Rinku Singh Funds For Construction Of Sports Hostel For Poor Cricketers In Aligarh, Details Inside - Sakshi
Sakshi News home page

#RinkuSingh: రింకూ సింగ్‌ గొప్ప మనసు.. తనలా కష్టపడకూడదని

Published Tue, Apr 18 2023 5:56 PM | Last Updated on Tue, Apr 18 2023 7:32 PM

Rinku Singh Fund Construction Sports Hostel-For-Poor-Cricketers Aligarh - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో ఐదు సిక్సర్లు బాది కేకేఆర్‌ను గెలిపించి అందరి దృష్టిని ఆకర్షించాడు రింకూ సింగ్‌. మూడు నాలుగేళ్లుగా ఐపీఎల్‌ ఆడుతున్న రాని గుర్తింపు ఆ ఒ‍క్క మ్యాచ్‌తో వచ్చేసింది. అతను కొట్టిన ఐదు సిక్సర్లు కేకేఆర్‌ అభిమానులతో పాటు క్రికెట్‌ ఫ్యాన్స్‌కు చిరకాలం గుర్తుండిపోతుంది. అయితే రింకూ సింగ్‌ మంచి క్రికెటర్‌ మాత్రమే కాదు.. గొప్ప మనసున్న వ్యక్తి కూడా. 

ఒకప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికి ఐపీఎల్‌ ద్వారా  డబ్బు సంపాదిస్తూ రింకూ సింగ్‌ జీవితంలో స్థిరపడ్డాడు. అయితే తాను స్థిరపడడానికి ముందు అనుభవించిన కష్టాలు తెలిసినోడు గనుక.. పేద క్రికెటర్లకు అండగా నిలబడాలనుకున్నాడు. కనీస సౌకర్యాలు లేని పేద క్రికెటర్లకు హాస్టల్‌ నిర్మించాలనుకున్నాడు. ఈ విషయాన్ని రింకూ సింగ్‌ చిన్ననాటి కోచ్‌ జాఫర్‌ చెప్పాడు. 

కాగా రింకూ కోచ్‌ జాఫర్‌ అలీగఢ్‌ జిల్లాలో క్రికెట్‌ సంఘానికి చెందిన 15 ఎకరాల్లో అలీగఢ్‌ క్రికెట్‌ స్కూల్‌, అకాడమీ నిర్వహిస్తున్నాడు. ఇప్పుడు అక్కడే రింకూ సింగ్‌ హాస్టల్‌ను నిర్మిస్తున్నాడు. రూ. 50 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న హాస్టల్‌లో మొత్తం 14 గదులు ఉంటాయి. ఒక్కో గదిలో నలుగురు ట్రైనీ క్రికెటర్లు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. హాస్టల్‌లో ఏర్పాటు చేయనున్న క్యాంటీన్‌లోనే క్రికెటర్లు ఆహారం తినేలా వసతులు కల్పించారు.


రింకూ సింగ్‌ నిర్మిస్తున్న హాస్టల్‌

''క్రికెటర్‌గా ఎదిగే క్రమంలో తనలా కష్టపడకూడదనే ఉద్దేశంతో రింకూ సింగ్‌ హాస్టల్‌ నిర్మాణానికి పూనుకున్నాడు. మూడు నెలల కింద పని మొదలైంది. మరో నెల రోజుల్లో హాస్టల్‌  నిర్మాణం పూర్తవనుంది. ఐపీఎల్‌ పూర్తయ్యాకా రింకూ సింగ్‌ ఈ హాస్టల్‌ను ప్రారంభించనున్నాడు'' అని కోచ్‌ జాఫర్‌ పేర్కొన్నారు. 

2017లో అప్పటి కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌(ప్రస్తుతం కింగ్స్‌ పంజాబ్‌) రింకూ సింగ్‌ను కొనుగోలు చేసింది. 2017లో పంజాబ్‌కు ఆడిన రింకూ.. 2018లో రూ.80 లక్షలకు కేకేఆర్‌ కొనుగోలు చేసింది. 2021లో మోకాలి గాయంతో ఐపీఎల్‌కు దూరమైన రింకూ సింగ్‌ను 2022లో జరిగిన మెగావేలంలో మరోసారి కేకేఆర్‌ రూ.55 లక్షలకు రిటైన్‌ చేసుకుంది. ఇప్పటివరకు 22 మ్యాచ్‌లాడిన రింకూ సింగ్‌ 425 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 58గా ఉంది.

చదవండి: ధోని చేసిన తప్పు థర్డ్‌ అంపైర్‌కు కనిపించలేదా?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement