‘మతి’ ఉండే చేస్తున్నారా..?
చిత్తూరు అర్బన్: ధనార్జనే ధ్యేయంగా వెలుస్తున్న కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఏ మాత్రం నియమ నిబంధనలను పట్టించుకోవడంలేదు. కాలం చెల్లిన బస్సుల్లో పసి పిల్లల్ని కుక్కేస్తూ ప్రాణాల మీదకు తెస్తున్నారు. మామూళ్లు తీసుకోవడం.. ఒత్తిళ్లకు తలొగ్గడానికి అలవాటు పడ్డ రవాణాశాఖ అధికారులు అభంశుభం తెలియని పిల్లల రక్తం కళ్ల చూస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రతి ఏటా జూన్ 12వ తేదీలోపు పిల్లల్ని తీసుకెళ్లే బస్సులు, వ్యాన్లకు ఏడాది వరకు రవాణాశాఖ అధికారులు సామర్థ్యపు ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తారు. పిల్లలు విద్యాసంస్థల బస్సుల్లో కూర్చోపెట్టి తీసుకెళ్లడానికి ప్రతి వాహనానికి ఎఫ్‌సీ తప్పనిసరి. కండీషన్ లేని బస్సులతో ఏదైనా ప్రమాదం జరిగితే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. అందుకే సంవత్సరానికి ఓ సారి పాఠశాలలు, కళాశాలలకు చెందిన బస్సుల కండీషన్‌ను మోటారు వాహన తనిఖీ అధికారులు (ఎంవీఐ) పరిశీలిస్తారు. బస్సుల టైర్లు, వేగం, ఇంజిన్ సామర్థ్యం లాంటివి తనిఖీ చేసిన తరువాతే ఎఫ్‌సీ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి. జిల్లాలోని చాలా మంది ఎంవీఐలు స్కూల్ బస్సుల కండీషన్ తనిఖీ చేసే సమయంలో బస్సుకు ఓ రేటును మాట్లాడుకుని మామూళ్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరికొందరు రాజకీయ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి నిబంధనలకు విరుద్ధంగా సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ఫలితంగా జిల్లాలో 30 శాతం వరకు విద్యా సంస్థల వాహనాలు సరైన కండీషన్లో లేకనే రోడ్లపైకి వచ్చేస్తున్నాయి. ఎఫ్‌సీ కోసం వచ్చే విద్యాసంస్థల బస్సులో తప్పనిసరిగా జీపీఎస్ (గ్లోబల్ పొజిషన్ సిస్టమ్) పరికరాన్ని ఉంచాలని ఈ సారి కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. విద్యార్థుల భద్రతా ప్రమాణాల్లో భాగంగా జీపీఎస్ పరికరం తప్పనిరయ్యింది. ప్రస్తుతం 500లకు పైగా బస్సులు ఎఫ్‌సీలు లేకుండా, జీపీఎస్ పరికరాలు పెట్టుకోకుండా యథేచ్ఛగా వాహనాల్లో విద్యార్థులను ఎక్కించుకుని తిప్పుతున్నా అధికారులు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఎఫ్‌సీలు ఏవీ.. జిల్లాలో 2,235 స్కూల్ బస్సులు ఉన్నాయి. చిత్తూరు ప్రాంతీయ రవాణ శాఖ పరిధిలో 1,121 స్కూల్ బస్సులు, తిరుపతి పరిధిలో 1,104 వరకు బస్సులున్నాయి. గతేడాది ఎఫ్‌సీ పత్రాలు తీసుకున్న బస్సులకు ఈ ఏడాడి జూన్ 15వ తేదీ నాటికి గడువు ముగిసింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇవి రోడ్లపైకి రావడానికి వీల్లేదు. అలాగే 15 ఏళ్లు దాటిన స్కూల్ బస్సులు విద్యార్థులను ఎక్కించుకోవడానికి వీల్లేదని నిబంధనలు చెబుతున్నాయి. పాఠశాలల పునఃప్రారంభానికి నెల రోజుల ముందు నుంచే విద్యాసంస్థల నిర్వాహకులు వాహనాలను కండీషన్లో ఉంచుకుని, రిపేర్లు పూర్తి చేసి రవాణ శాఖ నుంచి మరో ఏడాది చెల్లుబాటుకు ఎఫ్‌సీ తీసుకోవాలి. జిల్లాలోని 200లకు పైగా బస్సులకు ఎఫ్‌సీలు లేవు. సామర్థ్యంలేని బస్సుల్లో పరిమితికి మించి పిల్లల్ని ఎక్కించుకువెళుతున్నా పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. నిబంధనలు పాటించని వాహనాలను సీజ్ చేయాల్సిన అధికారులు మౌనంగా ఉండిపోతున్నారు. అధికార పార్టీ నేతల నుంచి రవాణాశాఖ అధికారులకు ఒత్తిళ్లు వస్తుండడమే ఇందుకు కారణం. క్రిమినల్ కేసు పెడతాం మా రికార్డుల ప్రకారం 120 వరకు బస్సులకు ఎఫ్‌సీలు లేవు. ఇవి రోడ్లపైకి కూడా రావడంలేదు. మా వాళ్లు తరచూ తనిఖీలు చేస్తున్నారు. ఎఫ్‌సీలు లేకుండా బస్సుల్లో పాఠశాలల పిల్లల్ని ఎక్కిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. అంతేగాక పాఠశాలల నిర్వాహకులపైనా చర్యలు తీసుకుంటాం. – ప్రతాప్, ఉప రవాణ కమిషనర్, -
ఔషధ నగరికి మరొక్క అడుగే!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఔషధ పరిశ్ర మల స్థాపన కోసం ప్రభుత్వం చేపట్టిన ఫార్మా సిటీకి పర్యావరణ అనుమతుల జారీపై బుధవారం నిర్ణయం వెలువడే అవకాశముంది. దీనిపై కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ (ఎంఓఈఎఫ్)ల నేతృత్వంలో ని నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) ఢిల్లీలో సమావేశమవుతోంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ ఇన్చార్జి ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ నేతృత్వంలో అధికారుల బృందం ఈ సమావే శానికి హాజరై.. ఫార్మాసిటీ ప్రాజెక్టుపై ప్రజెం టేషన్ ఇవ్వనుంది. ఈ భేటీలోనే పర్యావరణ అనుమతులకు గ్రీన్‌సిగ్నల్ వస్తే.. త్వరలోనే ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. ఒకవేళ ఈఏసీ అదనపు సమాచారం కోరితే.. తదుపరి నిర్వహించే ఒకటి, రెండు సమా వేశాల్లో పర్యావరణ అనుమతులు లభించే అవకాశాలున్నాయి. ఫార్మాసిటీ ప్రాజెక్టుకు గతేడాది డిసెంబర్ 9న తొలిదశ పర్యావరణ అనుమతులుగా భావించే ‘టరమ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్)’ జారీ అయ్యాయి. 19,333.2 ఎకరాల్లో.. రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాల పరిధిలోని 19,333.2 ఎకరాల విస్తీర్ణంలో, రూ.16,784 కోట్ల అం చనా వ్యయంతో ఫార్మాసిటీని చేపట్టారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ) ఆధ్వర్యంలో... ‘నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ మాన్యుఫాక్చరింగ్ జోన్ (నిమ్జ్)’గా దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఔషధ ఆవిష్కరణలు, అభివృద్ధి, తయారీ, సరఫరా, మార్కెటింగ్‌కు అవసర మైన అన్ని సదుపాయాలను కల్పించనున్నారు. ప్రాజెక్టుకు రూ.64 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని.. 5.56 లక్షల మందికి ఉద్యోగావ కాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఏటా రూ.1.4 లక్షల కోట్ల విలువైన ఔషధాల ఉత్పత్తి, అందులో రూ.58 వేల కోట్ల విలువైన ఔషధాలను విదేశాలకు ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫార్మాసిటీకి భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభు త్వం ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయి లో ప్రచారం నిర్వహిస్తోంది. ప్రాజెక్టుకు 985 మెగావాట్ల విద్యుత్ అవసరమని అంచనా. వేగంగా భూసేకరణ ఫార్మా సిటీ ప్రాజెక్టుతో యాచారం మండలం మేడిపల్లి, కుర్మిడ్డ, నానక్‌నగర్, తాడిపర్టి, కందుకూరు మండలం మీర్ఖాన్పేట్, ముచ్చర్ల, పంజగూడ, కడ్తాల్ మండలం ముద్విన్, కార్కడల్ పహాడ్, కడ్తాల్ గ్రామాల్లో 3,747 కుటుంబాలు భూములు కోల్పోతు న్నాయి. గతేడాది అక్టోబర్ 11న రాష్ట్ర ప్రభు త్వం ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. ఇప్పటివరకు 2,020 నిర్వాసిత కుటుంబాలకు రూ.273.36 కోట్ల పరిహా రాన్ని అందజేసింది. దీంతో 6,812 ఎకరాల భూసేకరణ పూర్తయింది. మిగతా 1,727 కుటుంబాలకు పరిహారం చెల్లిం చి.. 12,233 ఎకరా లను సేకరించాల్సి ఉంది. కేంద్ర భూసేకరణ చట్టం–2013కి ప్రత్యామ్నాయం గా.. రాష్ట్ర ప్రభు త్వం తెచ్చిన భూసేకరణ, పునరా వాస చట్టం–2017 కింద ఫార్మా సిటీ ప్రాజె క్టుకు భూసేకరణ జరుగుతోంది. ఔషధ ఎగుమతులకు ఊతం దేశంలో ఉత్పత్తవుతున్న ఔషధాలు ప్రపంచ వ్యాప్తంగా 200 దేశాలకు ఎగుమతి అవుతు న్నాయి. మన ఔషధ ఉత్పత్తులకు అమెరికా అతి పెద్ద మార్కెట్. ప్రపంచవ్యాప్తంగా జరుగు తున్న జనరిక్ ఔషధాల ఎగుమతుల్లో 20 శాతం వాటా మన దేశానిదే. ఈ నేపథ్యంలో ఫార్మాసిటీతో ఔషధ ఎగుమతులు మరింతగా వృద్ధి చెందనున్నాయి. ఏటా ఫార్మాసిటీ నుంచి రూ.58 వేల కోట్ల విలువైన ఔషధాలు ఎగుమతి అవుతాయని అంచనా వేస్తున్నారు. ఔషధ మిశ్రమాలు ఉత్పత్తి ఔషధ ఉత్పత్తి పరిశ్రమలకు హైదరాబాద్ ఖ్యాతి గడించినా.. ఔషధాల తయారీలో వినియోగించే రసాయన మిశ్రమాల (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రేడి యంట్స్– ఏపీఐ)ను మాత్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటు న్నారు. ముఖ్యంగా 60–70 శాతం ఏపీఐలు చైనా నుంచే వస్తున్నాయి. ఒకవేళ ఆ దేశంతో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నా, ఇతర కారణాలతో సరఫరా ఆగినా.. ఫార్మా పరిశ్రమలకు ఇబ్బందులు తప్పవు. బీజింగ్ ఒలింపిక్స్‌కు ముందు పర్యావరణ కారణాలతో చైనా ప్రభుత్వం పెన్సిలిన్ ఉత్పత్తి ప్లాంట్లను మూసివేసింది. దాంతో ‘పెన్–జీ’ఔషధ మిశ్ర మం సరఫరా నిలిచిపోయి హైదరాబాద్‌లోని ఫార్మా పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. అయితే ఫార్మాసిటీ ఏర్పాటుతో ఇలాంటి సమస్యలకు చెక్ పడనుంది. స్థానిక పరిశ్రమలకు అవసరమైన ఏపీఐలను ఫార్మాసిటీలోనే ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం ప్రాజెక్టు ప్రణాళికల్లో చేర్చింది. ఈ రంగంలో సైతం భారీగా పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది. ఫార్మా సిటీలో ఉత్పత్తయ్యే ఔషధాలివీ ఫార్మా సిటీలో పెన్సిలిన్, స్ట్రెప్టోమైసిన్, టెట్రాసైక్లిన్స్ వంటి యాంటీ బయాటిక్ ఔషధాలు ఉత్పత్తికానున్నాయి. వివిధ రకాల సింథటిక్ డ్రగ్స్, సల్ఫర్ డ్రగ్స్, యాంటీ ట్యూబర్క్యులోసిస్, యాంటీ లెప్రోటిక్ డ్రగ్స్, అనాలజిస్టిక్స్, అనెస్థిటిక్స్, యాంటీ మలేరియా ఔషధాలు, పారాసెటమాల్, మెటాఫార్మిన్, ఇబుప్రోఫిన్, విటమిన్స్, వెజిటబుల్ ఆరిజిన్ డ్రగ్స్, వ్యాక్సిన్లతోపాటు ఆయుర్వేద ఔషధాలు కూడా ఉత్పత్తి కానున్నాయి. ఫార్మా విశ్వవిద్యాలయం కూడా.. ఫార్మాసిటీని మొత్తంగా 19,333 ఎకరాల్లో ఏర్పాటు చేస్తుండగా.. అందులో 9,535 ఎకరాల్లో పరిశ్రమల కోసం కేటాయించారు. ఇందులో 4,517 ఎకరాల్లో తీవ్ర కాలుష్య కారక (రెడ్), 2,480 ఎకరాల్లో కాలుష్య కారక (హైబ్రిడ్), 1,933 ఎకరాల్లో స్వల్ప కాలుష్య కారక (ఆరెంజ్), 605 ఎకరాల్లో కాలుష్య రహిత (గ్రీన్) పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు. ఇక ఫార్మా సిటీ ఉద్యోగుల కోసం 1,507 ఎకరాల్లో రెసిడెన్షియల్ టౌన్షిప్, 322 ఎకరాల్లో ఫార్మా విశ్వవిద్యాలయాన్ని నిర్మిస్తారు. అదే విధంగా పబ్లిక్, సెమీ పబ్లిక్ అవసరాలకు 1,111 ఎకరాలు, కార్యాలయాలకు 544 ఎకరాలు, పరిశోధనలకు 827 ఎకరాలు, గ్రీన్ బెల్ట్‌కు 3,205 ఎకరాలు, రోడ్ల నిర్మాణానికి 1,779 ఎకరాలు, లాజిస్టిక్ (రవాణా) హబ్‌కు 203 ఎకరాలు, ఆస్పత్రికి 104 ఎకరాలు, హోటల్‌కు 141 ఎకరాలను కేటాయించారు. కాలుష్య పరిశ్రమలు నగరం బయటికి.. పలు ఔషధ పరిశ్రమల నుంచి హానికర రసాయన వ్యర్థాలు విడుదలవుతుంటాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలుచోట్ల జనావాసాలకు సమీపంలో అలాంటి పరిశ్రమలు ఉన్నాయి. ఇలాంటి సుమారు 81 ఔషధ పరిశ్రమలను నగరం అవతలకు తరలించాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. ఇప్పుడా పరిశ్రమలన్నీ ఫార్మాసిటీకి తరలనున్నాయి. ఇక కేంద్ర పర్యావరణ శాఖ నిబంధనల మేరకు.. జల, వాయు, శబ్ద, భూ కాలుష్యాలను నివారించేందుకు ఫార్మాసిటీ నిర్మాణం విషయంలో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయనుంది. రసాయన వ్యర్థాలను శుద్ధి చేసేందుకు అత్యాధునిక ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. -
అభయ సీతారామ
సాక్షిప్రతినిధి, ఖమ్మం: సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో మరో ముందడుగేసింది. సాగునీటిపరంగా ఉమ్మడి జిల్లాకు వరప్రదాయనిగా భావిస్తున్న ప్రాజెక్టు విషయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చూపిన చొరవ ఫలితంగా అవసరమైన అటవీ అనుమతులకు రీజినల్ ఎంపవర్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చెన్నైలో శుక్రవారం పర్యావరణ, అటవీ అనుమతులపై రీజినల్ ఎంపవర్ కమిటీ సమావేశమైంది. సీతారామ ప్రాజెక్టు నిర్మాణం వల్ల నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందని, దీనికి పై అనుమతులు ఇవ్వాల్సిందిగా.. సీతారామ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ పూర్తి వివరాలతో కమిటీ ఎదుట పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. నిర్మాణాలు, కాల్వల తవ్వకం, పంప్‌హౌస్‌ల నిర్మాణం వంటి వివరాలను పూర్తిస్థాయిలో వివరించడంతోపాటు ప్రాజెక్టు నిర్మాణానికి మొదటి దశగా 1,531 హెక్టార్ల అటవీ భూమి అవసరమని, దీనికి ప్రత్యామ్నాయంగా కేంద్రానికి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల జిల్లాల్లో ప్రభుత్వ భూములు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. భద్రాద్రి జిల్లాలోని పాల్వంచ, మణుగూరు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, సత్తుపల్లి అటవీ భూముల పరిధిలో ప్రాజెక్టు నిర్మాణానికి అటవీ భూములు అవసరమని పేర్కొన్నారు. దీనిపై సంతృప్తి చెందిన రీజినల్ ఎంపవర్ కమిటీ ప్రాజెక్టు నిర్మాణానికి అటవీ భూములు ఇచ్చేందుకు తమకు ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసి.. అటవీ అనుమతులు ఇవ్వాలని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్(ఎంఓఈఎఫ్) వారికి సిఫార్సు చేసింది. కమిటీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో కేంద్రం నుంచి అధికారికంగా ఉత్తర్వులు రావాల్సి ఉంది. భక్తరామదాసు రెండో దశ ప్రాజెక్టు ద్వారా పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం మండలానికి ఈనెల 12న సాగునీటిని విడుదల చేసిన మంత్రులు హరీష్‌రావు, తుమ్మల నాగేశ్వరరావు ఈ సందర్భంగా జరిగిన సభలో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఒక కొలిక్కి వచ్చాయని.. ఇక తమ దృష్టి సీతారామ ప్రాజెక్టుపై సారిస్తామని, అటవీ పర్యావరణ అనుమతులు యుద్ధ ప్రాతిపదికన సాధిస్తామని ఘంటాపథంగా చెప్పారు. అనుమతుల అంశంపై సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావుతో తుమ్మల పలుమార్లు సమావేశం కావడం.. దీనిపై కేంద్రాన్ని ఒప్పించే బాధ్యతను సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావు తీసుకోవాలని తుమ్మల కోరడంతో ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ మేరకు రాష్ట్రంలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల జిల్లాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి.. వాటిని కేంద్రానికి ఇవ్వడం ద్వారా ప్రత్యామ్నాయంగా అటవీ భూముల్లో ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరింది. ప్రాజెక్టుకు సంబంధించి మొదటి దశ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. పినపాక నియోజకవర్గం.. అశ్వాపురం మండలం కుమ్మరిగూడెంలో గల దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద సీతారామ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.8వేల కోట్లు మంజూరు చేసింది. 115 కిలోమీటర్ల పరిధిలో పనులు చేపట్టేందుకు 8 ప్యాకేజీలుగా విభజించి ప్రభుత్వం టెండర్ ప్రక్రియను పూర్తి చేసింది. వీటిలో ఐదు ప్యాకేజీల్లో పనులు కొనసాగుతున్నాయి. అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు, ములకలపల్లి మండలం పూసుగూడెం, కమలాపురం మండలాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పంప్‌హౌస్‌ల నిర్మాణం.. మరో రెండు ప్యాకేజీల్లో కాల్వల తవ్వకం చేపట్టారు. కాగా.. ఉమ్మడి జిల్లా రైతులకు ఉపయోగపడే సీతారామ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు త్వరితగతిన ఇవ్వాలని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు కోరారు. వన్యప్రాణి బోర్డు అనుమతులపై దృష్టి.. సీతారామ సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ, అటవీ అనుమతులకు గ్రీన్‌సిగ్నల్ లభించగా.. ఇక కేంద్ర వన్యప్రాణి బోర్డు నుంచి అనుమతులపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. ఇందుకోసం హైదరాబాద్‌లో అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అధ్యక్షతన ఇటీవల రాష్ట్ర వన్యప్రాణి బోర్డు గవర్నర్ బాడీ సమావేశం నిర్వహించారు. ఇందులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతోపాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు రాష్ట్ర వన్యప్రాణి బోర్డు అనుమతించింది. వీటిని కేంద్ర వన్యప్రాణి మండలి అనుమతి కోసం నివేదించారు. ప్రాజెక్టు నిర్మాణానికి కిన్నెరసాని అభయారణ్యం ఎకో జోన్ నుంచి 442 హెక్టార్ల అటవీ ప్రాంతానికి వన్యప్రాణి మండలి అనుమతి తప్పనిసరిగా మారింది. దీంతో రాష్ట్రస్థాయి వన్యప్రాణి బోర్డులో అనుమతిస్తూ.. తుది అనుమతి కోసం కేంద్ర వన్యప్రాణి మండలికి ప్రతిపాదించారు. సీతారామ ప్రాజెక్టు పరిధిలో వన్యప్రాణి సంరక్షణ కోసం రూ.2.41కోట్లతో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత వన్యప్రాణులు తిరిగేందుకు 12 అండర్ పాసెస్లను ప్రతిపాదిస్తున్నారు. ఎకో బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టనున్నారు. గడ్డి పెంపకం, సాసర్పిట్లు నిర్మించి వన్యప్రాణులకు నీటి వసతి కల్పించడం వంటి చర్యలు చేపట్టనున్నారు. -
అనుమతులు లేని పరిశ్రమలు
కొత్తూరు ప్రాంతంలో కొన్ని పరిశ్రమలు సరైన అనుమతులు లేకుండానే వెలుస్తున్నాయి. ఏవైనా ప్రమాదాలు, ఇతర సంఘటనలు జరిగే వరకు ఇలాంటి పరిశ్రమలు కొనసాగుతున్నాయనే విషయం ఉన్నతాధికారులకు తెలియడం లేదు. స్థానిక అధికారుల ఉదాసీనతతోనే ఇలాంటి పరిశ్రమలు వెలుస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. అనుమతులు తీసుకోకపోవడంతో ప్రభుత్వానికి అయా పన్నుల రూపంలో రావాల్సిన లక్షల రూపాయలు కూడా రావడం లేదు. ప్రస్తుతం షాద్‌నగర్ నియోజకవర్గంలో 313 పరిశ్రమలు కొనసాగుతుండగా మరికొన్ని నిర్మాణంలో ఉన్నట్లు పరిశ్రమల శాఖ లెక్కలు తెలుపుతున్నాయి. – కొత్తూరు కొత్తూరు: హైదరాబాద్ మహానగర అభివృద్ధిలో భా గంగా నగర సమీపంలోని కాలుష్యకారక పరిశ్రమలను అక్కడి నుంచి తరలించాలని అధికారులు ఇప్పటికే నిర్వాహకులకు నోటీసులు అందించారు. దీంతో చిన్న, మధ్య తరహా పరిశ్రమల నిర్వాహకులు షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, నందిగామ, షాద్‌నగర్ ప్రాంతాల్లో వ్యవసాయ భూములు కొనుగోలు చేస్తూ పరిశ్రమలు నెలకొల్పుతున్నారు. అయితే, వ్యవసాయ భూములను కొనుగోలు తర్వాత ప్రభుత్వానికి నిర్ణీత పన్నులు చెల్లించి వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాలి. కానీ, పదెకరాలు కొనుగోలు చేస్తే కేవలం రెండు, మూడెకరాలు మాత్రమే వ్యవసాయేతర భూమిగా మార్చుకుంటున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు హెచ్ఎండీఏ, గ్రామ పంచాయతీతో పాటు అన్ని శాఖల నుంచి అనుమతి పొందాలి. ఇక్కడ మాత్రం బ్యాంకుల నుంచి రుణ సౌకర్యం పొందేందుకు వీలుగా ఉండే అనుమతులు మాత్రమే పొందుతున్నారు. పరిశ్రమల నిర్మాణాలను సంబంధించిన పత్రాలను పంచాయతీకి అందిస్తే వారు ఆ నిర్మాణాల ఆధారంగా ప్రతి ఏడాది పన్నులు వసూలు చేస్తారు. కాగా నిర్వాహకులు పూర్తిసా ్థయి నిర్మాణ పత్రాలను ఇవ్వడం లేదు. దీంతో పన్నులు తక్కువగా వసూలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కొనసాగుతోన్న పరిశ్రమల్లో తదుపరి అవసరాల కోసం కొత్తగా చేపట్టే నిర్మాణాలకు అనుమతులు తీసుకోవడంలో వ్యాపారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. తాము టీఎస్ ఐపాస్‌లో దరఖాస్తు చేసుకున్నాం.. అన్ని అనుమతులు ఉన్నాయని ప్రకటిస్తున్నప్పటికీ గేటు బయట పరిశ్రమల పేర్లను మాత్రం నమోదు చేయడం లేదు. పట్టించుకోని అధికారులు..... ప్రభుత్వ అనుమతులు లేకుండా చిన్న షెడ్డును నిర్మించిన వారిపై చర్యలు తీసుకునే సంబంధిత శాఖ అధికారులు ఏకంగా పరిశ్రమలను స్థాపించి అక్రమంగా వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. కొత్తూరు మండలంలో కొత్తగా నిర్మాణం చేపడుతున్న గోదాములు, పరిశ్రమలు, అప్పటికే కొనసాగుతున్న వాటి వివరాలు అధికారులకు తెలిసినప్పటికీ వాటిపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులకు నివేదిస్తాం... అనుమతులు లేకుండా నిర్మాణాలు చేసే పరిశ్రమలు, గోదాముల వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు నివేదిస్తాం. వారి ఆదేశాల ప్రకారం వాటిపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు అనుమతులు లేకుండా కొనసాగుతున్న పరిశ్రమలపై మాకు సమాచారం లేదు. – సాధన, ఈవోపీఆర్డీ, కొత్తూరు. -
రండిబాబూ.. రండి..!
తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే టీచర్ నియామకాలకు ఉత్తర్వులు జారీ చేసింది. దరఖాస్తులు కూడా పూర్తయ్యాయి. సంబంధిత పరీక్షలో విజయం సాధించేందుకు ఉమ్మడి జిల్లా అభ్యర్థులు కోచింగ్ సెంటర్ల వైపు పరుగులు తీస్తున్నారు. ఎలాగైనా కొలువు కొట్టాలని ఆసక్తితో ఉన్నారు. అయితే సదరు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ‘రండిబాబూ.. రండి’ అంటూ అభ్యర్థులను నిలువునా ముంచుతున్నారు. అర్హతలేని టీచర్లతో బోధిస్తూ.. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. గోదావరిఖని టౌన్ : టీఆర్టీకి కేవలం కొద్ది నెలల గడువు మాత్రమే ఉందని భావించిన నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల వైపు పరుగు తీస్తున్నారు. టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ కోసం కోచింగ్ తీసుకునే అభ్యర్థులు తస్మాత్జాగ్రత్తగా ఉండాలని పలువురు విద్యావేత్తలు సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం టీఆర్టీని ప్రకటించిన వెంటనే కొన్ని బూటకపు కోచింగ్ సెంటర్లు పుట్టుకచ్చి, అభ్యర్థుల నుంచి వేలల్లో డబ్బు గుంజడానికి అసత్యపు ప్రచారాలతో ముందుకు వస్తున్నారని తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో 40 వేల మంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 35 నుంచి 40వేల వరకు టీఆర్టీ కోసం కోర్సులు పూర్తి చేసిన నిరుద్యోగులు ఉన్నారు. గతంలో వరంగల్, హైదరాబాద్, కరీంనగర్ ప్రాంతాలలో మాత్రమే గుర్తింపు ఉన్న కోచింగ్ సెంటర్లు ఉండేవి. ప్రస్తుతం గుర్తింపు లేకున్నా ప్రతీ ప్రాంతంలో కోచింగ్ సెంటర్లు వెలుస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం సంబంధిత అధికారులు కోచింగ్ సెంటర్లపై దృష్టి సారించడం లేదు. కోచింగ్ సెంటర్లకు కావాల్సిన అర్హత ఏమిటి, వాటిని ఎలా సమసన్వయ పరుచాలనే బాధ్యతలను నిర్వహించకపోవడంతో నిరుద్యోగులు తీవ్రంగా నష్ట పోతున్నారు. వేలల్లో ఫీజులు గోదావరిఖని, మంథని, కరీంనగర్, జగిత్యాల ప్రాంతాలలో ఉన్న పలు సెంటర్లు మూడు నెలలకు రూ. 40 నుంచి 60 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారని అభ్యర్థులు అంటున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఫీజులను నియంత్రించడమే కాకుండా, సరైన కోచింగ్‌ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. సరైన సెంటర్‌ను ఎంచుకోవాలి కోచింగ్ సెంటర్లలలో బోధించే అధ్యాపకులకు అర్హత ఉందా, లేదా? అని చూసి అభ్యర్థులు కోచింగ్ సెంటర్లలో చేరాలి. అధిక డబ్బులు చెల్లించి సరైన కోచింగ్ సెంటర్‌ను ఉంచుకోవడం వలన నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. – దాదాసలాం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రచారాలు నమ్మొద్దు ప్రభుత్వం టీచర్ రిక్రూట్మెంట్ ప్రకటించిన వెంటనే చాలా కోచింగ్ సెంటర్లు సెల్ ద్వారా, ఇతర ప్రచారా సాధనాల ద్వార ప్రచారాలు నిర్వహిస్తున్నారు. వాటిలో ఏది మెరుగైంది. గతంలో వాటి చరిత్ర ఏంటి ఇలా చాలా రకాలుగా సెంటర్‌పై విషయాన్ని తెలుసుకోవాలి. లేకుంటే నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. – ఎల్ సుహాసిని, ఆర్జేడీ ప్రభుత్వం చొరవ తీసుకోవాలి కోచింగ్ సెంటర్ల విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. గుర్తింపు లేని సెంటర్లను మూసి వేయాలి. అర్హత లేని భోధకులను తొలగించాలి. అప్పుడే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. లేకుంటే డబ్బుతో పాటు సమయాన్ని, భవిష్యత్‌ను, అవకాశాన్ని చేజార్చుకుంటాం. – సుచరిత, హెచ్‌పీటీ అభ్యర్థి -
ఇష్టం వచ్చినప్పుడు అనుమతులా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇష్టం వచ్చినప్పుడు కాలేజీలు, స్కూళ్లకు అనుమతులు, గుర్తింపులు తీసుకోవడం, ఇష్టం వచ్చినంత మందిని చేర్చుకొని తర్వాత అనుమతికి దరఖాస్తు చేసుకోవడం ఇకపై కుదరదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. తాము ముందుగా ఇచ్చే నోటిఫికేషన్ ప్రకారం 2018 ఏప్రిల్ 30వ తేదీలోగా అన్ని విద్యా సంస్థలకు అనుబంధ గుర్తింపు, అనుమతుల ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. ఏప్రిల్ 20వ తేదీ తరువాత వచ్చే ఎలాంటి దరఖాస్తులను స్వీకరించేది లేదని స్పష్టం చేశారు. జూన్ 1వ తేదీ నుంచి స్కూళ్లు, కాలేజీల్లో విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు. గత 40 నెలల్లో విద్యాశాఖలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు, వచ్చే 20 నెలల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై బుధవారం సచివాలయంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో కడియం సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి చేపట్టాల్సిన కార్యక్రమాలపై డిసెంబర్ 10వ తేదీలోపు ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. వచ్చే ఏడాది నుంచి వార్షిక కేలండర్‌ను ప్రభుత్వంతోపాటు ప్రైవేట్, కార్పొరేట్, ఇతర అన్ని విద్యా సంస్థలు పాటించాలన్నారు. సెలవుల్లో పాఠశాలలు, కాలేజీలు నడపకూడదన్నారు. సెలవుల్లో పోటీ పరీక్షలకు ప్రత్యేకంగా అనుమతులు తీసుకోవాలన్నారు. అలాగే హాస్టళ్లకు అనుమతులు తీసుకోవాలన్నారు. తనిఖీలు చేపట్టి నిబంధనల ప్రకారం ఉన్న వాటికే అనుమతులు ఇస్తామన్నారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షలను ఇకపై ఆన్లైన్లో నిర్వహిస్తామన్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను ఉన్నత విద్యా మండలి ఇప్పటికే పూర్తి చేసిందన్నారు. విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలను 70 శాతం మేర పెంపునకు సీఎం కేసీఆర్ ఆమోదించాల్సి ఉందన్నారు. పోస్టుల భర్తీని యూనివర్సిటీలే చేపడతాయని, త్వరలోనే నోటిఫికేషన్లు వస్తాయని తెలిపారు. అన్ని విద్యా సంస్థల్లో కచ్చితంగా ప్రాక్టికల్స్ చేయించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త జిల్లాల ప్రాతిపదికన విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. మౌలిక వసతులకోసం రూ.2 వేలకోట్ల పనులు విద్యాశాఖ సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రూ. 2 వేల కోట్ల పనులు కొనసాగుతున్నాయని, అవన్నీ వచ్చే జూన్‌లోపు పూర్తి చేయాలని గడువు విధించామని తెలిపారు. ప్రతి విద్యా సంస్థలో ఐటీæ సెల్ పెట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. పాఠశాలలు, కాలేజీల్లో క్రీడలకు ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. ఇందుకు అనుగుణంగా పీఈటీ పోస్టులను భర్తీ చేస్తామని, ఈలోగా విద్యా వలంటీర్లను నియమిస్తామని చెప్పారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలకు సంబంధించి ఆయా కాలేజీలపై క్రిమినల్ కేసులు పెట్టామన్నారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, విద్యా, సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాగేందర్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, పాఠశాల విద్యా డైరెక్టర్ కిషన్ తదితరులు పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర అనుమతి
సాక్షి, హైదరాబాద్ : వృథాగా పోతున్న గోదావరి జలాలను ఒడిసిపట్టి.. కోటి ఎకరాల సాగు స్వప్నాన్ని సాధించే దిశగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి కేంద్ర అనుమతుల ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. ఇప్పటికే ప్రాజెక్టుకు ప్రధానమైన పర్యావరణ, అటవీ, హైడ్రాలజీ అనుమతులురాగా.. తాజాగా అంతర్రాష్ట్ర అనుమతులు (ఇంటర్ స్టేట్ క్లియరెన్స్) ఇస్తున్నట్లు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు సీడబ్ల్యూసీ డైరెక్టర్ బీపీ పాండే రాష్ట్రానికి సమాచారమిచ్చారు. దీనిపై నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. కలిసొచ్చిన ‘మహా’ఒప్పందం దాదాపు పదేళ్ల కింద అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టింది. అయితే మహారాష్ట్ర అనుమతి లేకుండానే తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించాలని నిర్ణయించి.. తదనుగుణంగా కాలువల పనులు కూడా మొదలుపెట్టింది. ఈ ప్రాజెక్టుతో మహారాష్ట్రలో కొంత భూమి ముంపునకు గురవుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అంతర్రాష్ట్ర ప్రాజెక్టులపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు. మహారాష్ట్రలో ముంపు లేకుండా ప్రాజెక్టు నిర్మించుకుంటే తమకు అభ్యంతరమేమీ లేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. దీంతోపాటు తమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత, ప్రాజెక్టులో చేపట్టే రిజర్వాయర్ల సామర్థ్యంపై కేంద్ర జల సంఘం సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును రీడిజైనింగ్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా చేపట్టింది. తమ్మిడిహెట్టితోపాటు కాళేశ్వరం సమీపంలోని మేడిగడ్డ వద్ద కూడా బ్యారేజీని నిర్మించాలని నిర్ణయించింది. ప్రతిపాదిత రిజర్వాయర్ల సామర్థ్యాన్ని భారీగా పెంచింది. ఈ మార్పులకు అనుగుణంగా మహారాష్ట్ర అంగీకారం తప్పనిసరైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్రతో చర్చలు జరిపింది. 2016 ఆగస్ట్ 23న ఈ రెండు బ్యారేజీల నిర్మాణంపై ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. ఎన్నో ప్రయోజనాలు కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలో 18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందడంతోపాటు మరో 18 లక్షల ఎకరాల స్థిరీకరణ జరుగనుండగా.. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో 45 వేల ఎకరాలకు సాగు నీరు అందనుంది. ఇక తమ్మిడిహెట్టితో రాష్ట్ర పరిధిలో రెండు లక్షల ఎకరాలకు.. మహారాష్ట్రలోని గడ్చిరోలీ, చంద్రాపూర్ జిల్లాల్లో 30 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే మహారాష్ట్ర అంతరాష్ట్ర ఒప్పందం చేసుకుంది. అనంతరం ప్రాజెక్టుకు మహారాష్ట్ర అంగీకారం తెలిపిందని, ఈ మేరకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సీడబ్ల్యూసీని కోరింది. తర్వాత వరుసగా సంప్రదింపులు జరుపుతూ.. సీడబ్ల్యూసీ లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేస్తూ వచ్చింది. మొత్తంగా ఈ అంశంపై సంతృప్తి చెందిన కేంద్ర జల సంఘం శుక్రవారం కాళేశ్వరం ప్రాజెక్టుకు అంతర్రాష్ట్ర అనుమతులు మంజూరు చేసింది. ఇక ప్రాజెక్టుకు ఇరిగేషన్ ప్లానింగ్, కాస్ట్ అప్రైజల్ వంటి రెండు కీలక అనుమతులు మిగిలి ఉన్నాయని.. అవి వచ్చేస్తే ప్రాజెక్టుకు నెలకొన్న ఆటంకాలన్నీ తొలగినట్లేనని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. మళ్లీ తెరపైకి జాతీయ హోదా..! ప్రతిష్టాత్మమైన కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపం కొలిక్కి రావడం, వివిధ కేంద్ర డైరెక్టరేట్ల నుంచి కీలక అనుమతులు లభిస్తుండడంతో ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కించుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు వేగిరం చేసే అవకాశాలున్నాయి. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా అంశంపై మరోమారు కేంద్రం తలుపు తట్టాలని నిర్ణయించినట్లుగా నీటి పారుదల వర్గాల ద్వారా తెలుస్తోంది. తెలంగాణలోని ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని ఇది వరకే కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో... కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆ హోదా ఇవ్వాలని సీఎం కేసీఆర్ పలుమార్లు ప్రధానమంత్రికి విన్నవించారు కూడా. పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్ర ఎంపీలు జాతీయ హోదా అంశాన్ని ప్రస్తావించారు. ఈ నెల చివరి వారంలో ప్రధాని రాష్ట్రానికి రానున్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా విషయమై మరోమారు నివేదించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. -
తమ్ముళ్ల మధ్య ముసలం
ఎల్.ఎన్.పేట: వచ్చే ఏడాది మే తర్వాత సాధారణ, స్థానిక సంస్థల్లో ఏవైనా ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఎన్నికల సంఘం అధికారులు కూడా ప్రకటించిన తరుణంలో.. అధికార పార్టీలో ముసలం ప్రారంభమవుతోంది. మండల స్థాయి నాయకులు ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నా ఇప్పటివరకూ అణిగిమణిగి ఉన్న కొందరు నాయకులు.. కొన్ని రోజులుగా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. గ్రామ, పంచాయతీ స్థాయిలో తామంతా కలసి పనిచేస్తే కొందరు మండల స్థాయిలో గద్దెనెక్కుతున్నారని వీరు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. మండల నాయకుల తీరును కట్టడి చేయాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ కూడా వారినే వెనకేసుకొస్తుండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వీరి తీరుతో విసిగివేశారిపోయిన కొందరు తమ్ముళ్లు పార్టీని వదిలేందుకు కూడా సిద్ధమవుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. చేతులెత్తేసిన ఎమ్మెల్యే ఈ విషయం తెలుసుకున్న మండల నాయకులు మరో మంత్రి కళా వెంకట్రావు వద్దకు వెళ్లి పనులు రద్దు కాకుండా చర్యలు తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ‘మా పైనే వ్యతిరేకంగా జిల్లా నాయకులకు చెబుతారా’ అని కక్షకట్టిన ఓ నాయకుడు పీఆర్ ఇంజినీరింగ్ అధికారులను పిలిపించుకుని మండలంలోని దబ్బపాడు, పెద్దకొల్లివలస, ముంగెన్నపాడు, ధనుకువాడ, టి.కృష్ణాపురం, కొమ్మువలస సర్పంచ్‌లు తనకు తెలియకుండా ఏ పనులు ప్రారంభించకూడదని, బిల్లులు చెల్లించకూడదని ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో పలువురు సర్పంచ్, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులతో పాటు కార్యకర్తలు మండల నాయకుల తీరుపై భగ్గుమంటున్నారు. విషయాన్ని ఎమ్మెల్యే కలమట దృష్టికి తీసుకువెళ్లినా తానేమీ చేయలేనని చేతులెత్తేయడంతో.. ‘అవసరమైతే పార్టీ మారుదాం.. లేదంటే పార్టీలో కొనసాగుతూనే వీరికి వ్యతిరేకంగా పనిచేద్దామ’ని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నీరు–చెట్టు పనుల పర్సంటేజీల స్వాహా 2016–17 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన నీరు–చెట్టు పనులకు సంబంధించి మండలంలో పలువురు సర్పంచ్‌లు, ఎంపీటిసీలు, జన్మభూమి కమిటీ సభ్యులు, ముఖ్య నాయకుల వద్ద ఇరిగేషన్ అధికారులకు, ప్రెస్‌కు ఇవ్వాలని వసూలు చేసిన సుమారు రూ.16 లక్షల పర్సంటేజీలు నాయకులే స్వాహా చేశారని ఏడాదిగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. విషయాన్ని ఎంపీ రామ్మోహన్నాయుడు, ప్రభుత్వ విప్ కూన రవి, ఎమ్మెల్యే కలమటకు తెలియజేసినా వారినే వెనకేసుకువస్తున్నారని దిగువస్థాయి నాయకులు అసంతృప్తిలో ఉన్నారు. ‘పార్టీకి, జిల్లా నాయకులకు వారే కావాలి గాని గ్రామస్థాయిలో కష్టపడే సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు అవసరం లేదా?’ అని బాహాటంగా ప్రశ్నిస్తున్నారు. ఇలా మొదలైంది.. మండల నాయకులు రెండు పంచాయతీల్లో రూ.2 కోట్లు విలువ చేసే నీరు–చెట్టు పనులు ఎంపీ రామ్మోహన్నాయుడి సిఫార్స్ లేఖతో మంజూరు చేయించుకున్నారు. విషయాన్ని తెలుసుకున్న మండల స్థాయిలో పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులతో పాటు సీనియర్ నాయకులు జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే కలమట వద్దకు వెళ్లి నియోజకవర్గంలో 140, ఎల్.ఎన్.పేట మండలంలో 19 పంచాయతీలు ఉన్నాయని.. కానీ ఆ రెండు పంచాయతీలకే రూ.2కోట్ల పనులు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. పనులు రద్దు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పి, ఇరిగేషన్ ఈఈతో మాట్లాడారు. దీంతో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు శాంతించారు. -
నిర్మాణ అనుమతులకూ సింగిల్ విండో
అన్ని శాఖల నుంచి ఒకేసారి అనుమతులు: కేటీఆర్ ► చిన్న బిల్డర్లకు ప్రత్యేక మినహాయింపులు.. ► అక్రమ నిర్మాణాలు జరిపితే జరిమానాలు తప్పవని హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: నిర్మాణ రంగ ప్రాజెక్టులకు అవసరమైన అన్ని అనుమతు లను సింగిల్ విండో విధానంలో జారీ చేసేలా కొత్త విధానాన్ని తీసుకొస్తామని పురపాలక, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. అగ్నిమాపక, మైనింగ్, పోలీసు తదితర శాఖలతో పాటు ఏవియేషన్ అథారిటీ నుంచి కూడా ఒకే చోట అందించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, మున్సిపాలిటీల్లో అమల్లోకి తెచ్చిన డెవలప్మెంట్ పర్మిషన్ సిస్టం (డీపీఎస్)తో అవినీతి గణనీయంగా తగ్గిపోయిందని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో జరిగిన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీడీఎఫ్) మూడో వార్షిక సర్వసభ్య సమావేశంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్‌లో భూ రికార్డులను క్రమబద్ధీకరించే అంశంపై సీఎం దృష్టి సారించారని చెప్పారు. ఇక బిల్డర్లు కోరిన 36 రకాల రాయితీలు, మినహాయింపులకు సీఎం కేసీఆర్ ఒకే సమావేశంలో ఆమోదం తెలిపారని.. వాటిని అమల్లోకి తెస్తూ ప్రభుత్వం ఆరు జీవోలు జారీ చేసిందని తెలిపారు. బిల్డర్లు కోరుతున్న నాలా చార్జీల మినహాయింపులు, ఇతర విజ్ఞప్తులపై త్వరలో ఓ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదే విధంగా చిన్న బిల్డర్లకు ఉండే పరిమితుల దృష్ట్యా వారికి ప్రత్యేక రాయితీలు ప్రకటిస్తామన్నారు. నాణ్యంగా కట్టండి.. సెట్‌బ్యాక్, డ్రైనేజీ, పార్కింగ్ సదుపాయాలు లేకుండానే బిల్డర్లు అడ్డగోలుగా నిర్మాణాలు చేపడుతున్నారని.. ఇప్పటివరకు అరాచకం కొనసాగిందని కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. భండారీ లేఅవుట్లో ఒకదాని తర్వాత ఒక కట్టడాన్ని కట్టారని.. మరి అంత దుర్మార్గంగా కట్టాల్సిన అవసరం లేదన్నారు. డబ్బుకు ఆశపడకుండా నాణ్యమైన కట్టడాలు నిర్మించాలని బిల్డర్లకు సూచించారు. గత 30 ఏళ్లుగా నడుస్తున్న అక్రమాలను ఇప్పటికిప్పుడు కూలగొట్టడం సాధ్యం కాదని.. అయితే ఇకపై అక్రమాలు జరగకుండా కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ శివార్లలోని ప్రగతినగర్, పుప్పాలగూడ, నార్సింగ్, బోడుప్పల్, పీర్జాదిగూడ తదితర నగర పంచాయతీలు ఏదో ఒక రోజు జీహెచ్ఎంసీలో విలీనమవుతాయని.. ఆ ప్రాంతాల్లో అడ్డగోలుగా నిర్మాణాలు చేపడుతున్న బిల్డర్లు భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. వచ్చే ఆగస్టులోగా లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు నగర శివార్లలో డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. వచ్చే ఏడాది ఆగస్టులోగా హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మిస్తామని, వాటికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను ఈ నెలా ఖరులోగా పూర్తి చేస్తామని చెప్పారు. హైదరా బాద్‌కి తాగునీటి సరఫరా కోసం శామీర్ పేట్లో తలపెట్టిన భారీ రిజర్వాయర్‌ను రెండు మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీఎఫ్ అధ్యక్షుడు సి.ప్రభాకర్‌రావు, ప్రధాన కార్యదర్శి జక్కా వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వచ్చే ఏడాది జూన్ కల్లా హెచ్‌సీఎల్ ప్రారంభం
- ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడి - నోయిడాలో హెచ్‌సీఎల్ చైర్మన్ శివ నాడార్‌తో భేటీ సాక్షి, న్యూఢిల్లీ: విజయవాడలో వచ్చే ఏడాది జూన్ కల్లా హెచ్‌సీఎల్ సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభిస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం నోయిడాలో హెచ్‌సీఎల్ చైర్మన్ శివ నాడార్‌తో సమావేశమై.. విజయవాడ, అమరావతిలో సంస్థ ఏర్పాటుకు హెచ్‌సీఎల్‌తో మార్చి 30న కుదుర్చుకున్న ఒప్పందం అమలుకు చెందిన పత్రాలను లోకేశ్ అందజేశారు. అనంతరం హెచ్‌సీఎల్ వైస్ ప్రెసిడెంట్ పవన్ ధన్వార్తో కలసి మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రూ. 500 కోట్ల పెట్టుబడులతో ఐటీ, నైపుణ్యాభివృద్ధి కేంద్రం, జీపీవో పరిశ్రమలను హెచ్‌సీఎల్ ఏర్పాటు చేయనుందని తెలిపారు. అమరావతితో తమ సంస్థ కార్యకలాపాలను ప్రారంభించడానికి ఆసక్తితో ఎదురుచూస్తున్నామని, వచ్చే ఏడాది జూన్‌లో మొదటి విడత కార్యాలయాన్ని ప్రారంభిస్తామని స్థానికులకే ఉద్యోగావకాశాలను కల్పిస్తామని పవన్ ధన్వార్ తెలిపారు. కాగా హెచ్‌సీఎల్ సంస్థ కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరవల్లిలో 17.86 ఎకరాల్లో మొదటి కేంద్రాన్ని ప్రారంభించనుందని, రెండో కేంద్రాన్ని ఐనవోలు గ్రామంలో 10 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. -
ఆ కంపెనీకి 45 రోజుల్లోనే అనుమతులు: లోకేశ్
అమరావతి: హెచ్‌సీఎల్ కంపెనీకి కావాల్సిన భూమితో సహా అన్ని అనుమతులు కేవలం 45 రోజుల్లోనే ఇచ్చామని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖమంత్రి నారా లోకేశ్ తెలిపారు. దేశ వ్యాప్తంగా ఐటీ రంగం గడ్డు పరిస్ధితి ఎదుర్కొంటుందని, ఇలాంటి సమయంలో హెచ్ సీఎల్ కంపెనీ అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. హైదరాబాద్‌లో సైబరాబాద్ నిర్మాణం ఐటీకి ఒక చరిత్రగా నిలిచిపోయిందని చెప్పారు. ఇప్పుడు అమరావతికి హెచ్‌సీఎల్ కంపెనీ రావడం ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగానికి నూతన అధ్యాయం కాబోతుందని పేర్కొన్నారు. 125 రోజుల్లోనే మొదటి భవనం నిర్మాణం పూర్తి చేస్తామని హెచ్‌సీఎల్ చెబుతోందని, 2018 జూన్ నాటికి మొదటి ప్రాజెక్ట్ పూర్తవనున్నట్టు తెలిపారు. కంపెనీ ఏర్పాటులో భాగంగా హెచ్‌సీఎల్ రూ.500 కోట్లు పెట్టుబడి పెడుతుందన్నారు. 5 వేల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రాబోతున్నాయని తెలిపారు. రానున్న ఐదు సంవత్సరాల్లో కాలేజీల్లో ఉండగానే విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునే విధంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు మంత్రి లోకేశ్ చెప్పారు. -
సొమ్ములిచ్చుకో.. చెరువు తవ్వుకో
