
లక్నో : భారత్‌లో ఉండేందుకు ఇబ్బందులు పడుతున్న వారు పాకిస్తాన్ వెళ్లిపోవచ్చునని అలీఘర్ బీజేపీ ఎంపీ సతీశ్ గౌతమ్ అన్నారు. హిందుస్తాన్‌పై అక్కసు వెళ్లగక్కే దేశద్రోహులకు పాకిస్తాన్ ఎప్పుడూ ఆహ్వానం పలుకుతుందని ఆయన ఎద్దేవా చేశారు. అలీఘర్‌లో జరిగిన పౌరసత్వ నిరసనల్లో పాల్గొన్న ప్రముఖ కవి మునవ్వార్ రాణా కూతురు సుమైయా దేశంలో పరిస్థితులు బతికేందుకు అనువుగా లేవని, ఇక్కడ ఉండలేకపోతున్నామని అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సుమైయా వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఎంపీ పై వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో భావ ప్రకటనా స్వేచ్ఛకు కొదవ లేదని, ఆ స్వేచ్ఛ అందరికీ ఉంటుందని ఎంపీ సతీశ్ గౌతమ్ తెలిపారు. అయిష్టంగా, ఇబ్బందులు పడుతూ హిందుస్తాన్‌లో ఉండాల్సిన అవసరం ఏమిటని, సుమైయా స్వేచ్ఛగా పాకిస్తాన్ వెళ్లిపోవచ్చునని అన్నారు.
చదవండి :
కన్నడ బీజేపీ వివాదాస్పద ట్వీట్
సీఏఏ, ఎన్నార్సీలపై నిరసనలెందుకు?
Comments
Please login to add a commentAdd a comment