ఆసిఫాబాద్ చెక్‌పోస్టు వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు
సాక్షి, ఆసిఫాబాద్‌టౌన్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు జిల్లాలో నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు. ఎన్నికల కార్యకలాపాలపై దృష్టి సారిం చేందుకు ప్రత్యేక నిఘా బృందాలను నియమించారు. ఈ బృందాలు ఎప్పటికప్పుడు జిల్లాను జల్లెడ పడుతున్నాయి. అభ్యర్థుల ప్రచారం, నగ దు వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు పోటీ చేస్తున్న అభ్యర్థి రూ.28 లక్షలకు మించి ఖర్చు చేయడానికి వీలు లేదు. ఈ నేపథ్యంలో అనుని త్యం నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి ఖర్చు వివరాలపై ఈసారి ఎన్ని కల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది. విధించిన గడువుకు మించి ఖర్చు పెడితే చర్యలు తీసుకునేందుకు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు అభ్యర్థుల లెక్కలు తప్పుగా చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యేక బృందాల ద్వారా ర్యాలీలు, బహిరంగ సభలతోపాటు ఇతర కార్యక్రమాలను వీడియో ద్వారా చిత్రీకరిస్తున్నారు. ర్యాలీలు, సభల్లో ఎమ్మెల్యే ఫొటోలు వాడితే ఆ సభకు అయ్యే ఖర్చును అభ్యర్థి ఖాతాలోనే లెక్కిస్తారు. ప్రచారానికి సంబంధించిన వివరాలను నమోదు చేసేందుకు ఎన్నికల అధికారులు ఎమ్మెల్యే అభ్యర్థులకు ప్రత్యేక రిజిష్టర్‌ను అందజేస్తున్నారు. ఈ రిజిష్టర్‌లో అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చు వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
అక్రమ మార్గాలపై దృష్టి..
ఎన్నికల నేపథ్యంలో మద్యం, డబ్బు అక్రమ రవాణాను నివారించేందుకు నిఘా మరింత పెంచారు. ఇందులో భాగంగానే తెలంగాణ, మహారాష్ట్రకు సరిహద్దుగా ఉన్న వాంకిడి, సిర్పూర్(టి)తోపాటు ఆసిఫాబాద్, గోలేటి ఎక్స్‌రోడ్, కాగజ్‌నగర్‌లో ప్రత్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రతీ వాహనాన్ని ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించాకే పంపిస్తున్నారు. అయితే ఈ తనిఖీల ద్వారా కొంత వరకూ సామాన్యులు కూడా ఇబ్బందులకు గురువుతున్నారు. సామాన్య పౌరులు తమతో రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లవద్దని, అంతకు మించి తరలిస్తే వాటిని సీజ్ చేసి ఆ దాయపు పన్నుల శాఖకు అప్పగించనున్నారు. న గదుకు సంబంధించిన రశీదు, ధ్రువ పత్రాలను చూపించాల్సి ఉంటుంది. కాగా జీరో అకౌంట్స్ ఖాతాలతోపాటు, బ్యాంకుల లావాదేవీలపై కూ డా అధికారులు కన్నేశారు. అలాగే మద్యం తరలిం పుపైనా ఎక్సైజ్ అధికారులు నిఘా పెట్టారు. ఎన్ని కలకు ముందు ఏరులై పారే మద్యం అమ్మకాలు, సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఇతర ప్రాంతల నుంచి అక్రమంగా మద్యం తరలిపోకుండా ప్రత్యేక తనిఖీలపై సైతం చేపడుతున్నారు. దీనికి తోడు జిల్లాలో నూతనంగా నాలుగు స్కార్పి యో హైవే వాహనాలు రావడం, అవి నిరంతరం హైవేలపై తిరుగుతూ ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చూస్తున్నాయి.
జిల్లాలో ఆరు బృందాలు..
ఎన్నికల భద్రత అంశాలపై దృష్టి సారించిన పోలీసులు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 3, కాగజ్‌నగర్ మరో మూడు భద్రత బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నారు. దీనితోపాటు మొబైల్ పెట్రోలింగ్, బ్లూకోట్ టీంలు ఎప్పటికప్పుడు నిఘాను పెంచుతున్నాయి. దీనికి తోడు గత ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలకు పాల్పడిన వ్యక్తులతోపాటు రౌడీషీ టర్లను బైండోవర్ చేసి రూ.లక్ష సొంతపూచీకత్తుపై విడుదల చేస్తున్నారు. అనుమానిత వ్యక్తులపై కూడా నిఘా ఉంచేందుకు ప్రజలతో భాగ్యస్వామ్యం అవుతున్నారు. సమాచార వ్యవస్థను మరింత పెంచుకుంటున్నారు. ఇందులో భాగంగా వరుసగా గ్రామాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు.
ప్రతీ పోలింగ్ కేంద్రానికి జియో ట్యాగింగ్..
గతంలో నిర్వహించిన ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాలకు జియో ట్యాగింగ్ లేదు. కాని ఈసారి నూతనంగా ప్రతీ పోలింగ్‌స్టేషన్‌ను జియో ట్యాగింగ్‌తో అనుసంధానం చేస్తున్నారు. ప్రస్తుతం అత్యధునిక సాంకేతికతతో కూడిన జియో ట్యాగింగ్ సిస్టమ్‌ను పోలీస్ యంత్రాంగం వినియోగిస్తోంది. ఇది పోలింగ్ కేంద్రాలకు ఏర్పాటు చేసిన బందోబస్తు, రూట్‌మ్యాప్ తదితర వివరాలు సులువుగా తెలుసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment