సనా: అరేబియా మహాసముద్రంలో పైరేట్లు హైజాగ్ చేసిన ఇరాన్‌కు చెందిన అల్ కంబార్ చేపలబోటును భారత నేవీ రక్షించిన విషయం తెలిసిందే. ఈ చేపలబోటులో ఉన్న 23 మంది పాకిస్థాన్‌కు చెందిన సిబ్బందిని భారత నేవీ పైరేట్ల బారి నుంచి కాపాడింది.
23 మంది పాకిస్తాన్ సిబ్బంది తమను రక్షించిన భారత నేవీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వీరంతా ‘ఇండియా జిందాబాద్’ అని నినాదాలు చేశారు. ఐఎన్‌ఎస్ సుమేధ, ఐఎన్‌ఎస్ త్రిశూల్‌లు కలిసి 12 గంటల పాటు ఈ ఆపరేషన్ నిర్వహించి శుక్రవారం(మార్చ్ 29) తొమ్మిది మంది పైరేట్లను అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment