ఆ సినిమాకు వ్యతిరేకంగా నిరసన సెగలు! | Change title of Manoj Bajpai Aligarh: AMU students, groups demand | Sakshi
Sakshi News home page

ఆ సినిమాకు వ్యతిరేకంగా నిరసన సెగలు!

Published Sun, Feb 28 2016 11:59 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ఆ సినిమాకు వ్యతిరేకంగా నిరసన సెగలు! - Sakshi

ఆ సినిమాకు వ్యతిరేకంగా నిరసన సెగలు!

బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్‌ బాజ్‌పేయి తాజా చిత్రం 'అలీగఢ్‌' దేశమంతటా విడుదలైనా.. ఒక్క ప్రాంతంలో మాత్రం రిలీజ్‌కు నోచుకోలేదు.

బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్‌ బాజ్‌పేయి తాజా చిత్రం 'అలీగఢ్‌' దేశమంతటా విడుదలైనా.. ఒక్క ప్రాంతంలో మాత్రం రిలీజ్‌కు నోచుకోలేదు. అది ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ప్రాంతం. యూపీలోని మిగతా జిల్లాల్లో విడుదలైనా.. అలీగఢ్‌లో మాత్రం ఈ సినిమాపై నిషేధం విధించారు. ఇందుకు కారణం ఈ సినిమా టైటిలే కాదు.. ఇందులోని నేపథ్యం కూడా.

డైరెక్టర్ హన్సల్‌ మొహతా వివాదాస్పద ప్రాజెక్టు అయిన ఈ సినిమా.. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్ రామచంద్ర సిరాస్‌ జీవిత కథ  ఆధారంగా తెరకెక్కింది. స్వలింగ సంపర్కం కలిగి ఉన్నాడనే నెపంతో యూనివర్సిటీ అధికారులు ఆయనను ఏడేళ్ల కిందట సస్పెండ్ చేశారు. ఏఎంయూలోని తన నివాసంలో ఓ రిక్షా కార్మికుడితో ఆయన స్వలింగ సంపర్కం జరుపుతుండగా స్థానిక జర్నలిస్టులు అనుమానాస్పద స్టింగ్ ఆపరేషన్ ద్వారా ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చారు. దీంతో తప్పుడు ప్రవర్తన కింద వర్సిటీ ఆయనపై వేటు వేసింది.

తన సస్పెన్షన్‌పై కోర్టుకు వెళ్లి విజయం సాధించిన సిరాస్‌ ఆ తర్వాత వారం రోజులకే అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయారు. ఈ మొత్తం వ్యవహారాన్ని వెండితెరకు మీదకు తెచ్చిన ఈ సినిమాపై అలీగఢ్ వర్సిటీ విద్యార్థులు, కొన్ని సంఘాల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. యూనివర్సిటీని తప్పుడురీతిలో ఈ సినిమాలో చిత్రీకరించారని, ఈ సినిమా టైటిల్ ను వెంటనే మార్చాలని ఏఎంయూ విద్యార్థులు, పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement