
'ప్రాజెక్టులకు అనుమతుల విధానాన్ని మార్చండి'
ఢిల్లీ: ప్రస్తుతం ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఉన్న అనుమతుల విధానాన్ని సమూలంగా మార్చి...వీలైనంత త్వరగా ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలని తెలంగాణ భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఆయన ఢిల్లీలో జరిగిన జలమంథన్ సదస్సులో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఓ జాతీయ ప్రాజెక్టును కేటాయించడంతో పాటు మిషన్ కాకతీయకు కేంద్రం సాయం చేయాలన్నారు.