aligarh movie
-
ఆ సినిమాకు వ్యతిరేకంగా నిరసన సెగలు!
బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పేయి తాజా చిత్రం 'అలీగఢ్' దేశమంతటా విడుదలైనా.. ఒక్క ప్రాంతంలో మాత్రం రిలీజ్‌కు నోచుకోలేదు. అది ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ప్రాంతం. యూపీలోని మిగతా జిల్లాల్లో విడుదలైనా.. అలీగఢ్‌లో మాత్రం ఈ సినిమాపై నిషేధం విధించారు. ఇందుకు కారణం ఈ సినిమా టైటిలే కాదు.. ఇందులోని నేపథ్యం కూడా. డైరెక్టర్ హన్సల్ మొహతా వివాదాస్పద ప్రాజెక్టు అయిన ఈ సినిమా.. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్ రామచంద్ర సిరాస్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. స్వలింగ సంపర్కం కలిగి ఉన్నాడనే నెపంతో యూనివర్సిటీ అధికారులు ఆయనను ఏడేళ్ల కిందట సస్పెండ్ చేశారు. ఏఎంయూలోని తన నివాసంలో ఓ రిక్షా కార్మికుడితో ఆయన స్వలింగ సంపర్కం జరుపుతుండగా స్థానిక జర్నలిస్టులు అనుమానాస్పద స్టింగ్ ఆపరేషన్ ద్వారా ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చారు. దీంతో తప్పుడు ప్రవర్తన కింద వర్సిటీ ఆయనపై వేటు వేసింది. తన సస్పెన్షన్‌పై కోర్టుకు వెళ్లి విజయం సాధించిన సిరాస్ ఆ తర్వాత వారం రోజులకే అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయారు. ఈ మొత్తం వ్యవహారాన్ని వెండితెరకు మీదకు తెచ్చిన ఈ సినిమాపై అలీగఢ్ వర్సిటీ విద్యార్థులు, కొన్ని సంఘాల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. యూనివర్సిటీని తప్పుడురీతిలో ఈ సినిమాలో చిత్రీకరించారని, ఈ సినిమా టైటిల్ ను వెంటనే మార్చాలని ఏఎంయూ విద్యార్థులు, పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
గే పాత్ర వేసినా మావాళ్లు ఏమీ అనరు!
తాను సినిమాలో 'గే' పాత్రలో నటించినా.. తన కుటుంబ సభ్యులు మాత్రం ఏమీ అనరని విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పేయి చెప్పారు. 'అలీగఢ్' అనే సినిమాలో ఆయన శ్రీనివాస రామచంద్ర సిరస్ అనే గే ప్రొఫెసర్ పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో ప్రొఫెసర్ మరో మగాడితో సన్నిహితంగా ఉన్నప్పటి వీడియో బయటపడటంతో అతడు సస్పెండ్ అవుతాడు. అయితే మళ్లీ ఉద్యోగం ఎలా సాధిస్తాడు.. ఆ ప్రయత్నంలో ప్రాణాలు ఎలా కోల్పోతాడన్నదే సినిమా కథ. ఈ సినిమాకు హన్సల్ మెహతా దర్శకుడు. ఇందులో రాజ్‌కుమార్ రావు జర్నలిస్టు పాత్రలో నటిస్తున్నారు. గే పాత్ర గురించి కుటుంబ సభ్యులు ఏమంటున్నారని అడిగినప్పుడు.. తాను సినిమాలోనే చేస్తున్న విషయం వాళ్లందరికీ తెలుసని, అలాగే తాను సంప్రదాయ పాత్రలు పోషించనన్న విషయం కూడా తెలుసని, అలాంటప్పుడు వాళ్లకు తాను ఏ పాత్ర చేసినా సమస్య ఉండదని చెప్పారు. తన తల్లిదండ్రులు, భార్య, పిల్లాడు అంతా ఎంతగానో ప్రేమిస్తారని, తాను చేసే పనిని కూడా వాళ్లు ప్రేమిస్తారని చెప్పారు.