లక్నో : విద్యార్థులు కాపీ కొడుతున్నారని వీటిని అరికట్టేందుకు ఓ కాలేజీ ప్రిన్సిపాల్ వినూత్నంగా ఆలోచించారు. కాలేజీ బాత్రూమ్‌లలో సీసీ కెమెరాలు సెట్ చేయించారు. ఉత్తరప్రదేశ్ అలీగఢ్‌లోని ధరం సమాజ్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ హేం ప్రకాష్ నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది. డ్రెస్సుల్లో ఏదో విధంగా స్లిప్స్ తీసుకొస్తున్నారని, వీటిని అరికట్టేందుకు ఇలా చేయాల్సి వచ్చిందన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లదని, దాంతో విద్యార్థులు ధర్నాలు చేపట్టే అవకాశం లేదన్నారు.
విద్యార్థులు చీటింగ్ చేస్తున్నారని బాయ్స్ బాత్రూముల్లో సీసీ కెమెరాలు ఫిట్ చేయించారు. అయితే కేవలం అబ్బాయిలే పరీక్షల్లో కాపీయింగ్ చేస్తారా అని కొందరు ప్రిన్సిపాల్‌ను ప్రశ్నిస్తున్నారు. అమ్మాయిల బాత్రూమ్‌లలో కెమెరాలు పెట్టాలన్నది మా ఉద్దేశం కాదని, అయితే విద్యార్థులను తనిఖీ చేసిన తర్వాతే పరీక్ష హాలులోకి అనుమతించాలని సూచించారు. కాపీయింగ్ చేస్తూ దొరికిపోయే విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కానీ అబ్బాయిలను అవమానించే ఇలాంటి పనులు మంచివి కాదంటూ మరికొందరు హితవు పలుకుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment