{పతీ మంత్రి పేషీలో లోకేశ్ నిఘా
సీసీ కెమెరాలు .. మీడియా లైజనింగ్ ఆఫీసర్ల ఏర్పాటు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ తన మంత్రులపైనే నిఘా పెట్టింది. సాధారణంగాప్రభుత్వపరంగా ఇంటెలిజెన్స్ నిఘా ఉంటుంది. అయితే ఇప్పుడు మంత్రుల పేషీల్లో చంద్రబాబు కుమారుడు లోకేశ్ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ముద్దుగా మీడియా లైజనింగ్ ఆఫీసర్లు (ఎంఎల్‌ఓ) అని పేరు పెట్టారు. మంత్రులు ప్రతీరోజు ఎన్ని గంటలకు ఆఫీసుకు వస్తున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారు, ఎవరితో ఏమి మాట్లాడుతున్నారు, ఎన్ని గంటలకు ఆఫీసు నుంచి వెళ్లిపోతున్నారు, ఫైళ్ల క్లియరెన్స్ ఎలా ఉంటోందనే వివరాలను సేకరిస్తారు. సమాచారాన్ని ఏ రోజుకు ఆ రోజు లోకేశ్‌కు ఆన్‌లైన్ ద్వారా పంపిస్తారు. ఆన్‌లైన్‌లో మీడియా లైజనింగ్ ఆఫీసర్లు పంపిన సమాచారాన్ని, సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన అంశాలను బేరీజు వేసుకుని లోకేశ్ మంత్రుల పనితీరును అంచనా వేస్తారు. ఎవరినైనా మంత్రివర్గం నుంచి తొలగించాల్సివస్తే సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన అంశాలను వినియోగిస్తారు.
ఇందుకోసం పార్టీలో పనిచేసినవారిని, వివిధ పత్రికలు, టీవీల్లో పనిచేసి పార్టీకి ప్రధానంగా చంద్రబాబుకు విధేయులైన 30 మందిని లోకేశ్ ఎంపిక చేసి జాబితాను సీఎం ద్వారా సమాచార కమిషనర్‌కు పంపారు. ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ కూడా మరో పదిమంది పేర్లను సమాచార కమిషనర్‌కు పంపారు. మంత్రుల దగ్గర పనిచేయడానికి 20 మందిని మీడియా లైజనింగ్ ఆఫీసర్లుగా నియమిస్తూ సమాచార కమిషనర్ ఆదేశాలను జారీ చేయాల్సి ఉంది. సమాచార శాఖ కమిషనర్ దాన కిషోర్‌ను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించడంతో ఆయన సంబంధిత ఫైలు గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు.
ఏపీ మంత్రులపై టీడీపీ నిఘా
Published Tue, Oct 7 2014 2:03 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM
Advertisement
Advertisement