
లక్నో : ఓ ప్రైవేట్ శిక్షణ విమానం మంగళవారం ఉదయం అలీగఢ్‌లోని ధనిపూర్‌లో ల్యాండవుతుండగా రన్‌వేపైనే కూలిపోయింది.ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఆరుగురు వ్యక్తులు ఉన్నారు. విమానంలో ఉన్న ఆరుగురు వ్యక్తులూ సురక్షితంగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. మెయింటెనెన్స్ పనుల నిమిత్తం ప్రైవేట్ విమానం వీటీ-ఏవీవీ జెట్ అలీగఢ్‌లో ఉందని, విమానం ల్యాండవుతున్న సమయంలో విమానం వీల్స్‌కు కరెంట్ తీగలు తగలడంతో కుప్పకూలిందని తెలిసింది. కూలిన విమానానికి మంటలు అంటుకునే లోపే ఆరుగురు ప్రయాణీకులు అందులోంచి బయటకు రావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment