
సాక్షి బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గురువారం బెంగళూరులో జరిగిన సభలో పాక్‌కు అనుకూలంగా నినాదాలు చేసిన యువతి అమూల్య లియోనాకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అమూల్య వ్యాఖ్యలను ఖండిస్తూ పలు హిందూ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టాయి. తన కూతురు చేసిన తప్పుకు అమూల్య తండ్రి దేశ ప్రజలకు తాను క్షమాపణలు చెప్పారు. అమూల్య బెయిల్ కోసం న్యాయ పోరాటం చేయనని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కుట్ర జరుగుతోందని కర్ణాటక సీఎం బీఎస్ యడియూరప్ప ఆరోపించారు. ఆమెకు నక్సలైట్లతో సంబంధం ఉన్నట్లు తెలియవచ్చిందన్నారు.