Aligarh
-
అలీఘర్ యూనివర్శిటీలో కాల్పుల కలకలం
యూపీలోని అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ (ఎఎంయూ)లో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈరోజు(బుధవారం) యూనివర్శిటీ క్యాంపస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు ఉద్యోగులపై కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. సెక్యూరిటీ సిబ్బంది ఇద్దరు దుండగులను పట్టుకున్నారు. కాల్పులలో గాయపడిన ఇద్దరు ఉద్యోగులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.ఎఎంయు తరచూ ఏదోఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. ఈ ఏడాది మార్చిలో హోలీ సందర్భంగా ఇక్కడ అల్లర్లు చోటుచేసుకున్నాయి. హోలీ సంబరాలు జరుపుకుంటున్న విద్యార్థులపై మరో వర్గం దాడి చేసింది. దీంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు సివిల్‌లైన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు.గత మే నెలలోనూ ఎఎంయూలోని ఎస్ఎస్ హాల్ క్యాంపస్‌లో రెండు వర్గాల విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. ఈ నేపధ్యంలో ఒక వర్గంవారు గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ ఉదంతం జరిగినప్పుడు అక్కడి సెక్యూరిటీ సిబ్బంది ఇద్దరు నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించింది. గాయపడిన బీటెక్ విద్యార్థిని వెంటనే వైద్య కళాశాలకు తరలించి చికిత్స అందించారు. -
‘ఏడడుగులు’ వారివి.. ఎనిమిదో అడుగు అందరిదీ’
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా వివిధ పార్టీలు విస్తృతంగా ప్రచారాలు సాగిస్తున్నాయి. ఇదే సమయంలో ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలంటూ ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేస్తోంది. ఇదేవిధంగా ఓటు హక్కు విలువను తెలియజేస్తూ ముద్రితమైన ఓ పెళ్లి కార్డు ఇప్పుడు వార్తల్లో నిలిచింది. యూపీలోని అలీఘర్‌లో త్వరలో ఓ ఇంట వివాహ వేడుక జరగనుంది. ఇందుకోసం వారు ముద్రించిన పెళ్లి కార్డు అతిథులకు ఓటు హక్కు విలువను తెలియజేస్తోంది. సాధారణంగా పెళ్లిలో వధూవరులు అగ్ని సాక్షిగా ఏడడుగులు వేస్తారు. అయితే ఈ కార్డులో ఎనిమిదో అడుగు ప్రస్తావన కూడా ఉంది. అలీఘర్కు చెందిన అంకిత్, సుగంధిల వివాహం ఏప్రిల్ 21 న జరగనుంది. అంకిత్ తండ్రి ఓటర్లకు ఓటుపై అవగాహన కల్పించేందుకు వినూత్న రీతిలో పెళ్లి కార్డు ముద్రింపజేశారు. అంకిత్ తండ్రి కాళీచరణ్ వృత్తిరీత్యా బేకరీ వ్యాపారి. ఆయన తన కుమారుని పెళ్లి శుభలేఖలో ‘ఓటు వేసే రోజున మీ పనులన్నీ పక్కన పెట్టి ఓటు వేయండి. దేశాన్ని ఉద్ధరించేవాడిని ఎన్నుకోండి’ అని రాశారు. పెళ్లిలో నూతన దంపతులు సాధారణంగా ఏడడుగులు వేస్తారని, అయితే భరత మాత సాక్షిగా పెళ్లి జంటతోపాటు అతిథులంతా ఎనిమిదో అడుగు వేయాలని, అది ఓటు వేసేందుకు చేసే ప్రమాణం లాంటిదని పేర్కొన్నారు. ఓటర్లను చైతన్యపరిచేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నట్లు కాళీచరణ్ పేర్కొన్నారు. అలీఘర్‌లో ఏప్రిల్ 26న లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. -
బీఎస్పీ అభ్యర్థికి గుండెపోటు
బహుజన్ సమాజ్ పార్టీ అలీగఢ్ అభ్యర్థి గుఫ్రాన్ నూర్ గుండెపోటుకు గురై ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతోంది. విషయం తెలిసిన వెంటనే బీఎస్పీ కార్యకర్తలు ఆస్పత్రికి చేరుకున్నారు. తన తండ్రి ఇప్పటికే హార్ట్ పేషెంట్ అని, ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూలో చేర్చినట్లు గుఫ్రాన్ నూర్ కుమారుడు ఆదిల్ తెలిపారు. బీఎస్పీ రెండు రోజుల క్రితం గుఫ్రాన్ నూర్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ బాబు ముంకద్ అలీ.. గుఫ్రాన్ నూర్ అభ్యర్థిత్వాన్ని వెల్లడించారు. కాగా బీఎస్పీ అలీగఢ్ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిని మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, పార్టీ మాత్రం ఇంకా దీన్ని ధ్రువీకరించలేదు. 2012లో గుఫ్రాన్ నూర్ బరౌలీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి క్వామీ ఏక్తా దళ్ టిక్కెట్‌పై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. 2023లో జరిగిన మేయర్ ఎన్నికల్లో ఎంఐఎం నుంచి పోటీ చేశారు. -
ఫాదర్ ఆఫ్ రింకుసింగ్
ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెటర్ రింకుసింగ్ తండ్రి ఖాన్చందర్సింగ్ ఇప్పటికీ ఆలిగఢ్ (ఉత్తర్‌ప్రదేశ్)లో ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. చందర్‌సింగ్ ఎల్పీజి సిలిండర్లు డెలివరీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చందర్ వృత్తినిబద్ధతకు నెటిజనులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘మీరు రెస్ట్ తీసుకోండి అని నాన్నకు చాలాసార్లు చెప్పాను. అయితే పనిని ప్రేమించే నాన్న విశ్రాంతి తీసుకోవడానికి నిరాకరించారు. పని చేస్తేనే నేను చురుగ్గా ఉంటాను అని చెబుతుంటారు’ అంటున్నాడు రింకుసింగ్. ‘కాస్త పేరు, కాస్త డబ్బు రాగానే చాలామంది గతాన్ని మరిచిపోయి గర్వంతో ప్రవర్తిస్తుంటారు. అలాంటి వారికి ఈ చిన్న వీడియో క్లిప్ కనువిప్పు కలిగిస్తుంది’ ‘కొడుకును ఇంటర్నేషనల్ క్రికెటర్‌గా తయారుచేయడానికి ఈ తండ్రి ఎంతో కష్టపడి ఉంటాడు. అప్పుడూ , ఇప్పుడూ తన సొంత కష్టాన్నే నమ్ముకున్నాడు. గ్రేట్ ఫాదర్!’...కామెంట్ సెక్షన్లో ఇలాంటివి చాలా కనిపించాయి. -
ట్రైన్లో పిడకలతో చలి మంట.. తర్వాత ఏం జరిగిందంటే..
కదులుతున్న రైలులో కొందరు వ్యక్తులు చలి మంట వేశారు. ఆ మంట వద్ద ప్రయాణికులు చలి కాచుకున్నారు. అయితే రైలు నుంచి మంటలు, పొగలు రావడాన్ని గమనించిన గేట్‌మ్యాన్ వెంటనే రైల్వే అధికారులను అలెర్ట్ చేశాడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు కారణమైన ఇద్దరిని ఆర్పీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జనవరి 3న అస్సాం నుంచి ఢిల్లీ వెళ్తున్న సంపర్క్ క్రాంతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగిలో ప్రయాణించిన ఇద్దరు వ్యక్తులు రాత్రి వేళ చలిని తట్టుకోలేక మంటను రాజేశారు. బోగిలోని ప్రయాణికులు ఆ మంట వద్ద చలి కాచుకున్నారు. రైలు బర్హాన్ స్టేషన్ సమీపంలో రైల్వే క్రాసింగ్‌లో గేట్‌మ్యాన్ రైలు కోచ్ నుండి మంట, పొగ వెలువడటం గమనించాడు. వెంటనే బర్హాన్ రైల్వే స్టేషన్‌లోని తన ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. అనంతరం ఆర్పీఎఫ్ పోలీసులు తదుపరి స్టేషన్ చమ్రౌలాలో రైలును ఆపి తనిఖీలు చేశారు. జనరల్ బోగిలో కొంతమంది వ్యక్తులుపిడకలతో చలి మంట వేసినట్లు గుర్తించారు. మంటలు భోగి మొత్తం వ్యాపించకముందే వాటిని ఆర్పివేశారు. రైలు అలీఘర్ జంక్షన్ చేరిన తరువాత జనరల్ బోగిలోని 16 మంది ప్రయాణికులను ఆర్పీఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అయితే రైలులో చలి మంట వేసింది తామేనని ఫరీదాబాద్‌కు చెందిన చందన్(23), దేవేంద్ర(25) ఒప్పుకున్నారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మిగతా 14 మంది ప్రయాణికులను హెచ్చరించి వదిలేశారు. చదవండి: టికెట్లకు రూ.4లక్షలు.. ఎయిర్ ఇండియా సర్వీసుకు షాకైన కుటుంబం -
దీపావళి కానుకేమో! బ్యాంక్ అకౌంట్లోకి రూ.4 కోట్లు
ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్కు చెందిన ఓ వ్యక్తి దీపావళి నాడు కోటీశ్వరుడు అయ్యాడు. అతనికి చెందిన రెండు వేర్వేరు బ్యాంక్ అకౌంట్లలోకి రూ.4 కోట్లకు పైగా వచ్చి డబ్బు వచ్చిపడింది. ఈ డబ్బు గుర్తుతెలియని ఖాతాల నుంచి జమవడంతో ఖంగారుపడ్డ ఆ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. అలీఘడ్‌లో మెడికల్ స్టోర్ నిర్వహించే మహమ్మద్ అస్లాం.. తన బ్యాంక్ ఖాతాలలో పెద్ద మొత్తం జమవడంపై బ్యాంక్ అధికారులను సంప్రదించడానికి ప్రయత్నించాడు. కానీ దీపావళి సెలవు కావడంతో బ్యాంక్ అధికారుల నుంచి స్పందన రాలేదు. దీంతో అతడు డయల్ 112 కి ఫోన్ చేసి పోలీసులకు విషయం తెలియజేశాడు. తనకు చెందిన ఐడీఎఫ్సీ, యూకో బ్యాంకు ఖాతాల్లోకి నవంబర్ 11, 12 తేదీల్లో పలు దఫాలుగా రూ.4.78 కోట్లు జమైనట్లు అస్లాం తెలిపాడు. అవాక్కైన తాను వెంటనే బ్యాంక్ అధికారులను సంప్రదించానని, కానీ వారు సమస్యను పరిష్కరించలేదని పేర్కొన్నాడు. దీంతో ఏం చేయాలో తెలియక డయల్ 112కి ఫోన్ చేసి విషయం చెప్పానని, తర్వాత వారి సూచనతో పోలీసులకు ఫిర్యాదు చేశానని అస్లాం వివరించాడు. దీనిపై నగర పోలీసు అధికారి మృగాంక్ శేఖర్ పాఠక్ మాట్లాడుతూ దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, బ్యాంక్ అధికారులతో మాట్లాడుతున్నామని చెప్పారు. బ్యాంకులు పూర్తిగా తెరుచుకున్న తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. -
అలీగడ్.. హరిగఢ్ ఎందుకయ్యింది? రామాయణంతో సంబంధం ఏమిటి?
ఉత్తరప్రదేశ్‌లో అలహాబాద్ తర్వాత మరో నగరమైన అలీగఢ్ పేరు మారింది. తాజాగా అలీగఢ్ మునిసిపల్ కార్పొరేషన్ అలీగఢ్ పేరును హరిగఢ్‌గా మార్చే ప్రతిపాదనకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. యూపీలోని నగరాల పేర్లను మార్చడం ఇదేమీ మొదటిసారి కాదు. అయితే దీనిలో అలీగఢ్ పేరు మార్పు వెనుక ఒక ప్రత్యకత, ఘనమైన చరిత్ర ఉంది. అలీగఢ్‌ను పూర్వకాలంలో అంటే 200 ఏళ్ల క్రితం కోయిల్ లేదా కోల్ అని పిలిచేవారు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలో ఈ ప్రాంతాన్ని పాలించిన కౌశిరివ్ పేరు కనిపిస్తుంది. అతనిని యుద్ధంలో ఓడించిన కోల్ అనే రాక్షస రాజు ఈ ప్రదేశానికి పాలకునిగా మారతాడు. అతని పేరును అనుసరించి ఈ ప్రదేశానికి కోల్ అని పేరు పెట్టారు. కాగా సయ్యద్ రాజవంశం కాలంలో కోల్ ప్రాంతం పేరు అలీగఢ్గా మారింది. అలీగఢ్ ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ నగరం. దీనిని లాక్ సిటీ అని కూడా అంటారు. మొఘలుల కాలం నుండి తాళాల తయారీకి ప్రాంతం ప్రసిద్ది చెందింది. ఈ నగరంలో సెంట్రల్ యూనివర్శిటీ ఉంది. ఇక్కడ వందలాది మంది విద్యార్థులు తమ చదువులను పూర్తి చేస్తున్నారు. భారతీయత ఉట్టిపడాలనే ఉద్దేశంతోనే అలీగఢ్‌ను హరిగఢ్‌గా మార్చారు. ఇది కూడా చదవండి: దుబాయ్‌లో దీపావళికి ఏం చేస్తారు? బుర్జ్ ఖలీఫాలో ఏం జరుగుతుంది? -
21 ఏళ్లకు యాసిడ్ బాధితురాలికి న్యాయం!
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో 2002లో 14 ఏళ్ల బాలికపై యాసిడ్ దాడి జరిగింది. అయితే ఈ ఉదంతంపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేయకపోవడంతో బాధితురాలు న్యాయం కోసం పరితపించింది. అయితే 2014లో ఆమెకు ఆగ్రాలోని ఓ కేఫ్‌లో ఉద్యోగం వచ్చింది. ఒకరోజు ఆగ్రా జోన్ ఏడీజీ రాజీవ్ కృష్ణ ఈమె పనిచేస్తున్న కేఫ్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన యాసిడ్ బాధితురాలితో మాట్లాడారు. ఆమె తన కథను ఏడీజీ రాజీవ్ కృష్ణకు వివరించింది. దీంతో ఆయన ఈ ఉదంతంపై కేసు నమోదు చేయించారు. జనవరి 2023లో ఈ కేసు అలీఘర్‌లోని ఉపర్కోట్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యింది. పోలీసులు దర్యాప్తు చేపట్టి, నిందితుడు ఆరిఫ్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. 2002లో అలీగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోరావర్ వాలీ ప్రాంతంలో ఉంటున్న బాలికపై ఆరిఫ్ అనే యువకుడు యాసిడ్ పోశాడు. యాసిడ్ దాడిలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఆమె ఆరీఫ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2014లో యాసిడ్ బాధితులకు ఆగ్రాలోని ఓ కేఫ్‌లో ఉద్యోగాలు ఇచ్చారు. పోలీసు అధికారి రాజీవ్ కృష్ణ 2022, డిసెంబరులో ఈ కేఫ్‌కు వచ్చారు. అలీఘర్ బాధితురాలి కథ విన్న ఆయన కేసు దర్యాప్తు జరిగేలా చర్యలు తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఆరిఫ్ దోషి అని తేలింది. ఈ నేపధ్యంలో పోలీసులు అతనిని జైలుకు తరలించారు. ఇది కూడా చదవండి: దేశ రాజకీయాల్లో మహరాణులెవరు? ఎక్కడ చక్రం తిప్పుతున్నారు? -
అయోధ్య రామమందిరానికి 400 కేజీల తాళం
అలీగఢ్ (యూపీ): అయోధ్యలో రామమందిరం కోసం అలీగఢ్‌కు చెందిన ఒక కళాకారుడు అరుదైన కానుకను రూపొందించాడు. చేతితో తాళాలు తయారు చేయడంలో సిద్ధహస్తుడైన సత్యప్రకాశ్ శర్మ రాముడి మందిరం కోసం ప్రత్యేకంగా 400 కేజీల తాళం తయారు చేశాడు. శ్రీరాముడికి వీరభక్తుడైన సత్యప్రకాశ్ ప్రపంచంలో చేత్తో తయారు చేసిన అతి పెద్ద తాళమని చెప్పారు. ఈ తాళం 10 అడుగుల ఎత్తు, 4.5 అడుగుల వెడల్పు, 9.5 అంగుళాల మందంతో ఉంది. తాళం చెవి నాలుగడుగుల పొడవుంది. సత్యప్రకాశ్ శర్మ కుటుంబం తరాలుగా ఈ తాళాల తయారీ వృత్తిలోనే ఉంది.ఈ ఏడాది మొదట్లో అలీగఢ్ ఎగ్జిబిషన్లో ఈ తాళాన్ని ఉంచారు. తాళం తయారు చేయడంలో తన భార్య రుక్మిణి కూడా సాయం చేశారని చెప్పారు. ఈ తాళం తయారీకి ఆయనకి రూ.2 లక్షల ఖర్చయింది. ఈ ఏడాది చివర్లో ఆయన ఈ తాళాన్ని శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కి సమరి్పస్తారు. -
పిచ్చిపిచ్చిగా కొట్టుకున్న అత్తా కోడళ్లు .. వీడియో తీసిన కొడుకు
అత్తా కోడళ్ల గొడవలనేవి తెగని పంచాయితీ.. ప్రతి ఇంట్లోనూ అత్తా కోడళ్ల మధ్య గొడవలు సర్వ సాధారణం. కొన్నిసార్లు ఈ గొడవలు పెద్దవై భార్యభర్తలు విడిపోవడం, లేదా వేరే కాపురం పెట్టే వరకు పోయిన సందర్భాలూ చాలానే ఉన్నాయి. అయితే అత్తా కోడళ్ల గొడవలోకి మగాళ్లు వెళ్లే సాహసం చేయరని అందరికీ తెలిసిందే. ఒకవేళ వెళ్లినా.. లేదా అటు తల్లికి, భార్యకు మధ్య సర్దిచెప్పలేక, వాళ్ల సమస్యలు పరిష్కరించలేక తలలు పట్టుకోవాల్సిందే. తాజాగా ఇద్దరు అత్తా కోడళ్లు గొడవపడిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే ఇది అట్టాంటి ఇట్టాంటి పంచాయితీ కాదు. అత్తా కోడళ్లు ఇద్దరూ ఒకరిపై ఒకరు భయంకరంగా దాడి చేసుకునే వరకు పోయింది. వంటింట్లో కూర్చొని ఒకరు జుట్టు ఒకరు పట్టుకొని దారుణంగా కొట్టుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో జరిగింది. అరవింద్ కుమార్, ప్రీతి దేవి కొన్నాళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అరవింద్ తన తల్లిదండ్రులు భూప్ ప్రకాష్, రాణి దేవితో కలిసి గాంధీ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివిసిస్తున్నారు. అరవింద్ నిరుద్యోగి కావడంతో ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి. గతంలో ప్రీతి తన అత్త రాణి దేవిపై దాడి చేసిందని ఆరోపణలు వచ్చాయి. అయితే ఈసారి రాణి కోడలపై దాడి చేసింది. ఆమెను తలను నేలకేసి కొట్టడం, కాలితో తన్నడం, గోడకేసి నెట్టడం వీడియోలో కనిపిస్తోంది. కోడలు ఏడుస్తూ అత్తను ఆపడం కూడా చూడవచ్చు. ఇక విచిత్రం ఏంటంటే ఈ తంతంగాన్ని మొత్తం మహిళా కొడుకే వీడియో తీయడం కొసమెరుపు. అంతేగాక దీనిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కాగా వంట పేరుతో అత్త రోజు దూషించేదని, మగ పిల్లాడిని కనలేదనే కారణంతో వేధించేదని కోడలు ప్రీతి ఆరోపించింది. అయితే అత్త వర్షన్ ఇందుకు విరుద్దంగా ఉంది. తనకు ఒక్కడే కొడుకు కావడం, ఇతర సంతానం ఏం లేకపోవడంతో వారు నివసించే ఇంటిని తన పిల్లల పేరు మీద రాయాలని కోడలు బలవంతం చేస్తుందని రాణి ఆరోపిస్తుంది. ఇక దీనికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేని పోలీసులు చెబుతున్నారు. వైరల్ అయిన వీడియో ఆధారంగా సదరు మహిళలపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. #उत्तरप्रदेश : #अलीगढ़ में बहू के तीन बेटियां पैदा होने पर नाराज सास ने बहू से की मारपीट#Violence #fightvideos #viralvideo #UttarPradesh #DelhiRains #OperationVijay #Gadar2Trailer #Haryanaclerk35400 #KargilVijayDiwas #अध्यात्म_के_शिरोमणि pic.twitter.com/XDLtOPeNs6 — NCR Samachar (@ncrsamacharlive) July 26, 2023 -
రింకూ సింగ్ గొప్ప మనసు.. తనలా కష్టపడకూడదని
ఐపీఎల్ 16వ సీజన్లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో ఐదు సిక్సర్లు బాది కేకేఆర్‌ను గెలిపించి అందరి దృష్టిని ఆకర్షించాడు రింకూ సింగ్. మూడు నాలుగేళ్లుగా ఐపీఎల్ ఆడుతున్న రాని గుర్తింపు ఆ ఒక్క మ్యాచ్‌తో వచ్చేసింది. అతను కొట్టిన ఐదు సిక్సర్లు కేకేఆర్ అభిమానులతో పాటు క్రికెట్ ఫ్యాన్స్‌కు చిరకాలం గుర్తుండిపోతుంది. అయితే రింకూ సింగ్ మంచి క్రికెటర్ మాత్రమే కాదు.. గొప్ప మనసున్న వ్యక్తి కూడా. ఒకప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికి ఐపీఎల్ ద్వారా డబ్బు సంపాదిస్తూ రింకూ సింగ్ జీవితంలో స్థిరపడ్డాడు. అయితే తాను స్థిరపడడానికి ముందు అనుభవించిన కష్టాలు తెలిసినోడు గనుక.. పేద క్రికెటర్లకు అండగా నిలబడాలనుకున్నాడు. కనీస సౌకర్యాలు లేని పేద క్రికెటర్లకు హాస్టల్ నిర్మించాలనుకున్నాడు. ఈ విషయాన్ని రింకూ సింగ్ చిన్ననాటి కోచ్ జాఫర్ చెప్పాడు. కాగా రింకూ కోచ్ జాఫర్ అలీగఢ్ జిల్లాలో క్రికెట్ సంఘానికి చెందిన 15 ఎకరాల్లో అలీగఢ్ క్రికెట్ స్కూల్, అకాడమీ నిర్వహిస్తున్నాడు. ఇప్పుడు అక్కడే రింకూ సింగ్ హాస్టల్‌ను నిర్మిస్తున్నాడు. రూ. 50 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న హాస్టల్లో మొత్తం 14 గదులు ఉంటాయి. ఒక్కో గదిలో నలుగురు ట్రైనీ క్రికెటర్లు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. హాస్టల్లో ఏర్పాటు చేయనున్న క్యాంటీన్లోనే క్రికెటర్లు ఆహారం తినేలా వసతులు కల్పించారు. రింకూ సింగ్ నిర్మిస్తున్న హాస్టల్ ''క్రికెటర్‌గా ఎదిగే క్రమంలో తనలా కష్టపడకూడదనే ఉద్దేశంతో రింకూ సింగ్ హాస్టల్ నిర్మాణానికి పూనుకున్నాడు. మూడు నెలల కింద పని మొదలైంది. మరో నెల రోజుల్లో హాస్టల్ నిర్మాణం పూర్తవనుంది. ఐపీఎల్ పూర్తయ్యాకా రింకూ సింగ్ ఈ హాస్టల్‌ను ప్రారంభించనున్నాడు'' అని కోచ్ జాఫర్ పేర్కొన్నారు. 2017లో అప్పటి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్(ప్రస్తుతం కింగ్స్ పంజాబ్) రింకూ సింగ్‌ను కొనుగోలు చేసింది. 2017లో పంజాబ్‌కు ఆడిన రింకూ.. 2018లో రూ.80 లక్షలకు కేకేఆర్ కొనుగోలు చేసింది. 2021లో మోకాలి గాయంతో ఐపీఎల్‌కు దూరమైన రింకూ సింగ్‌ను 2022లో జరిగిన మెగావేలంలో మరోసారి కేకేఆర్ రూ.55 లక్షలకు రిటైన్ చేసుకుంది. ఇప్పటివరకు 22 మ్యాచ్‌లాడిన రింకూ సింగ్ 425 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 58గా ఉంది. చదవండి: ధోని చేసిన తప్పు థర్డ్ అంపైర్‌కు కనిపించలేదా? "Because he's the Knight #KKR deserves and the one they need right now" - Rinku Singh 😎#GTvKKR #TATAIPL #IPLonJioCinema | @KKRiders pic.twitter.com/b1QrN3fLjX — JioCinema (@JioCinema) April 9, 2023 -
షాకింగ్.. 24 ఏళ్ల కుమారుడ్ని దారుణంగా కొట్టి చంపిన తండ్రి..
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ అలీగఢ్ జిల్లాలోని తారాపూర్ గ్రామంలో షాకింగ్ ఘటన జరిగింది. కన్నతండ్రే కుమారుడ్ని దారుణంగా కొట్టి చంపాడు. అనంతరం మృతదేహాన్ని ఓ బ్యాగులో తీసుకెళ్లి వ్యవసాయ క్షేత్రంలో పూడ్చిపెట్టాడు. ఈ ఘటనలో మృతుడ్ని రవి(24)గా గుర్తించారు పోలీసులు. అతని తండ్రి జయప్రకాశ్ నేరాన్ని అంగీకరించాడు. రవి వారం రోజులుగా కన్పించకపోవడంతో అతని మామ శేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. హత్య విషయం వెలుగులోకి వచ్చింది. అయితే తన కుమారుడు తరచూ ఊర్లోవాళ్లతో గొడవపడుతున్నాడని, తనతో పాటు తల్లిపై కూడా దాడి చేస్తున్నాడని జయప్రకాశ్ విచారణలో పోలీసులకు చెప్పాడు. ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోకుండా ప్రవర్తిస్తున్నాడని, అందుకే ఆగ్రహంతో కొట్టి చంపినట్లు అంగీకరించాడు. కుమారుడ్ని హత్య చేసిన అనంతరం జయప్రకాశ్ ఊరి వదిలి పారిపోయినట్లు తెలుస్తోంది. కేసు విచారణకు కూడా మొదట సహకరించలేదని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత అతడే హత్యా నేరాన్ని అంగీకరించాడని వివరించారు. చదవండి: అమ్మా.. నన్ను క్షమించు.. అక్కను బాగా చూసుకో.. -
యూపీలో వర్షాలకు 10 మంది బలి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తమైంది. ఇళ్ల గోడలు కూలిన ఘటనలు, పిడుగుపాట్లతో 10 మంది చనిపోగా మరో 12 మంది గాయపడ్డారు. ఇటావా జిల్లా చంద్రపుర గ్రామంలో బుధవారం రాత్రి మూడు చోట్ల నివాసాల గోడలు కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు సహా ఏడుగురు మృత్యువాతపడగా మరో ముగ్గురు గాయపడ్డారు. ఇటావాలో 24 గంటల వ్యవధిలో 140 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ విభాగం తెలిపింది. ఫిరోజాబాద్‌లో ఇళ్ల గోడలు కూలిన ఘటనల్లో ఒక చిన్నారి సహా ఇద్దరు చనిపోగా మరో 8 మంది గాయపడ్డారు. బలరాంపూర్ జిల్లా బర్గద్వా సయీఫ్ గ్రామంలో పిడుగుపాటుకు గురై ఒక బాలుడు చనిపోగా మరొకరు గాయపడ్డారు. అలీగఢ్ జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న కుంభవృష్టితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శనివారం వరకు అన్ని విద్యాసంస్థలను మూసివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. -
12 ఏళ్లపాటు మహిళపై అత్యాచారం
లక్నో: 12 ఏళ్లపాటు ఓ అమ్మాయిపై వరుసకు చిన్నాన్న (సవితి తండ్రి సోదరుడు) అయిన వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చాడు. బాలికకు ఏడేళ్ల వయస్సున్నప్పుడు మొదలైన కామాంధుడి బలత్కారం.. ఆమెకు 19 ఏళ్లు వచ్చే వరకు పాల్పడుతూనే ఉన్నాడు. దాదాపు మూప్పై ఏళ్ల తర్వాత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని అలీగడ్ ప్రాంతానికి చెందిన బాలికకు చిన్నప్పుడే తండ్రి మరణించాడు. దీంతో తల్లి మరొకరిని వివాహం చేసుకుంది. సవితి తండ్రి సోదరుడు బాలికపై కన్నేశాడు. ఆమెకు 7 ఏళ్లు ఉన్నప్పుడు తొలిసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. జరిగిన దారుణాన్ని బాలిక తన తల్లికి వివరించగా.. ఆమె మౌనంగా ఉండాలని హెచ్చరించింది. అంతేగాక కడుపు నొప్పితో బాధపడుతున్న బాలికకు కొన్ని మాత్రలు ఇచ్చి ఆమె నోరూమూయించింది. దీంతో మరింత రెచ్చిపోయిన కామాంధుడు పలుమార్లు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అతనితోపాటు మరో మేనమామ కూడా చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా బాలికకు 19 ఏళ్ల వచ్చే వరకు వివిధ ప్రదేశాల్లో బాధితురాలిపై బలత్కారం కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత వీలయినంత వరకు వాళ్ళని ఆపడానికి యువతి తన శాయశక్తులా ప్రయత్నించింది. ఆమెకు 2011లో ఆర్మీ జవాన్‌తో వివాహమైంది. వీరికి ఇద్దరు అమ్మాయిలు.పెళ్లైన తరువాత కూడా ఎప్పుడూ పుట్టింటికి వెళ్లినా వాళ్లు తనపై అత్యాచారానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. చదవండి: ఫేస్బుక్లో యువకుడితో పరిచయం.. ఇంట్లో పిల్లలు నిద్రపోతుంటే అయితే మళ్లీ ఆ దుర్మర్గులకు చిక్కకుండా జాగ్రత్త పడింది. చివరకు మానసిక గాయాన్ని తట్టుకోలేక చివరికి తన భర్తకు తెలియజేసినట్లు ఆ మహిళ తెలిపింది. భర్త సహకారంతో 28 ఏళ్ల తర్వాత అలీఘడ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై ఇంతకు ముందే పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించారని బాధితురాలు వాపోయింది. తరువాత జాతీయ మహిళా కమిషన్, ఎస్ఎస్పీ, ముఖ్యమంత్రి ఫిర్యాదుల పరిష్కార పోర్టల్‌ను ఆశ్రయించడం ద్వారా చివరికి పోలీసులు కేసు స్వీకరించారు. ఐపీసీ 376, 323, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
కూతురుపైనే 32 ఏళ్లుగా తండ్రి అఘాయిత్యం.. పెళ్లైన తర్వాత కూడా..
దేశంలో మహిళలు, యువతులపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కుటుంబ సభ్యులే ఇలాంటి దారుణాలకు ఒడిగట్టడంతో ఏళ్లు గడిచినా బాధితులు తమ ఆవేదనను బయటకి చెప్పుకోలేకపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి యూపీలో చోటుచేసుకుంది. తండ్రే.. తన కూతురుపై 32 ఏళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్న ఘటన కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన బాధితురాలు తండ్రి తన చిన్నతనంలోనే మరణించారు. దీంతో, తల్లి రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు బాధితురాలి వయస్సు ఏడేళ్లు. అనంతరం.. ఆమెపై కన్నేసిన తండ్రి.. బెదిరించి బలాత్కారానికి పాల్పడ్డాడు. జరిగిన విషయం తల్లికి చెబితే ఊరుకొమ్మని నోరు మూయించేది. దీన్ని ఆసరాగా తీసుకున్న కసాయి తండ్రి.. మరింత రెచ్చిపోయి ప్రవర్తించేవాడు. ఈ క్రమంలో 2011లో ఆమెకు అలిగఢ్‌కు చెందిన ఓ జవానుతో వివాహం జరిగింది. తనకు వివాహం జరిగిన తర్వాతైన విముక్తి కలుగుతుందని భావించిన ఆమెకు మరోసారి నిరాశే ఎదురైంది. ఆమె.. పుట్టింటికి వచ్చిన ప్రతీసారి తన లైంగిక వాంఛను తీర్చుకుంటూనే ఉన్నాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే భర్తపై తప్పుడు కేసులు బనాయించి జైలుపాలు చేస్తానని బెదిరించేవాడు. దీంతో, తన భర్త ఆమెను.. పుట్టింటికి వెళ్తావా అని అడిగిన ప్రతిసారీ భయంతో వణికిపోయేది. ఇదిలా ఉండగా.. ఇటీవలే తన భర్త ఆర్మీ నుంచి వీఆర్ఎస్ తీసుకొని అలిగఢ్‌లోనే ఓ చిన్న వ్యాపారం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఓరోజున తనకు జరిగిన దారుణాన్ని భర్తకు చెప్పి బోరున ఏడ్చేసింది. ఆమె మాటలు విని షాకైన భర్త.. భార్యకు సపోర్టుగా నిలిచాడు. అనంతరం, వారిద్దరూ కలిసి పోలీసులను ఆశ్రయించారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సవితా ద్వివేది మాట్లాడుతూ.. మహిళ ఫిర్యాదులో కేసు నమోదు చేసుకున్నాము. కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
భార్య రోజూ స్నానం చేయడం లేదు.. విడాకులు కోరిన భర్త!
లక్నో: భార్య నుంచి విడాకులు కోరుతూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. అయితే భర్త విడాకులు కావాలని అడగడం పక్కన పెడితే ఇందుకు అతను చెప్పిన కారణం మాత్రం వింతంగా ఉంది. భార్య రోజూ స్నానం చేయడం లేదని చెబుతూ తనకు విడాకులు ఇప్పించాలని కోర్టులో పిటిషన్ వేశాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘర్‌లో చోటుచేసుకుంది. క్వార్సీ గ్రామానికి మహిళకు చందౌస్ గ్రామానికి చెందిన వ్యక్తికి రెండేళ్ల క్రితం వివాహం అవ్వగా.. ఏడాది వయసున్న పాప ఉంది. ఈ క్రమంలో రోజూ భార్య స్నానం చేయడం లేదని, స్నానం చేయాలని అడిగిన ప్రతిసారి ఆమె తనతో గొడవ పడుతుందని ఆమె నుంచి విడాకులు కావాలని కోరాడు. అయితే భర్తపై వ్యతిరేకంగా భార్య వుమెన్ ప్రొటెక్షన్ సెల్లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తనకు విడాకులు తీసుకోవడం ఇష్టం లేదని, వివాహ బంధాన్ని కొనసాగించాలనుకుంటున్నట్లు వివాహిత వెల్లడించింది. ప్రస్తుతం ఈ జంటకు అలీగఢ్ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ కౌన్సిలింగ్ అందిస్తోంది. చదవండి: లాయర్ దుస్తుల్లో వచ్చి కోర్టు ఆవరణలో కాల్పులు.. నలుగురు మృతి ప్రతిరోజూ స్నానం చేయడం లేదనే సాకుతో భర్త తనకు ట్రిపుల్ తలాక్ ఇచ్చాడని ఒక మహిళ తమకు వ్రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చిందని వుమెన్ ప్రొటెక్షన్ సెల్ కౌన్సిలర్ తెలిపారు. వారి వివాహ బంధాన్ని కాపాడటానికి భర్తభర్తలిద్దరితోపాటు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ అందిస్తున్నామన్నారు. వారు తమ వైవాహిక జీవితాన్ని కొనసాగించాలని, భర్తతో ఆమె సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నట్లు కౌన్సిలర్ తెలిపారు. అయితే భర్త మాత్రం తనకు విడాకులు కావాలనే పదేపదే చెబుతున్నాడని, భార్య నుంచి విడాకులు తీసుకోవడంలో సాయం చేయాలని తమకు ఓ అప్లికేషన్ కూడా ఇవ్వాలని కోరినట్లు వెల్లడించారు. కానీ చిన్న చిన్న సమస్యలకే వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోవద్దని తాము సూచించినట్లు తెలిపారు. విడాకులతో పిల్లల భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని చెప్పి అతన్ని నచ్చజేప్పుతున్నట్లు పేర్కొన్నారు. వారికి ఆలోచించడానికి మహిళా రక్షణ సెల్ కొంత సమయం ఇచ్చింది. అంతేగాక విడాకుల దరఖాస్తుకు భర్త చెప్పిన కారణం ఏ హింసాత్మక చట్టం, మహిళలపై నేరం కిందకు రాదు కాబట్టి, పిటిషన్ ముందుకు సాగదన్నారు. కౌన్సిలింగ్ సహాయంతో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. చదవండి: హెయిర్ కటింగ్‌లో పొరపాటు.. రూ.2 కోట్ల ఫైన్ -
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో... యూపీకి ప్రయోజనం
అలీగఢ్: ఉత్తరప్రదేశ్‌లో 2017కి ముందు గూండాలు, మాఫియాలు రాజ్యమేలారని ప్రధాని మోదీ ఆరోపించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో పరిస్థితులన్నీ మారిపోయాయని అన్నారు. యూపీలోని అలీగఢ్‌లో రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ స్టేట్ యూనివర్సిటీకి ప్రధాని మంగళవారం శంకుస్థాపన చేశారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీయే అధికారంలో ఉండడంతో యూపీ ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుతోందని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తోందన్న యోగి ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఒకప్పుడు సంక్షేమ పథకాలు అమలు చెయ్యాలంటే అడుగడుగునా అడ్డంకులే ఉండేవని, యోగి సీఎం అయ్యాక సంక్షేమ ఫలాలన్నీ నేరుగా లబ్ధిదారులకు చేరుతున్నాయని అన్నారు. రాజా ప్రతాప్ సింగ్ వంటి స్వాతంత్య్ర సమరయోధులు తమ జీవితాలు ఎలా త్యాగం చేశారో నేటి తరానికి తెలియకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఇంటి భద్రత కోసం వేసే తాళాలకు అలీగఢ్ ఎలా ప్రఖ్యాతి వహించిందో, సరిహద్దుల్లో రక్షణ అంటే కూడా అలీగఢ్ పేరే ఇక వినిపిస్తుందని మోదీ అన్నారు. అలీగఢ్ యూపీకే ఒక రక్షణ హబ్‌గా మారబోతోందని వ్యాఖ్యానించారు. అలీగఢ్‌లో ఏర్పాటు కానున్న రక్షణ పారిశ్రామిక కారిడార్‌కు సంబంధించిన ఎగ్జిబిషన్‌ను ప్రధాని సందర్శించారు. రక్షణ రంగంలో భారత్ సంపూర్ణ స్వావలంబన సాధించిందని అన్నారు. ఒకప్పుడు రక్షణ పరికరాలను దిగుమతి చేసుకునే వారిమని, ఇప్పుడు రక్షణ పరికరాలను ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామని అన్నారు. యుద్ధ విమానాలు, డ్రోన్లు, యుద్ధనౌకలకి సంబంధించిన పరికరాలన్నీ మేడ్ ఇన్ ఇండియావేనని ప్రధాని అన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని! జాట్ సామాజిక వర్గానికి చెందిన రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ స్మృత్యర్థం రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ ఏర్పాటు చేయనుండటం ఎన్నికల స్టంటేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. స్వాతంత్య్ర సమరయోధుడు, విద్యావేత్త, సంఘ సంస్కర్త అయిన రాజా ప్రతాప్ సింగ్ పేరుతో లోధా, జరౌలి గ్రామాల్లోని 92 ఎకరాల్లో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. దీనికి అనుబంధంగా 395 కాలేజీలు పని చేస్తాయి. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో జాట్ సామాజిక వర్గం బలంగా ఉంది. వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతన్నల ఆందోళన నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వంపై జాట్లు ఆగ్రహంగా ఉన్నారు. వారిని తమ దారిలోకి తెచ్చుకోవడానికే అదే సామాజిక వర్గానికి చెందిన రాజా ప్రతాప్ సింగ్ పేరుతో యూనివర్సిటీ ఏర్పాటుకు ఆగమేఘాల మీద ఆదిత్యనాథ్ సర్కార్ నిర్ణయం తీసుకుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. -
మహిళ ఒత్తిడితో 24 ఏళ్ల యువకుడి ఆత్మహత్య
ఆగ్రా: ఉత్తర ప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) హాస్టల్లో 24 ఏళ్ల టీచర్ ఉరి వేసుకుని మరణించడం కలకలం రేపింది. బాధితుడు అలీగఢ్‌లోని ఏఎన్సీ కాలేజ్‌లో అధ్యాపకుడిగా పనిచేస్తున్న అభిషేక్ కుమార్ సక్సేనాగా పోలీసులు గుర్తించారు. సక్సేనా గురువారం హాస్టల్ గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. అభిషేక్ గత వారం రోజులుగా తన వసతి గృహాన్ని ఖాళీ చేసి హాస్టల్ గదిలో ఉంటున్నాడు. అయితే ఆగ్రాకు చెందిన ఓ మహిళ ఒత్తిడి కారణంగానే అభిషేక్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ‘అభిషేక్ ఆత్మహత్యకు పాల్పడే సమయంలో ఒక మహిళతో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. ఆమె నా సోదరుడిని బ్లాక్మెయిల్ చేసింది’ అని బాధితుడి సోదరుడు ఆరోపించారు. యూపీలోని ఫిలిబిత్ అభిషేక్ స్వస్ధలమని పోలీసులు తెలిపారు. సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో బాధితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు చేయడంతో సెక్షన్ 306 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుందని సివిల్ లైన్స్ ఎస్హెచ్ఓ రవీంద్ర కుమార్ దుబే తెలిపారు. -
ఆడపిల్లలకు సెల్ఫోన్లెందుకు?
అలీగఢ్(యూపీ): ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ సభ్యురాలు మీనా కుమారి యువతులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఆడపిల్లలకు సెల్ఫోన్లు ఎందుకని ఆమె ప్రశ్నించారు. ఇంట్లోని ఆడపిల్లలు పరాయి యువకులతో కలిసి లేచిపోవద్దని అనుకుంటే సెల్ఫోన్ల నుంచి వారిని దూరంగా ఉంచాలని తల్లిదండ్రులకు సూచించారు. వయసొచ్చిన కుమార్తెలపై ఎల్లప్పుడూ ఓ కన్నేసి ఉంచాలని తల్లులకు హితబోధ చేశారు. ఆడపిల్లలకు సెల్ఫోన్లు ఇవ్వొద్దన్నారు. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే జాగ్రత్త పడాలన్నారు. యువతులు ఫోన్లలో యువకులతో మాట్లాడుతున్నారని, తర్వాత ఇద్దరూ కలిసి లేచిపోతున్నారని మీనాకుమారి తప్పుపట్టారు. సమాజంలో నేరాలు పెరగడానికి ఇది కూడా ఒక కారణమన్నారు. ఆడపిల్లలను కాపాడుకోవడంలో తల్లిదే ప్రధాన పాత్ర అని చెప్పారు. తల్లుల నిర్లక్ష్యం వల్లే బిడ్డలు లేచిపోవడం వంటి జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. చదవండి: విషాదం: కుటుంబ కలహాలతో ఐదుగురు కుమార్తెలు సహా... -
పెరుగుతున్న అలీగఢ్ కల్తీ మద్యం మృతుల సంఖ్య
అలీగఢ్: ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య శనివారానికి 22కు చేరింది. మరో 28 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలియజేశారు. వారంతా జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. లోధా, ఖైర్, జవాన్ పోలీస్‌స్టేషన్‌లో పరిధిలో 15 మంది వ్యక్తులు ఈ కల్తీ మద్యం కారణంగా మరణించారని జిల్లా అదనపు మెజిస్ట్రేట్ శుక్రవారం వెల్లడించారు. కేసుకు సంబంధించి అయిదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కలానిది నైతాని చెప్పారు. లిక్కర్ కల్తీకి కారణమని భావిస్తున్న అనిల్ చౌధరి కూడా వారిలో ఉన్నారని ఆయన వెల్లడించారు. అనిల్ సన్నిహితులైన రిషి శర్మ, విపిన్ యాదవ్‌ల కోసం గాలిస్తున్నామన్నారు. వారిపై రూ 50 వేల రివార్డు ప్రకటించినట్లు చెప్పారు. అనిల్ చౌధరికి మంచి రాజకీయ పలుకుబడి ఉన్నట్లు ఓ పోలీస్ అధికారి చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. (చదవండి: అనాథ పిల్లలకు ఉచిత విద్య) -
దారుణం: చిన్నారిపై 12 కుక్కలు ఒక్కసారిగా..
లక్నో: 7 ఏళ్ల బాలిక రోడ్డుపై వెళుతుండగా కుక్కల గుంపు ఒక్కసారిగా ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్‌లో జరిగింది. రోడ్డు మీద ఓ బాలిక తన దారిన తాను దుకాణం నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంటే.. ఆ దారిలోని కుక్కలు ఆమె మీదకు ఉరికాయి. దీంతో ఆ బాలిక భయపడి వాటి నుంచి తప్పించుకోవడానికి పరుగెత్తింది. ఈ క్రమంలో ఆ పరిసరాల్లోని 12 కుక్కలు ఒక్కసారిగా మూకుమ్మడిగా బాలిక మీదకు ఉరికాయి. దీంతో చేసేదేమిలేక బాలిక గట్టిగా కేకలు వేసింది. ఆ అరుపుల విని సమీంలోని ప్రజలు ఆమెను రక్షించడానికి పరుగెత్తారు. అక్కడ ఉన్న కుక్కలను తరిమేసి బాలికను రక్షించారు. అయితే ఈ ఘటనలో బాలిక తీవ్రంగా గాయపడడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ విషాద ఘటన అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ( చదవండి: వైరల్ వీడియో: అయ్యయ్యో.. తెలిసిపోయిందా ) -
దారుణం: ‘ప్లీజ్ మా చెల్లి వెంటపడొద్దు’
లక్నో: తన చెల్లి వెంట ఒకరు వెంట పడుతున్నాడని తెలిసి సోదరుడు కల్పించుకుని అతడికి సర్ది చెప్పాడు. ఇదే ఆ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. తన చెల్లి వెంటపడొద్దని హితవు పలికిన అతడిని నలుగురు వ్యక్తులు కలిసి స్కార్ఫ్‌తో దారుణంగా హత్య చేశారు. అంతటితో ఆగకుండా మీ అబ్బాయిని కిడ్నాప్ చేశాం.. రూ.20 లక్షలు ఇస్తే వదిలేస్తామని ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లా బజ్హేర గ్రామానికి చెందిన సురేంద్ర పాల్ ఐటీఐ చదువుతున్నాడు. ఇటీవల తన చెల్లి వెంట స్థానికుడు శివకుమార్ వెంటపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సురేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన చెల్లి వెంట పడొద్దని హితవు పలికాడు. దూరంగా ఉండాలని.. ఇకపై కనిపించవద్దని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో శివకుమార్ సరే అని చెప్పాడు. అయితే ఆమెకు దూరంగా ఉండడం శివ తట్టుకోలేకపోయాడు. జరిగిన విషయాన్ని శివ తన స్నేహితుడు భూపేంద్రకు చెప్పాడు. శివకు ఓదార్చిన భూపేంద్ర దీనికి ఓ పరిష్కారం చేస్తా అని హామీ ఇచ్చాడు. ఈ క్రమంలో సురేంద్ర పాల్‌ను కిడ్నాప్ చేసి హత్య చేయాలని ప్రణాళిక రచించాడు. సురేంద్ర, భూపేంద్ర దూరపు బంధువులు. ఈ చనువుతో సురేంద్రను మద్యం సేవిద్దామని భూపేంద్ర పిలిపించాడు. నిర్మానుష్య ప్రాంతంలో ఇద్దరూ మద్యం సేవించారు. అయితే సురేంద్రకు పీకల దాక భూపేంద్ర మద్యం తాగించాడు. అనంతరం స్కార్ఫ్‌తో సురేంద్రను దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని మధురకు సమీపంలోని యమున నదిలో విసిరేశాడు. అనంతరం మృతుడి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి ‘మీ అబ్బాయిని కిడ్నాప్ చేశాం. రూ.20 లక్షలు ఇస్తే వదిలేస్తాం’ అని బెదిరించారు. కంగారు పడిన కుటుంబీకులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా ఈ దారుణ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ హత్యలో శివకుమార్, రాహుల్ సింగ్, రతన్ సింగ్ పాత్ర కూడా ఉందని తేలింది. దీంతో వారిని అలీఘర్ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. 364 ఏ, 302, 201 సెక్షన్ల కింద నిందితులపై కేసులు నమోదు చేశారు. యమున నది తీరంలో మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెల్లి ప్రేమ అన్న ప్రాణం మీదకు వచ్చిందని కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. చదవండి: ‘ఇటుక’ దొంగతనం చేశాడని హీరోపై ఫిర్యాదు చదవండి: ఆడియో క్లిప్ వైరల్: ‘నందిగ్రామ్‌లో సాయం చేయండి’ -
బొమ్మల ఫ్యాక్టరీలో పేలుడు; ముగ్గురు మృతి
అలీఘడ్ : ఉత్తరప్రదేశ్ అలీఘఢ్‌లోని బొమ్మల తయారీ ఫ్యాక్టరీలో మంగళవారం ప్రమాదవశాత్తు సిలిండర్ పేలడంతో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. అలీగఢ్ ఢిల్లీ గేట్ ప్రాంతంలోని ఖాతికన్ ప్రాంతంలోని ఒక భవనంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అలీఘఢ్‌లోని బొమ్మల తయారీ కర్మాగారంలో మంగళవారం సాయంత్రం సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి భవనం కుప్పకూలింది. పరిసరాల్లోని పలు ఇండ్లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. పేలుడు కారణంగా, భవనం పైకప్పు కుప్పకూలడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులపై శిథిలాలు పడ్డాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ముగ్గురు మరణించారు. కాగా క్షతగాత్రులను జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ దవాఖాన, మల్ఖన్ సింగ్ జిల్లా ఆసుపత్రులకు తరలించారు. సిలిండర్ పేలుడు ధాటికి పక్కనే ఉన్న ఐదు ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచే శిథిలాలను తొలగించే పని చేపట్టారు. స్థానిక వలంటీర్ల బృందాలు సహాయక చర్యలకు సహకరిస్తున్నాయి. కాగా ఏదైనా పేలుడు కారకాలకు సంబంధించిన పనులు జరుగుతున్నాయా అన్న కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నారని నగర పోలీసు సూపరింటెండెంట్ అభిషేక్ కుమార్ తెలిపారు. -
ప్లాన్ బెడిసికొట్టింది.. ఈసారి భార్య కూడా
లక్నో: మనుషుల్లో రోజురోజుకీ నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఎన్ని తప్పులైనా చేసేందుకు నేరగాళ్లు వెనకాడటం లేదు. హత్యలు చేస్తూ, మహిళలపై అకృత్యాలు కొనసాగిస్తున్న మృగాళ్లు, ఆధారాలను మాయం చేసే క్రమంలో ఘాతుకాలకు పాల్పడుతున్న ఉదంతాలను రోజూ చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల చోటుచేసుకుంది. అత్యాచారం, హత్య కేసులో నిందితుడిగా ఉన్న రాజ్ కుమార్ అనే వ్యక్తి కేసు నుంచి బయటపడేందుకు పక్కా పథకం రచించి అడ్డంగా దొరికిపోయాడు. డబ్బు ఆశజూపి ఓ వ్యక్తిని హతమార్చిన కేసులో మరోసారి అరెస్టయ్యాడు. సినిమా స్టోరీని తలపించే ఆ ఘటన వివరాలు.. యూపీకి చెందిన కుమార్‌పై హత్యానేరం, లైంగిక దాడికి పాల్పడ్డ ఘటనలో గతంలో కేసులు నమోదయ్యాయి. (చదవండి: ఆరేళ్ల చిన్నారిపై లైంగికదాడి.. మృతి) తన గుర్తింపును మాయం చేసేందుకు ఈ క్రమంలో అతడు ఇప్పటికే జైలు శిక్ష అనుభవించి బెయిలుపై బయటకు వచ్చాడు. కేసుల భయం వెంటాడటంతో ఎలాగైనా వాటి నుంచి విముక్తి పొందాలని భావించాడు. ఈ విషయం గురించి భార్య, తన అనుచరులతో చర్చించి ఓ పథకం రచించాడు. తన పోలికలతో ఉన్న వ్యక్తి కోసం అన్వేషించాడు. ఈ క్రమంలో సెప్టెంబరు 23న బులంద్‌షహర్‌లో ఓ మద్యం దుకాణం వద్ద ఉన్న మత్తులో జోగుతున్న బాధితుడికి డబ్బు ఇచ్చి మరింత మద్యం సేవించేలా ప్రోత్సహించాడు. ఆ తర్వాత తన దుస్తులు కూడా ఇచ్చి వేసుకోమని చెప్పాడు. ఇందుకు అతడు వెంటనే అంగీకరించి, కుమార్ చెప్పినట్లుగా చేశాడు. ఈ క్రమంలో కాసేపటి తర్వాత అక్కడికి చేరుకున్న కుమార్ భార్య, అనుచరుడు, బాధితుడిని సమీపంలో ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి హతమార్చారు. అనంతరం అతడి జేబులో కుమార్ ఆధార్ కార్డు, ఇతర గుర్తింపు కార్డులు పెట్టారు. ముఖం ఆనవాలు తెలియకుండా బండరాళ్లతో నుజ్జునుజ్జు చేశారు. ఆ తర్వాత కుమార్ అక్కడి నుంచి పరారై అజ్ఞాతంలోకి వెళ్లగా, సహ నిందితులు తమ తమ ఇళ్లకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని శవం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి విచారణ చేపట్టారు. మృతదేహం వద్ద దొరికిన కార్డుల ఆధారంగా అది కుమార్‌దేనని తొలుత భావించారు. అయితే లోతుగా దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది. దీంతో కుమార్ ఇంటికి వెళ్లి అతడి భార్యను ప్రశ్నించిన పోలీసులు, ఆమె చెప్పిన వివరాల ఆధారంగా కుమార్ జాడను ట్రేస్ చేశారు. అలీఘడ్‌లో అతడిని అరెస్టు చేశారు. అతడికి సహకరించిన భార్య, అనుచరుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై గతంలో హత్య, అత్యాచారం కేసు నమోదైందని, తన స్థానంలో మరో వ్యక్తి శవాన్ని పెట్టి, తన గుర్తింపును మాయం చేసేందుకే కుమార్ ఈ నేరానికి పాల్పడ్డట్లు వెల్లడించారు. -
‘నిరూపిస్తే.. రాష్ట్రం విడిచి వెళ్లిపోతాను’
లక్నో: బీజేపీ మాజీ మేయర్ ఒకరు ముస్లిం యువతుల మతం మార్చి.. వారికి హిందూ యువకులతో వివాహం జరిపిస్తున్నారని ఒక ముస్లిం యువతి ఆరోపించింది. ఈ మేరకు ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన యువతి అలీగఢ్ బీజేపీ మాజీ మేయర్ శకుంతల భారతిపై సంచలన ఆరోపణలు చేసింది. మాజీ మేయర్ తన సోదరిపై ఒత్తిడి తెచ్చి.. మతం మార్చి హిందూ యువకుడితో వివాహం చేశారని ఆరోపించింది. వివరాలు.. అలీగఢ్‌కు చెందిన ఓ ముస్లిం యువతి ఈ నెల 7న ఇంటి నుంచి వెళ్లిపోయింది. దాంతో ఆమె కుటుంబ సభ్యులు ఓ హిందూ యువకుడి మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ సోదరి ఇంట్లో నుంచి బంగారు నగలు, డబ్బు తీసుకుని ఓ హిందూ యువకుడితో పరారయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు యువతి కోసం గాలించడం ప్రారంభించారు. (వాజ్‌పేయితో ఉన్న వీడియోను షేర్ చేసిన మోదీ) ఈ లోపు యువతి కుటుంబ సభ్యులు బీజేపీ మాజీ మేయర్ శకుంతల భారతి ముస్లిం యువతుల మతం మార్చి.. వారిని హిందూ యువకులకు ఇచ్చి వివాహం చేస్తున్నారని ఆరోపించారు. దానిలో భాగంగానే తన సోదరికి హిందూ యువకుడితో వివాహం చేసిందని తెలిపారు. పోలీసులు ఇంటి నుంచి వెళ్లి పోయిన యువతిని గుర్తించి.. పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. సదరు యువతి తన ఇష్ట ప్రకారమే ఇంటి నుంచి వెళ్లి పోయి.. హిందూ యువకుడిని వివాహం చేసుకున్నట్లు పోలీసులకు తెలిపింది. తాను మేజర్‌నని.. వివాహం విషయంలో ఎవరి బలవంతం లేదని పేర్కొంది. ఆర్యసమాజంలో వివాహం చేసుకున్నట్లు తెలిపింది. తన సోదరి అసత్య ఆరోపణలు చేస్తుందని వెల్లడించింది. ఇందులో మాజీ మేయర్‌కు ఎలాంటి సంబంధం లేదంది. తాను హిందూ యువకుడిని వివాహం చేసుకోవడం తన కుటుంబ సభ్యులకు ఇష్టం లేదన్నది. అందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అని సదరు యువతి పోలీసులకు తెలిపింది. ఈ ఆరోపణలపై శకుంతల భారతి స్పందించారు. ‘సదరు యువతి వివాహం గురించి నాకు ఏం తెలియదు. అనవసరంగా నా మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు. అధికారులు దీని గురించి పూర్తిగా దర్యాప్తు చేసి వాస్తవాలను వెల్లడించాలి. వారు చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే.. నేను రాష్ట్రం విడిచి వెళ్లి పోతాను’ అన్నారు.