ఆక్వా రంగంలోనూ మాఫియా జడలు విప్పుతోంది. చట్టాన్ని చెరువుల పాలే్జస్తోంది. అక్రమం ఆ గట్లపై వికటాట్టహాసం చేస్తోంది. చేలను చటుక్కున మాయం చేసేస్తోంది. రాత్రికి రాత్రి చేపల చెరువుల్ని పుట్టిస్తోంది. అమాయక రైతుల్ని నయానో భయానో దారికి తెచ్చుకుని లీజు పేరిట వందలాది ఎకరాల పంట భూముల్ని హస్తగతం చేసుకుంటున్న ఆక్వా మాఫియా ఎలాంటి అనుమతులు లేకుండానే చెరువులుగా మార్చేస్తోంది. చేలను చెరువులుగా మార్చేందుకు కనీసం దరఖాస్తు చేయకుండా దందా సాగిస్తోంది. కాసులు మరిగిన అధికారులు నిబంధనలను గాలికొదిలేస్తుండటంతో.. ఆ చెరువుల సమీపంలో వరి పండించే రైతులు నష్టాల పాలవుతున్నారు. చివరకు తమ భూములనూ ఆక్వా మాఫియాకు అప్పగించాల్సి వస్తోంది. సాక్షి ప్రతినిధి, ఏలూరు : డెల్టా ప్రాంతంలో ఆక్వా మాఫియా రాజ్యమేలుతోంది. ఉంగుటూరు, ఉండి నియోజకవర్గాల్లో చాపకింద నీరులా ప్రవహిస్తూ వరి చేలను చేపలు చెరువులుగా మార్చేస్తోంది. అక్రమాల పంజా విసిరి రైతుల్ని వలలో బిగిస్తోంది. రెండు పంటలూ పండే భూములను హస్తగతం చేసుకుని వందల ఎకరాల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే యథేచ్ఛగా చేపలు, రొయ్యల చెరువులు తవ్వేస్తున్నారు. తొలుత సారవంతమైన భూముల మధ్య నాలుగైదు ఎకరాల పొలాన్ని లీజుకు తీసుకోవడం.. అందులో చేపలు లేదా రొయ్యల చెరువు తవ్వడం చేస్తున్నారు. పొలాల మధ్యలో చెరువు తవ్వడం వల్ల అందులోంచి వచ్చే కలుషిత నీటివల్ల దాని చుట్టుపక్కల భూముల్లో పంటలకు నష్టం వాటిల్లుతోంది. దీనిని సాకుగా తీసుకుని సమీపంలోని పొలాలన్నిటినీ లీజుకు తీసుకుని 30నుంచి 50 ఎకరాలను ఒకే ప్లాటుగా చేసి చెరువులు తవ్వుతున్నారు. క్రమంగా ఇలా ఆయకట్టు పరిధిలోని మొత్తం చేలను చెరువులుగా మార్చేస్తున్నారు. ఈ మాఫియాకు అధికారులు, అధికార పార్టీ నేతలు పూర్తిస్థాయిలో అండదండలు ఇస్తుండటంతో ఆడింది ఆట.. పాడింది పాట అన్నట్టుగా మారిపోయింది. ఉదాహరణలివిగో.. నిడమర్రు మండలంలోని నిడమర్రు, నరసింహపురం రెవెన్యూ గ్రామాల్లోని ఆయకట్టులో మెరక భూములను సైతం ఆక్వా మాఫియా వదిలి పెట్టడం లేదు. ఈ ప్రాంతంలో ఇటీవల 163 ఎకరాల విస్తీర్ణంలో 6 భారీ చెరువులు తవ్వేశారు. నిడమర్రు–ఏలూరు రాష్రీ్టయ రహదారి పక్కనే గల బాడవ ఆయకట్టు పరిధిలోని పంట భూముల్లో చెరువులు తవ్వారు. ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. కనీసం చెరువు తవ్వకానికి ఆన్లైన్లో దరఖాస్తు కూడా చేయలేదు. చెరువులు వద్దకు చేరుకునేందుకు వీలుగా రహదారి సైతం అధికారుల అండతో ఆక్వా మాఫియా సొంతంగా నిర్మించుకుంది. ఈ భూముల్ని లీజుకు తీసుకున్న వారే విద్యుత్ స్తంభాలు కూడా స్వయంగా పాతుకుంటున్నారు. చెరువులకు నీటి సదుపాయం నిమిత్తం మూడు మీటర్ల వెడల్పున కాలువల సైతం నిర్మించారు. ఇంత జరుగుతున్నా గ్రామస్థాయి రెవెన్యూ అధికారి అయినా అటువైపు కన్నెత్తి చూడకపోవడం విశేషం. కనీసం దరఖాస్తు చేయలేదు... నిడమర్రు, నరసింహపురం ఆయకట్టులో 163 ఎకరాల్లో కొత్తగా చెరువులు తవ్వారు. ఆ తరువాత 65.89 ఎకరాల్లో చెరువులు తవ్వుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఈనెల 7న ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. దరఖాస్తు నంబర్లు పీఆర్ఎఫ్ 011700018229, పీఆర్ఎఫ్ 011700018228, పీఆర్ఎఫ్ 01170018226 ద్వారా ఆన్లైన్లో పరిశీలిస్తుంటే ఈ దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్టు చూపిస్తోంది. పరిశీలన పూర్తికాకుండానే చెరువులు రెడీ అయిపోయాయి. మిగిలిన సుమారు 100 ఎకరాల్లో చెరువులకు సంబంధించి కనీసం ఆన్లైన్లో దరఖాస్తు కూడా చెయ్యలేదని స్పష్టంగా కనపడుతోంది. అయినా.. అందులోనూ చెరువులు తవ్వేశారు. ముందు తవ్వకాలు.. ఆనక అనుమతులు లీజుదారులు స్థానిక అధికారులతో కుమ్మక్కై ముందుగా చెరువులు తవ్వేస్తున్నారు. అ తర్వాత తాపీగా అనుమతులకు దరఖాస్తు చేస్తున్నారు. ఇటీవల మీసేవా కేంద్రం నుంచి నకిలీ ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్న కేసు దర్యాప్తు సమయంలో మండలంలో సుమారు 1,500 ఎకరాల్లో అనధికార అనుమతులతో చెరువులు తవ్వేసినట్టు బహిర్గతమైంది. అయినా అధికారులు స్పందించకపోవడం గమనార్హం. జిల్లాలో వరి ఆయకట్టు మాయమవుతోందని రైతులు ఆందోళన చేస్తున్నా ఒక్క అధికారిపై కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు కనపడటం లేదు. ఇదో సిత్రం చేపల చెరువుల తవ్వకాలకు అనుమతి ఇచ్చే విషయంలో విచిత్రాలు బయటపడుతున్నాయి. దరఖాస్తు చేసుకున్న ఒక్క రోజులోనే.. ఎలాంటి విచారణ జరపకుండానే అనుమతి వచ్చేసింది. పైగా కలెక్టర్‌కు ప్రతినిధిగా పేర్కొంటూ తహసీల్దార్ డిజిటల్ సంతకం స్థానంలో తహసిల్దార్ సంతకంతో అనుమతి ఇచ్చేశారు. చేపల చెరువుల విషయంలో అధికారులు ఎంత ఉదారంగా వ్యవహరిస్తున్నారో ఈ ఉదంతం నిరూపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. నిడమర్రు మండలం బావాయిపాలెం గ్రామానికి చెందిన పేరిచర్ల బంగారమ్మ, మరికొందరు కలిసి ఐదెకరాల పంట భూమిలో చేపల చెరువు తవ్వేందుకు అనుమతి కోరుతూ ఈనెల 13న నిడమర్రు మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నారు. అనుమతి కోరిన సాగుభూమిని అధికారులు కనీసం పరిశీలించకుండానే ఆన్లైన్లో అనుమతులు ఇస్తూ ధ్రువీకరణ పత్రం వచ్చేసింది. ధ్రువీకరణ పత్రంపై విధిగా జిల్లా కలెక్టర్ డిజిటల్ సంతకం చేయాల్సి ఉండగా.. ఆయన స్థానంలో నిడమర్రు తహసీల్దార్ పేరు కనిపిస్తోంది. ‘ఫర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ చైర్పర్సన్, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ’గా పేర్కొంటూ తహసీల్దార్ ఎం.సుందరరాజు పేరిట ధ్రువీకరణ పత్రం జారీ అయ్యింది. అంటే తహసీల్దార్ అనుమతి ఉంటే చెరువులు తవ్వేసుకోవచ్చన్నమాట. ఏపీ మీ సేవా పోర్టల్‌లోకి వెళ్లి అక్కడ దరఖాస్తు స్థితిని తెలుసుకునేందుకు ‘చెక్ మీ సేవా సర్టిఫికెట్’ అనే కాలమ్ దరఖాస్తు సంఖ్య పీఆర్ఎఫ్011700018461 నమోదు చెయ్యగానే ఈ ఆన్లైన్ సర్టిఫికెట్ దర్శనమిస్తోంది. ఈ విధంగా ఆన్లైన్లో తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ప్రత్యక్షం అవుతున్నట్టు స్పష్టమవుతోంది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.