కరోనా ఎఫెక్ట్‌: పెళ్లిళ్లకు అనుమతి తప్పనిసరి  | Marriages Need Permission In Mumbai Due To Corona | Sakshi
Sakshi News home page

పెళ్లిళ్లకు అనుమతి తప్పనిసరి.. ఆందోళనలో తల్లిదండ్రులు

Published Wed, Apr 7 2021 8:09 AM | Last Updated on Wed, Apr 7 2021 10:40 AM

Marriages Need Permission In Mumbai Due To Corona - Sakshi

సాక్షి, ముంబై: ముందుకు నిశ్చయించుకున్న ప్రకారం పెళ్లిలు నిర్వహించుకోవాలంటే స్థానిక పోలీసుస్టేషన్‌ నుంచి కచ్చితంగా అనుమతి తీసుకోవాలని బీఎంసీ అదనపు కమిషనర్‌ సురేశ్‌ కాకాణీ ప్రజలకు సూచించారు. కరోనా నియంత్రణకు సంబంధించిన పోలీసులు మార్గదర్శకాలు సూచిస్తారిన ఆయన తెలిపారు. ఆ ప్రకారం పెళ్లి తంతు పూర్తిచేసుకోవాలని కాకాణీ సూచించారు. పెళ్లి పూర్తయ్యే వరకు పోలీసుల నిఘా ఉంటుందని, ఒకవేళ నియమాలు ఉల్లంఘించినట్లు వారి దృష్టికి వస్తే పెళ్లి మండపంలోనే పోలీసులు చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. కాగా, కోవిడ్‌ నిబంధనలు, అనుమతుల చట్రంలో ముందుగా కుదుర్చుకున్న పెళ్లిలు ఎలా నిర్వహించేదని వధూవరుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.  

నెలాఖరులో శుభ ముహూర్తాలు.. 
ముంబై నగరంలో సెమీ లాక్‌డౌన్‌ అమలు చేయడంతో ఇదివరకే పెళ్లి ముహూర్తం పెట్టుకున్నవారు అయోమయంలో పడిపోయారు. ఫంక్షన్‌ హాళ్లు బుకింగ్, డెకొరేషన్, కేటరింగ్‌ సర్వీసులకు ముందుగానే ఆర్డర్లు ఇచ్చారు. పెళ్లికి ఇరువైపుల నుంచి 50 మంది బంధువులు మాత్రమే హాజరుండాలనే నియమాలున్నాయి. కానీ, రోజురోజుకు కరోనా రోగుల సంఖ్య పెరిగిపోవడంతో పగలు 144 సెక్షన్, రాత్రులందు నైట్‌ కర్ఫ్యూ అమలు చేయడంతో ఇబ్బందుల్లో పడిపోయారు. ఈ ఆంక్షల మధ్య పెళ్లి తంతు ఏలా పూర్తి చేయాలని వధు, వరుల తల్లిదండ్రులు అయోమయానికి గురయ్యారు. ఇదివరకు బీఎంసీ నుంచి అనుమతి తీసుకుని పెళ్లి తంతు పూర్తి చేసేశారు. కరోనా నియమాలు ఉల్లంఘిస్తే బీఎంసీ సిబ్బంది చర్యలు తీసుకునేవారు.

కానీ, కరోనా వైరస్‌ రోజురోజుకు పెరిగిపోవడంతో స్థానిక పోలీసుల నుంచి కూడా అనుమతి తీసుకోవాలని సురేశ్‌ కాకాణీ నిర్ధేశించారు. పోలీసులు జారీచేసిన కరోనా నియమాలకు కట్టుబడి ఉండాలి. అందులో బంధువులు కచ్చితంగా మాస్క్‌ ధరించాలి. భౌతికదూరం పాటించాలి. చేతులను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేసుకోవాలనే నియమాలున్నాయి. వీటన్నింటిని కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు, మళ్లీ 30వ తేదీన పెళ్లిలకు శుభ ముహూర్తాలున్నాయి. దీంతో ఈ రోజుల్లో ఎక్కువ పెళ్లిలు జరిగే అవకాశాలున్నాయి. దీంతో పోలీసులు ఇక్కడ నిఘా వేస్తారు. ఏ మాత్రం నియమాలు ఉల్లంఘన జరిగిన అక్కడే జరిమానా లేదా చర్యలు తీసుకుంటారని కాకాణీ హెచ్చరించారు.  

చదవండి: ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోన్న సెకండ్‌వేవ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement